Okay as promised - here is the serious one!
నా నీకు!
నా మనో గవాక్షపుపార్శ్వంలోకి తొంగిచూస్తూ.. నీ కటాక్షవీక్షణాలేమైనా నాపై పడతాయేమో అని ఎంతగాఎదురుచూస్తానో.... తెల్సా?
మంత్రతుల్యమో మౌకికదండమో తెలీదు కాని! నువ్వు నాతో మాట్లాడకపోయినా, వేరే వాళ్ళతో నీ మాటల జలపాతాన్నిఎంతగా ఆస్వాదిస్తానో... తెల్సా?
గతామృతాల ఎండమావుల్ని దోసిళ్ళతో తాగలేక, ప్రస్తుత గరళాల్ని మింగలేక ఎంతటి అయోమయమో .... తెల్సా?
నీలాకాశపు వైశాల్యంలో, ఊడలు దిగిన మర్రిచెట్టులాంటి నిశ్శబ్దంలో నిష్క్రమణ ద్వారం కానక ఎంతటి అంధకారమో .... తెల్సా?
అవహేళనా ప్రహేళికల సప్తసాగరాల్ని ఆనందంగా దాటగల ఉపాయం ఏమైనా నీకు .... తెల్సా?
కలల ఆకరాలతో కాలాన్ని కొలుస్తున్నప్పుడు, దిగంతాల్ని దిగులు మేఘాలు కమ్మి వేస్తున్నప్పుడు చీల్చుకుంటు ఎలాబయటికి రావాలో ఏమైనా నీకు .... తెల్సా?
కన్నీటి కణాలు నిండిన కళ్ళల్లో ,విద్యుత్తులాగా ఆత్మదీపాల్ని వెలిగించే విద్వత్తు ఏమైనా నీకు .... తెల్సా ?
ఇంత ఆప్యాయంగా నీకీ ప్రేమలేఖ రాసి తీరా చూస్తే తపాలా బిళ్ళలంటించడానికి డబ్బుల్లేక ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.. తీరికచేసుకుని చదువుతావని ఆశిస్తూ..
- కలనైనా ప్రేమిస్తావా... కడదాకా వేచుంటాను!
- మరుజన్మకి కరుణిస్తావా...చితినుండి లేచొస్తాను!!
నా తోడుగా నువ్వుంటావనుకునే నేను!!
( lines marked 1 & 2 are not mine. Not sure where I read or heard but those lines stuck in my mind and the rest is mine )