ఏనుగు చిన్న పిల్లగా ఉన్నప్పుడు దాన్ని బలమైన గొలుసులతో కట్టేస్తారు. అది విడిపించుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ దాని శక్తి సరిపోదు. కొన్నాళ్ళకు ఆ గొలుసుల నుండి విడిపించుకోలేనని తన ప్రయత్నాలు మానేస్తుంది. ఎప్పటికీ తను ఆ శృంఖలాలను తెంచుకోలేననుకుంటుంది. ఆ తర్వాత మావటివాడు ఎంత చిన్న తాడు కట్టినా విడిపించుకొనే ప్రయత్నం కూడా చెయ్యదు.
మనలో కూడా చాలా మంది అంతే. నాకు రాదు. నేను చెయ్యలేను. ఇది కష్టం, మేం పేదవాళ్ళం అనుకుంటూ భయాలకు బందీలైపోతాం. ప్రయత్నిస్తే మీ భయాలనే గొలుసులను అవలీలగా ఛేదించగలరు. మీరు గొప్ప శక్తిమంతులు. ఆ గున్న ఏనుగులా కృత్రిమ భయాల గుప్పిట్లో ఉండిపోయి మీకు మీరే అభివృద్ధి నిరోధకులుగా మారిపోకండి........
........!!!!.