• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

వినాయకుడి తో ఒక రోజు !

( Note: This is my own write up and fiction. If you can’t read Telugu, please check in literature section for the translation)


వినాయకుడి తో ఒక రోజు !
_________________

చాలా రోజుల తర్వాత, నేనీ రోజు గుడికి వెళ్లాను.

ఆందుకు రెండు కారణాలున్నాయి.

మొదటిది: ఒరేయ్, Flushing Meadows గణేష్ temple కి ఎప్పుడైనావెళ్లావా? మన విజయవాడ "బాబాయ్ హోటల్" లో ఇడ్లీ ఎంతబాగుంటుందో, ఈ temple లో ఇడ్లీ అంత బాగుంటుంది అని ఒక స్నేహితుడుచెప్పడం ( ఇడ్లీ పలానా చోట బాగుంటుంది అని ఎవరైనా నాకుచెబితే, అక్కడికెళ్ళి తినేసే వరకు నా బుర్ర పని చెయ్యదు )

రెండోది: ఈ మధ్య ఒకావిడ - ఎప్పుడైనా గుడికి వెళ్లి దండాలు- ధస్కాలులేకుండా ఊర్కే కూర్చున్నారా? ఎంత positive vibes ఉంటాయో తెల్సా అనిఒక చిన్న సైజు క్లాసు పీకింది!

ఆ విధం గా ఒకే దెబ్బకి రెండు పిట్టలని, నేను ఎగేసుకుంటూ గణేష్ temple కివొచ్చాను.

నేను గుడికెళ్ళి ప్రతి సారీ చేసే విధంగానే, సరాసరి cellar లోఉన్న cafeteria లో దూరబోతున్నంతలో ...

"Ek.......Eka....Ekaaa....EkaaLustyaaaaa " అంటూ ఎవరో పిలుస్తున్నట్టుగాఅనిపించి వెనక్కి తిరిగి చూశా , అక్కడె వరు లేరు! అంతా నా భ్రమకాని, ఇక్కడ నన్ను తెలిసిన వాళ్ళెవరుOటారు!? అనుకుని మళ్ళా ఇడ్లీ వైపుపరుగేతబోయెం తలో...ఈ సారి ఇంకొంచెం కటువుగా, ఆజ్ఞాపిస్తున్నట్టు గావినబడిందా పిలుపు .."ఒరేయ్ , ఇడ్లీ ఏం పాచిపోదులేరా ..ఇలా రా ఒకసారి" అని. వెనక్కి చూద్దును కదా ! కంగారుగా, ఏదో కష్టం లో ఉన్నట్టు భూనభోంత రాళాలు దద్దరిల్లేలా అరుస్తున్నది, మరెవరో కాదు ...వినాయకుడే !!!

ఇప్పుడు ఈయనకొచ్చిన కష్టం ఎంటబ్బా అనుకుంటూ ..గణేష్ మహరాజ్వైపు నడిచా ..తనకి మాత్రమే సాధ్యమయ్యే చిరునవ్వుతో "అంత మంచి పేరుఉంచుకుని ఈ ముష్టి పేరేంట్రా నా నోటి తో అపభ్రంశపు మాటలుపలికిస్తున్నావ్ ? ఈ మధ్య ఇటు వైపే రావడం లేదేంటి? నేనొకడిని ఉన్నానన్నసంగతే మర్చిపోయావా? నువ్వు కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటార్రానన్ను ? " అని ఆప్యాయంగా భుజం మీద చెయ్యేసి పలకరించాడు.

"ఏంటి? ఇవి అడగడానికా, కొంపలు మునిగి పోయేట్లు పిలిచారు? నేనిం కేదోఅయిపోయిందనుకుని హడలి చచ్చా? ఈ మధ్య BridgeWaterVenkateswaraswamy temple లో ఇడ్లీలు బాగుంటే అటు పోతున్నా, ఇంతకీవిషయం ఏంటి? " అని అడిగా.

"ఒరేయ్, ఒరేయ్ ..నువ్వు, నీ ఇడ్లీ గోల సంతకె ళ్ళా, కనీసం పలకరించడానికికూడా రావెంట్రా?..సరే నీకోసం ఇడ్లీ బాగుండేట్లు చెయ్యమని గుడివంటవాడికి చెప్పానులే, తిని చావు....కానీ కొంచెం సేపు కూర్చో, సరే గానీ ఈకుడి కాలు కొంచెం లాగరా , కొన్ని యుగాలుగా ఒకే angle లో కూర్చోడంవల్ల, అస్సలు కాలుందో, లేదో అన్నంతగా తిమ్మిరెక్కేసింది. కొంచెం నొక్కిపెట్టుదూ?" అని చాలా జాలిగా మొహం పెట్టి చూస్తున్నాడు. "సర్లెండి, ఇక్కడఇంత మంది భక్తులు ఉన్నారు కదా, ఎవర్ని అడిగినా సాయం చేసేవాళ్ళుకదా? నన్నే పిలవాలా?" అనగానే మహానుభావుడికి నిజంగానే కోపంఒచ్చేసినట్టుంది .."ఎవడి పనుల్లో వాళ్లున్నారురా, నీ అంత పని బొంగులేకుండా ఉండేంత తీరిక ఎవరికుంది ? ముందు...మూసుకుని ఎదవప్రశ్నలు వెయ్యకుండా చెప్పింది చెయ్యి" అని కసిరాడు.

"సర్లే...ఒప్పుకున్నాక చెయ్యక చస్తామా" అనుకుంటూ ---వినాయకుడి కుడికాలు వొళ్ళో పెట్టుకుని పాదం నొక్కుతూ --"ఇప్పుడు చెప్పండి.. మీకబుర్లేమిటి, ఎలా ఉన్నారు, ఈ మధ్యేమైనా కైలాసానికి వెళ్ళొచ్చారా? అక్కడివిశే షా లేంటి ? తమ్ముడు, అమ్మ, నాన్న అంతా బాగున్నారా?" అంటూకుశల ప్రశ్నలు వెయ్యడం మొదలెట్టా. ఉన్నట్టుండి వినాయకుడిలో emotional angle తన్నుకొ స్తున్నట్లు కనబడుతోంది. "ఏం చెప్ప మంటావురా? నీ పనేబాగుంది, కనీసం year లో ఒక్కసారైనా ఇండియా వెళ్లి వొస్తుం టావు, నేనుకైలాసం వెళ్ళొచ్చి కొన్ని యుగాలు అయింది, అస్సలెప్పుడు వెళ్ళానో కూడాగుర్తులేదు, అప్పుడప్పుడు phone లో మాట్లాడ్డం తప్ప! మానవులిక్కడనన్నిలా కట్టిపడేశారు..ప్రొద్దున్న లేస్తే ఎవరికి వాళ్ళు పొర్లు దండాలుపెట్టేసి, ఎవరి కోరికల చిట్టా పద్దులు వాళ్ళు చెప్పెయ్యడం తప్ప నా బాగోగులుపట్టించుకున్న మానవ మాత్రుడు కనబడడం లేదు. ఎప్పుడు చూసినా అవేఉండ్రాళ్ళు, వడపప్పు వేరే వేరే వంటకాలు పెడుతున్నది కూడా లేదు. జిహ్వచచ్చి పోయింది రా. వీళ్ళు కోరే కోరికల్ని తీర్చడానికి నాకున్న ఒక్క జన్మాసరిపోయేట్టు లేదు. అయినా వీళ్ళ పిచ్చిగానీ, వీళ్ళ అంతులేనికోరికల్ని, అవసరాల్ని నామీద పడేసి - దేవుడా నీదే భారం అని నా చుట్టూతిరిగేస్తే లాభం ఏమిటి చెప్పు?" అని తన బాధని వెళ్ళ బోసుకోడంమొదలెట్టాడు

నేను అలానే కాళ్ళు నొక్కుతూ..మెల్లగా "ఊరు కోండి, స్వామీ- ఇదంతా మీరునేర్పిన విద్యయే కదా? అమ్మ, నాన్న - మీకు, తమ్ముడికి --ప్రపంచం చుట్టూమూడు సార్లు ఎవరైతే త్వరగా చుట్టి వస్తారో వాళ్ళే వివేకవంతులు -- అంటేమీరు, అమ్మ-నాన్న చుట్టూనే మూడు రౌండ్లు వేసేసి, తల్లిదండ్రులనిమించిన ప్రపంచం ఉందా అని డైలాగులేసి ..బిరుదులు కొట్టెయ్యలేదా? అలాగే జనాలేమైనా పిచ్చివాళ్ళా ? అందుకే మీ చుట్టూతిరిగేస్తున్నారు, తేలికగా పనులైపోతాయని, అనుభవించండి మరి " అన్నా. దానికాయన నా వొళ్ళో ఉన్న కాలు వెనక్కి లాక్కుంటూ " అబ్బా నీతో ఒచ్చినచిక్కే ఇదిరా, వేలికేస్తే కాలికేస్తావ్ -కాలికేస్తే , వేలికేస్తావ్ ; గట్టిగా అరిచిజనానికి లేని పోని ఐడియాస్ ఇవ్వకు " అంటూనే ----

"నా బాధ అది కాదురా, చూడు ఆ ఒచ్చిన వాళ్ళెవరైనా , కనీసం నా మొహంఅయినా చూస్తున్నారా? కళ్ళు మూసేస్కుని, ప్రపంచంలో మానవమాత్రులకిసాధ్యం కాని కోరికల్ని వెళ్ళ బుచ్చేసుకోడం తప్ప! అయినా రోజుకెన్ని లక్షలమంది నా కాళ్లు పట్టేసుకుంటారో తెల్సా? నా కాళ్ళు పచ్చి పుళ్ళైపోతున్నాయి, ఇన్ని యుగాలుగా ఇదే angle లో కూర్చుని నా నడుం కూడాపట్టేసింది. నాకైతే గుడుల నుండి బంధవిముక్తుడనై , స్వేచ్ఛగా నా మూషికంతో ప్రపంచాన్ని చుట్టి రావాలని ఉంది, అయినా మానవాళి కోరికలకి కూడాహద్దు పద్ధంటూ ఉండాలి కదరా! అయినా నాకెందుకో, వీళ్ళకి అయాచితంగా వొచ్చే సిరి సంపదలపై మోజుతో ఎడతెగని పరుగులు తప్ప, తమలోనిమానవీయ కోణాన్ని దర్శిం చుకుంటున్న దాఖలాలు ఎక్కడా కనబడ్డం లేదు......" అంతలో ఆపి ..అస్సలు నేను వింటున్నానా లేదా అన్నట్లు నా వైపుచూసి, నా మనసు - కళ్ళు ఎదురుగా ఉన్న ఎర్ర చీర భక్తురాలిపై ఉండడంచూసి ......నెత్తి మీద ఒకటేసి .....

"నా మటుకు నేను చెప్పుకుంటూ పోతుంటే ...నువ్వు వోచ్చేపోయే ఆడవాళ్ళవైపు ఆ చూపులేంటి రా? అయినా ఇంట్లో లక్షణం గా “గర్ల్ ఫ్రెండ్ " ఉందికదరా? ఇంకా ఆ దరిద్రపు చూపులేంటి?" అని గదమాయిస్తున్నట్లు గాచూసాడు. " చచ్చాం పో! ఈయన చూడనే చూశాడు" అని మనసులోఅనేసుకుని " అంటే అన్నాను , అంటారు కాని - మీరేమో ముగ్గురు ( సిద్ధి , బుద్ధి , రద్ది) భార్యలతో డ్యూయెట్ లు వేసేస్కో వొచ్చు, నేను మాత్రo వేరేవాళ్ళ వైపు చూస్తే తప్పేంటo ట ? ఈ నా ప్రాణానికి ఉన్నది ఒక్కటే జీవితంకదా? అయినా "గర్ల్ ఫ్రెండ్ " ఊర్లో లేదు కదా? ఏదోకొంచెం enjoy చేసుకుందామంటే , నాకు మీ ఈ దొబ్బుడేంటి?"

.......నా వాక్యం ఇంకా పూర్తి కానే లేదు ...తన రెండు చేతులుజాపి, ఆప్యాయం గా అక్కున జేర్చుకుని ..నా జుట్టు నిమురుతూ..."ఒరేయ్, మనిషి తను చేసే ప్రతి పని చుట్టూ ఒక కోట కట్టేసుకుని, తనుచేస్తున్నది మాత్రమే సరైనది, మిగిలిన వాళ్లకి తెలిసింది చాల తక్కువ అనేఅజ్ఞానం లో బతికేస్తూ దాన్ని సమర్ధించు కోడానికి (il)logical reasoning వెతికేస్తు, ఆహా ఎంత గొప్పగా ఎదుటి వాడిని బోల్తా కొట్టించే శామోకదా అనే క్షణి కానందం లో బతికేస్తుంటాడు. ఉన్న దాంట్లో సర్దుకుపోతే - అది మనస్సైనా, శ రీరమైన - నిన్ను మించిన మనీషి ఉండడు; నేనుచెప్పేది, ఎదుగు బొదుగు లేని జీవితం గడపమని కాదు, కలలుండాలి, కలల్నిమంచి వైపుగా నడిపించగలిగే విజ్ఞత ఉండాలి, కలల్ని సాకారం చేసుకునేకృషి ఉండాలి....ఎండమావులే కలలనుకునే మూర్ఖత్వం లోమిగిలిపోకు......అయినా నేను చెప్పేది నీ తలకి ఎక్కదు కానీ ...ముందెళ్ళి ఇడ్లీతిను ...నువ్వొస్తావని తెల్సు, అందుకే అల్లం పచ్చడి లో బెల్లం కూడావెయ్యమని చెప్పా, తినేసి అట్నుండి అటే పోకు, మళ్ళా నాకొచ్చి కనబడు"..అంటూ లేవదీశాడు.

నేనేదో trans లో ఉన్నట్లు నడుస్తూ ....క్రిందికి పోయి దొరికినన్ని ఇడ్లీలు తినేసి..మళ్ళా వొచ్చి ఒక స్తంబానికి ఆనుకుని కూర్చుని, వినాయకుడి వైపే తదేకం గాచూస్తున్నా. ఇంతకు ముందు వరకు వ్యంగ్యంగా కనబడిన అదేవినాయకుడు, నాకు ఇప్పుడు దివ్య తేజస్సు మూర్తీభవించినమహానుభావుడిలా కనబడుతున్నాడు! May Be Perceptions!!

భక్తుల హడావిడి ఎక్కువైంది , పిల్లలకి దేవుడిని ఏమేం కోరుకోవాలో, ఎలాదణ్ణం పెట్టాలో చెబుతున్న తల్లిదండ్రులు ; పొర్లు దణ్ణాలు పెట్టేస్తున్నభక్తులు, చీర కుచ్చిళ్ళు సరిచేసుకుంటూ ఎవరైనా నా వైపు చూసేస్తున్నారాఅని అందరి వైపు చూసేస్తూ నోట్లో ఏవో మంత్రాలు చదివేస్తున్న అతివలు..ఇలా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై పోయారు.

మళ్ళా వినాయకుడి వైపు చూశా, ఆయన భక్తుల్ని ఆశీర్వదించే పని లో బిజీగా ఉంటూనే నా వైపు చూసి " ఇక చూసింది చాల్లే కానీ, అప్పుడప్పుడుకనబడుతూ ఉండు లేదా కనబడుతూ ఉండు" అన్నట్లు ఒక చూపువిసిరి, తనకు తప్పని పనిలో నిమగ్నమై పోయాడు.

ఇక నేను కూడా వొచ్చిన positive vibes చాల్లే అనుకుంటూ ..లేచి ...అలానేనడుస్తూ Central Park Skating Rink దగ్గరికొచ్చి నిలబడ్డా. "గుళ్ళోభక్తులకి, ఇక్కడి పిల్లలకి ఎంత తేడా? తాము చేస్తున్న పనిలో ఆనందాన్నిఆస్వాదిస్తూ, పడి లేస్తూ - లేస్తూ పడుతూ మరలా skates మీదకిఎక్కుతూ, తమని ఓటమికి గురిచేస్తున్న balance ని సరిజేసుకుంటూ...మరలా పడుతూ .....ఏదో నిరంతర అధిరోహణం కనబడుతోంది వాళ్ళకళ్ళల్లో .....అది జీవితం లోకా?


ఏమో?!! నేనైతే ఇంటికె ళ్ళాలి ...అనుకుంటూ ...train station వైపునడుస్తున్నా..!!!


-EkaLustYa
27DEC2021
very thought provoking..unlike some recent shallow articles linking everything to ram mandir and raising questions for the sake of it. Lacking total awareness but to get consumed with mob mentality
 
Top