ఈ పాట విన్నప్పుడల్లా, ఇది మన 'సు ' కవి ఆత్రేయ రాసిందేమో అనుకునేవాడిని. ఈ మధ్య మళ్ళా విందామనిచూస్తే, క్రింద ఎవరో చేసిన కామెంట్ వల్లఅర్ధమైందేంటంటె ..ఇది శ్రీ శ్రీ రాసిందని. ఔరా! జగన్నాధ రధచక్రాల్ని భూమార్గం పట్టించిన శ్రీనివాసరావు కి మనసు గురించి కూడా తెలుసన్న మాట!
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము!
కామ క్రోధ మద మాత్సర్యాల అరిషడ్వార్గాల్ని అధిగమంచలేని తనం లో, .....ఎవరికైనా మనసున మనసై జీవితకాలం పాటు అల్లుకుని ఉండడం ఎలా సాధ్యం? అసలు సాధ్యమేనా? సాధ్యమైతే ఎలా?
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలొ ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము!
ఆహా! ఎంత బాగా చెప్పాడు! మహానుభావుడు ఎ బ్రాండు మందు తాగి రాశాడో! తీరని ఆశలెన్నో అయినప్పుడు, వేచి వేచి విసిగి వేసారి నీ చావు ?నువ్వు చావని వదిలేసి పోరా? ఆశయాలు, అడియాశలు లిజ్జత్ అప్పడాలు సగ్గుబియ్యం వడియాలు ఎవరికవసరం?
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకొసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకొసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము!
ఆత్మావలోకనం చేసుకుంటే, ఇంత దగ్గరగా నన్ను నన్నుగా... నా జీవన వైచిత్రినీ, వ్యధార్ధభరిత బాధా సప్తసతుల్నీ అక్కున చేర్చుకుని అల్లుకుపొయే వారేరీ? ఏ విలొమ విభ్రమ సంభ్రమాశ్చర్యాలకో మెదడు మొద్దుబారో, కళ్ళు బైర్లు కమ్మిన అసూయ రాగద్వేషాల ప్రభావం వల్లనో నమ్మకాల పునాదులపై ఎర్పడిన పరిచయాల్ని కూడా ' ముష్టీ లా విసిరెస్తే ఏం చెయ్యగలం?
చెలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హ్రుదయమే శిలయైపోగా
నీ వ్యధ తెలిసి నీడగ నిలచే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము!
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము!
వలపు వాకిళ్ళలో ఊహల ముంగిట్లో ఆశల ముగ్గులేసేస్తూ, జారుడుబండల హ్రుదయాల్లోకి తొంగి చూస్తూ ఆహా! నేనెంత గొప్పగా ప్రేమిస్తానో తెల్సా!? నేనంటే ఎంతమంది పడిచస్తారో తెల్సా?! తమతో ఉండడం కోసం పెళ్ళిళ్ళనే వాయిదా వేసేంత సహ్రుదయులో తెల్సా!? ఎదో తెలీని తీవ్ర శక్తులొ నడిపిస్తే బూతు పంచాంగ శ్రవణాలు చేసినప్పటికీ నా మనసు తెల్సుకుని సంగీత మాధుర్య రసఝరిలో ఓలలాడిస్తారో తెల్సా!? ..అని యధాలాపంగా కాకుండా అదే జీవన శ్రుతిలా అనేసుకుంటునప్పుడు... గుండె చప్పుళ్ళ అలికిడి అలజళ్ళు వినిపించవేమో కదా!
ఏమంటావోయ్ శ్రీనివాసరావ్? నువ్వవునంటావా ? కాదంటావా?
లేక మళ్ళా ఓ పెగ్గు బిగించి ……
ఓ మహత్మా ! ఓ మహర్షీ!!
ఏది చీకటి? ఏది వెలుతురు?
ఏది జీవితమేది మ్రుత్యువు?
ఏది ముష్టి ? ఏది నిష్టి?
ఏది పుణ్యం? ఏది పాపం?
ఏది నరకం? ఏది నాకం?
ఏది సత్యం? ఏదసత్యం?
ఏదనిత్యం? ఏది నిత్యం?ఏది ఏకం? ఏదనేకం?ఏది కారణమేది కార్యం?
ఓ మహత్మా ! ఓ మహర్షీ!!
ఏది తెలుపు? ఏది నలుపు?
ఏది దానం? ఏది మౌనం?
ఏది నాది? ఏది నీది?ఏది నీతి? ఏది నేతి?
నిన్న స్వప్నం ... నేటి సత్యం
నేటి ఖేదం ….రేపు రాగం
ఒకే కాంతి ....ఒకే శాంతి
ఓ మహర్షీ ! ఓ మహత్మా!!
అని నీ రధచక్రాల్ని నా మీదకి నడిపిస్తావా?!!!!
నువ్వు కాదు కానీ శ్రీనివాసరావ్, ఈ మధ్య మిట్టపల్లి సురేందర్ అనే ఆయన.....లోకం పోకళ్ళని కళ్లకు కట్టినట్టు భలే చెప్పాడు. ఇదిగో నీకొసం....క్రింద చూడు.
కలల ప్రపంచం, కల్లోల ప్రపంచం
కౌగిటబడి నలుగుతోంది నేటి ప్రపంచం
మాయాజాలం, జగమంతట గాలం
అరచేతిలొ కొలువైంది నాశనగాలం
ప్రతి ఇంటిని చుట్టుకుంది ఇంటరునెట్టు
అన్నింటికి ఇప్పుడదే ఆయువుపట్టు
తెల్లవారుదాక క్షణం ఆపరు చాటింగ్
ఎవరినెవరు చేస్తుంటరో తెలియదు చీటింగ్
నమ్మర ఓ నెటీజెన్సు తలమీదొట్టు
భలే చెప్పాడు కదా శ్రీనివాసరావ్!
నీ మాటల్లోనే చెప్పాలంటే... మనుషుల మనస్థత్వాల్ని తూచకుండా అనుభవించి పలవరించే దిశలో....నీరసపు కళా చతురులమల్లే అందాన్ని దూరం నుంచి చూసీ, సంతోషించీ, విచారించీ తప్పుకోడం చేతకాక, హ్రుదయం మీద ఉన్న ఇంకాస్త పెంకుల్ని ఎగరగొట్టుకొలేక... ఇంక శెలవోయ్. కానీ చీకటి ముసిరిన ఏకాంతపు తోడు కొసం ప్రయాణం మాత్రం నడుస్తూనే ఉంటుంది. చచ్చేలోపు ఆశ ల వ్యధ తీరకపోదా!? ఏమంటావ్! సరేనోయ్ శ్రీనివాసరావ్ ....ఇంక శెలవోయ్!