• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Telugu lo navvullu puvvullu

380331904_3453491311572177_6392552495647119609_n.jpg
 
నా మాట విను.ఇలా పొద్దస్తమానం ఆఫీసుల చుట్టూ తిరగడమెందుకు?
ఓ రెండు వేలు కొట్టు.ఇలా నీ బర్త్ సర్టిఫికేట్ నీ చేతుల్లో పెడతా అని ఓ ఏజెంటు ఉపదేశం చేశాడు.
లేకుంటే అప్లికేషను తీసుకొని వ్రాసి,తహసీల్దారు ఆఫీసులో సంతకం చేయించుకొని తరువాత దాన్ని తీసుకొని ఆర్డీవో ఆఫీసులో ఇవ్వాలట.
మొత్తం పని జరగడానికి ఓ ఇరవై రోజుల పైనే పట్టేట్లుంది.

వేరే మార్గం ఉందేమో అని ప్రయత్నించాను.
ఎందుకూ.నేను ఈ ఊళ్లోనే పుట్టాను.కావాలంటే హాస్పిటల్ రికార్డ్స్ చూడండి అన్నాను.
బాబూ.అవన్నీ ఇప్పుడు చూడాలంటే కష్టం అని హాస్పిటల్లో అన్నారు.
నాకు చాలా అవసరం ఆ సర్టిఫికేట్.జేబులోంచి రెండు వేయి రూపాయల పచ్చ నోట్లు తీసి అతని చేతిలో పెట్టాను.
ఆ రోజు సాయంత్రానికల్లా బర్త్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది.

అప్పుడు తప్పు చేశానా అని ఆలోచించే సమయం లేదు.
కానీ నా మనసు ఇప్పటికీ సర్ది చెప్పలేకుంది ఆ విషయంలో.
 
మావా! బస్సు పోతాంది. బిన్యా రా అని కేకేసాడు రాజయ్య. సిన్నప్ప కాస్త వేగంగా నడుస్తూ బస్సు ఎక్కి ఓ సీట్లో కూలబడ్డాడు.

బస్సు పక్కనే ఉన్న టౌనుకు బయలుదేరింది. గవుర్నమెంటు మారింది. మట్టి రోడ్డు ఇప్పుడు సిమెంట్ రోడ్డయ్యింది. మనం మాత్రం క్రాపు లోను రెన్నివల్ కోసం తిరుగుతా ఉండాము అనె బస్సులో ఒకరు.

బూములు, లోన్లు, నార్లు ఇయ్యే ఇనుకుంటా బతుకు గడిసిపోతాంది. దుడ్లు సూసేది తక్కవ. కష్టం సేసేది ఎక్కువ అనె వాళ్ళల్లో ఒక పెద్దాయన.

ఆ బస్సులో బ్యాంకుకు పొయ్యే వాళ్ళల్లో క్రాపు లోను తీర్చలేని వాళ్ళు కొందరు. వేరే వాళ్ళ క్రాప్ లోనుకు రెన్నివల్ కమీషన్ కోసం డబ్బులు సర్దే వాళ్ళు కొందరు.

రైతుల ముచ్చట్లు ఇంటూ నాకివన్నే మామూలే అన్నట్టు బస్సు రోడ్డులో యవ్వారాలు పడతా టౌనుకు పోతా ఉంది
.
 
Ha next
 
ఇంకో రోజు ఎదురు చూసాడతను. ఆమె అదే దారిలో వెళుతోంది. చిన్న పిల్లలను దాక్కోమని అరుస్తూ, పెద్ద వాళ్ళను తిడుతూ రాత్రి పూట తిరుగుతోంది.

కొంత మంది ఆమెకు పిచ్చి పట్టింది అంటారు. కొంత మంది ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశారు అని అంటారు.

నేనీ రోజు ధైర్యం చేసి ఆమె ముఖం చూసాను. కోల ముఖం. కళ్ళు అదురుతున్నాయి. ఆమె చేసే సైగలు కొంత భయపెట్టినా ఆమె అందం అందరినీ ఆకర్షిస్తుంది.

ఎవరీమె. ఆమె దక్కితే అదృష్టమే అని వీధిలో కుర్రాళ్ళు, ఈ వీధిలోంచి ఆమె వెళ్లిపోతే చాలనుకునే ఆడవాళ్ళ మధ్య ఆమె రోజూ అలాగే తిరుగుతోంది. తిడుతూ. ఏదో వెతుక్కుంటూ, తచ్చాడుతూ..
 
సంజూ. రేపు ఒక్క రోజు నైట్ షిఫ్ట్ చెయ్యవా. కొలీగ్ మాధవ్ నుంచి రిక్వెస్ట్.

ఏం లేదు. వైఫ్ తో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కి వెళ్ళాలి అన్నాడు.

సరే మాధవ్. నెక్ట్స్ వీక్ నేను ఇంటికి వెళుతున్నా అప్పుడు అవసరం అయితే కొంచెం నా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని తన అవసరం కూడా చెప్పాడు సంజయ్. మాధవ్ తప్పకుండా చేస్తాను అని భరోసా ఇచ్చాడు.

రెండు రోజుల తరువాత..

శేఖర్ సార్. నాకు నెక్స్ట్ వీక్ లీవు కావాలి. మేనేజర్ ని అతి వినయంగా అడిగాడు వరుణ్. లీవు విషయంలో తప్ప మిగిలిన టైంలో ఎప్పుడూ మేనేజర్ కి ఇంత రెస్పెక్ట్ దొరకదు అని శేఖర్ నవ్వుకున్నాడు.

నెక్స్ట్ వీక్ కష్టం వరుణ్. హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్ ఉంది. ఏమైనా అర్జంటా.. అని ఆగాడు శేఖర్.

సార్. మ్యారేజ్ డే కి ట్రిప్ ప్లాన్ చేశాను అని చెప్పాడు వరుణ్.

సరే. ఒక పని చెయ్యి. నెక్స్ట్ వీక్ సంజయ్ కూడా లీవ్ అప్లయ్ చేశాడు. తను క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు నువ్వు వెళ్లొచ్చు అని ఐడియా ఇచ్చాడు శేఖర్.

వరుణ్ సంజయ్ దగ్గరికి వెళ్లి ప్లీజ్ సంజయ్. నెక్స్ట్ వీక్ లీవ్ క్యాన్సిల్ చేసుకోవా. నా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. వెకేషన్ ప్లాన్ చేసుకున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకో బ్రదర్ అని అడిగాడు.

లేదన్నా. నాకు ఇంపార్టెంట్ పని ఉంది. పైగా నేను నాలుగు నెలల నుండి లీవ్ పెట్టకుండా ప్లాన్ చేసుకున్నాను అని సమాధానం చెప్పాడు.

సరే. ఈ ఒక్క సారి హెల్ప్ చెయ్యి. బ్యాచిలర్ వి నీకే లీవ్ అంత అవసరం అంటే మరి నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో. కావాలంటే తరువాత నువ్వు లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా బాస్ తో నేను మాట్లాడుతాను అని అన్నాడు వరుణ్.

వరుణ్ రిక్వెస్ట్ చేయడం చూసి పక్కనే ఉన్న మాధవ్ కూడా పాపం. సంజూ హెల్ప్ చెయ్యొచ్చు కదా అని ఓ ఉచిత సలహా పారేశాడు.

ఈ మాటలతో సంజయ్ కి విసుగు వచ్చింది. అరె! నైట్ షిఫ్ట్ చెయ్యొచ్చు కదా బ్యాచిలర్ వి. రూములో ఏం చేస్తావు. లీవ్ ఎందుకు. బ్యాచిలర్ వి ఏం పనులుంటాయి.

బ్యాచిలర్ అయితే ఏం. బ్యాచిలర్స్ మనుషులు కాదా. వాళ్ళకి పేరెంట్స్ ఇంకా బాధ్యతలు ఉండవా? కాస్త ఫ్యామిలీతో ఆనందంగా గడపాలని, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లాలని ఉండదా?

అసలు బ్యాచిలర్ కి సంబంధించిన లీవులు, టైమింగ్ ఇలానే ఉంటుంది అని లేకపోతే ఇలానే ఉండాలి అని రాజ్యాంగంలో ఏమైనా వ్రాసుందా అని గట్టిగా అరవాలనుకున్నాడు సంజయ్.

ఈ లోపు శేఖర్ తన టీ కప్పు తీసుకుని బయటికి వచ్చి తాపీగా ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు.

వరుణ్ శేఖర్ వైపు చూశాడు. టీం కోసం మీలో మీరే అడ్జస్ట్ అవ్వొచ్చు కదా అని శేఖర్ ఒక డైలాగ్ వేశాడు.

సంజయ్ ఏం మాట్లాడలేదు.

అతడికి తను పని చేస్తున్న ఊరికి చాలా చాలా దూరంగా ఉన్న వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది. కొడుకు లీవు పెట్టుకుని వస్తాడు.

వచ్చినప్పుడు మంచి చెనిగ్గింజల (వేరుసెనగ గింజలు) రసం చేయాలని చెనిక్కాయలు వలుస్తూ కూర్చున్న అమ్మ గుర్తుకు వచ్చింది.
 
Last edited:
ఇంకో రోజు ఎదురు చూసాడతను. ఆమె అదే దారిలో వెళుతోంది. చిన్న పిల్లలను దాక్కోమని అరుస్తూ, పెద్ద వాళ్ళను తిడుతూ రాత్రి పూట తిరుగుతోంది.

కొంత మంది ఆమెకు పిచ్చి పట్టింది అంటారు. కొంత మంది ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశారు అని అంటారు.

నేనీ రోజు ధైర్యం చేసి ఆమె ముఖం చూసాను. కోల ముఖం. కళ్ళు అదురుతున్నాయి. ఆమె చేసే సైగలు కొంత భయపెట్టినా ఆమె అందం అందరినీ ఆకర్షిస్తుంది.

ఎవరీమె. ఆమె దక్కితే అదృష్టమే అని వీధిలో కుర్రాళ్ళు, ఈ వీధిలోంచి ఆమె వెళ్లిపోతే చాలనుకునే ఆడవాళ్ళ మధ్య ఆమె రోజూ అలాగే తిరుగుతోంది. తిడుతూ. ఏదో వెతుక్కుంటూ, తచ్చాడుతూ..
Intha typing chesava
 
Top