Oka chinna Katha.
ఒక మనిషికి బాగా నిద్ర పట్టింది. నిద్రలో ఒక చిన్న కల. కలలో దేవుడు కనిపించి ఒక వరం కోరుకోమన్నాడు. మనిషి బాగా ఆలోచించి నాకు మరక అనేదే లేని ఒక ఇల్లు కావాలి అని అన్నాడు. దానితో పాటు పడుకోవడానికి ఒక పరుపు ఉండాలి అని అన్నాడు. ఆ పరుపు ఎలా ఉండాలి అంటే బయట చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం ఇవ్వాలి, వేడిగా ఉన్నప్పుడు చల్లదనం ఇవ్వాలి అని కోరాడు. దేవుడు నవ్వి, సరే తథాస్తు అన్నాడు. మనిషి నిద్ర లేచాడు. తన కల నిజమైనట్టు అనిపించింది. కళ్లు తెరిచి చూస్తే అమ్మ నవ్వుతూ తల నిమిరింది. అప్పుడు అర్ధం అయ్యింది మనిషికి. తను కోరుకున్న ఇల్లు అమ్మ ఒడి.
అమ్మ మనసు మచ్చ లేని ఇల్లు
అమ్మ ఒడిలోనే వెచ్చదనం
అమ్మ చూపే చల్లదనం
అమ్మ ఉంటే అవుతుంది జీవితం హరితవనం
మాతృమూర్తులకు ఇదే మా వందనం వందనం