నటనకు నవత తరగని యువత
నీ రసహృదయం రాయని కవిత
నటనకు నవత తరగని యువత
నీ రసహృదయం రాయని కవిత
అభినయ సిరిగా అభినవ గిరిగా
వచ్చాడు రసరాజు
నిను చూసి మెచ్చాడు నటరాజు
శోధనలెన్నో ఎదురే ఐనా
సాధన మాత్రం నువు విడలేదు
చిన్ననాటి ఆ చిలిపితనానికి
ఆక్సిజన్ పెంచినావు
త్వరలోనే ఆస్కారు పొందుతావు
లోకమందున నిన్ను మించగా లేరు
నీదు పుట్టుక భరతమాతకే పేరు
లోక నాయకుడా లోక నాయకుడా
నీ వెంటే ఉంది లోకం
ఇక నీ కోసం
నారాయణునిది దశావతారం
నటనలో నీది నూరవతారం
ముసుగులు తీసి మనసులు తెలిసి
మనీషివైనావు