• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Telugu mini inspiration kadhalu

పట్టుదలతో శ్రమిస్తే కొండనికూడ పిండిగా చేయగలరు," అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాలా సత్యంగా నిరూపించిన, ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ.





ఆయన పేరు "దశరథ్ మాంఝీ". ఆయన 14 జనవరి 1929 గెహూలుర్ బీహార్లో జన్మించారు. ఆయన పుట్టింది ఒక పేద కుటుంబం. ఆయన పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పని చేయాల్సి వచ్చింది. ఆయన వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న క్వారీలో పని చేసేవాడు. అక్కడికి వెళ్లాలంటే 300 అడుగు ల ఎత్తున కొండ చుట్టు కు వెళ్లాలి, ఆ కొండను చుట్టాల అంటే 32 కిలోమీటర్ల దూరం ఉంది. 32 కిలోమీటర్ల దూరం దాటాలంటే, సగం రోజులు పడుతుంది. దాంతో అందరూ కొండ ఎక్కి దిగి వెళ్లేవారు. ఆయనకు 26 ఏళ్ల ఉప్పుడు, ఆయన భార్య గర్భవతి. ఆయకు భోజనం ఇవ్వాలని ఒక రోజు వాళ్ళ ఆవిడ వెళ్లాలనుకుంటే. వెళ్లాలంటే కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. ఆవిడ సరే వెళదాములే అది బయలుదేరింది. కొండ ఎక్కలే సగం దారిలోనే చనిపోయింది. అది తెలిసిన మాంఝీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు, అద్దంలో తన భార్య చనిపోయింది, మాంఝీకి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య పోవడం ఆయన తట్టుకోలేకపోయాడు, ఆయనకు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇటు అటు చూస్తున్నాడు. అప్పుడే తన కళ్ళు ఆ పెద్ద కొండ పైన పడింది. తన భార్య చెడిపోవడానికి కొండే కారణమనుకంనాడు కొండు పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, ఒక రోజైంది, అందరూ ఆయన చెప్తున్నారు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు, కానీ అది ఏది పట్టించుకోకుండా పగలగొట్టాలనే ఆలోచనతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందరూ ఆయను చూసి నవ్వుతున్నారు, ఆయన అవేవి పట్టించుకోవటంలేదు. ఆయధ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. వానకి తడుస్తున్నాడు,యండకు యండుతునాడు. తను 48 ఏళ్లు కష్టపడి ఆ కొండ చిలచాడు. ఆయన ఇరవై రెండేళ్లు కష్టపడి కొండను చిలచేశాడు. ఆ కొండకి మధ్యలో ఒక దారి ఏర్పాటు చేశాడు. ఆ కొండయ్య దాటాలంటే 32 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, కానీ ఇప్పుడు మూడు కిలోమీటర్లు మాత్రమే.

అది చూసిన బీహార్ గవర్నమెంట్ ఆ దారికీ "దశరథ్ మంఝీ" అనే పేరు పేటింది. అలాగే ఆ ఊరిలో "దశరథ్ మంఝీ ఆస్పటల్ " కట్టించింది బీహార్ గవర్నమెంట్. అలాగే ఆయనకి "మౌంటెన్ మాన్" ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఇచ్చింది.

ఆయనకు 78 ఏళ్ళు ఉన్నప్పుడు,17 ఆగస్టు 2007 ,గాల్ బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధితో ఢిల్లీలో చనిపోయాడు.







మనం ఎన్నేళ్లు బతికామన్నది కాదు ముఖ్యం ,మన పేరు ఎన్నాళ్లు ఉన్నది అనేదే ముఖ్యం.
 
మిత్ర ద్రోహం చేస్తున్నానేమో...? ఆ తలంపుతో రాజేష్ మనసు కుదురుగా లేదు.



అసలు ఆకాష్ నన్ను ఆ మాట అడక్కుండా ఉండాల్సింది . వాడు నా స్నేహితుడైన మాత్రాన్న అంతస్తుల్లో నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పైగా ఒక కులం కూడా కాదు. అలాంటి వాడి చెల్లెలితో నా పెళ్లెలా అవుతుందని ఆశించాడు...? కోరికలు కోరడానికైనా ఒక హద్దు ఉండాలి . ఎంత స్నేహితుడు అయితే మాత్రం ఇంట్లో ఒప్పుకుంటారని ఎలా అనుకున్నాడు...? ఆకాష్ మాటల్ని మనసులోనే తలచుకుని తెగ బాధపడుతున్నాడు.



"ఒరే రాజేష్ నువ్వు ఏమీ అనుకోకపోతే ఒక మాట అడుగుతాను మన స్నేహాన్ని బంధంగా మార్చుకోవాలనుకుంటున్నాను. నీకెలాగూ బోలెడు ఆస్తుంది. మేమైతే రూపాయి కూడా ఖర్చుపెట్టి పెళ్లిచేయలేని పరిస్థితి. నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకోరా . మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్నట్టు ఉంటావు . ఓ ధనవంతుడికీ.... ప్రాణ మిత్రుడైన ఓ మంచి వాడికీ నా చెల్లెలు నిచ్చి పెళ్లి చేశానన్న ఆనందం నాకూ అంటుంది. నీకిష్టమేనా..."? అడిగాడు ఆకాష్.



స్నేహితుని మాట విన్నాకా...ఒక్క క్షణం అదిరిపడ్డాడు. కానీ అదేమీ కనిపించనీయకుండా... మిత్రుని మాటలకు నవ్వేసాడు రాజేష్గ్.



అలాగేరా...తప్పకుండా. నువ్వు నన్ను కోరి మరీ నీ చెల్లెల్ని ఇస్తానంటే ఎలా కాదంటాను. ఇంట్లో అమ్మా నాన్నల్ని కూడా ఒక్క మాటాడుగుతాను అన్నాడు.



స్నేహితుడు నుంచి ఆ చిన్న మాటవచ్చినందుకే ఎంతో ఆనందపడిపోయాడు ఆకాష్.



తన మనసులో ఉన్న మావయ్య కూతుర్ని పెళ్ళిచేసుకుంటే... అంతస్థుల తేడా ఉండదు. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆనందంగా మాపెళ్లి చేస్తారు. స్నేహానికి విలువిచ్చి వీడి చెల్లెల్ని చేసుకుంటే...పెళ్లీడుకొచ్చిన నా చెల్లెలుకి మంచి సంబంధాలు రావడం వెనకపడతాయి. మా స్నేహం పాడవ్వకుండా ఆకాష్ కి ఏదో ఒకటి చెప్పి నామీద ఆశలు పెట్టుకోనీకుండా చేయాలి అనుకున్నాడు రాజేష్.



పదిరోజులు పోయాకా..



"సారీరా...మీ చెల్లిని చేసుకోవడానికి మాతల్లిదండ్రుల్ని ఒప్పించలేకపోయాను. పెద్దవాళ్ళని కాదని ఈపెళ్లి చేసుకునే కంటే ఆగిపోవడమే మంచిదనిపిస్తుంది. వాళ్ళని కాదని చేసుకుంటే తర్వాత మామధ్య వచ్చే మనస్పర్ధలు తట్టుకోలేనని చెప్పేసాడు రాజేష్.



"పర్లేదులేరా...నేను తొందరపడి అడిగానేమో నిన్ను. ఏమీకోకు" అన్నాడే గానీ...



త్వరలో నీచెల్లి భూమికా నేను పెళ్లిచేసుకోబోతున్నామన్న విషయం నీకు తెలిస్తే...నీవెలా రియాక్ట్ అవుతావోననే... నాచెల్లి పెళ్లి వంకతో నిన్ను కదిపాను. ఇన్నేళ్ల మన స్నేహంలో... స్నేహంకంటే...ఆస్తులే నీకు ముఖ్యమని నాకూ తెలుసు. మా ప్రేమ విషయం చెప్తే ఎంత స్నేహితుడువైనా నువ్వూ శత్రువుగానే మారిపోతావు. అందుకే... నా స్వార్థంతో నీకు చెప్పలేకపోతున్నాను. అపరాధభావంతో... రాజేష్ కి మిత్ర ద్రోహం చేస్తున్నాననే అనుకున్నాడు ఆకాష్ కూడా....!!*
 
నాకు బాధ అంటే ఏంటో తెల్సింది తన వల్ల.... ఎప్పుడు ప్రేమ అలికిడి రాని గుండెల్లో ప్రేమ పుట్టినది తన వల్ల.....

అడగనదే అమ్మ ఐన పెట్టదు అన్న సామెత ఎలా ఉన్నా...... నేను ప్రేమిస్తూన్న అని చెప్పనిదె మనకి తిరిగి ప్రేమను ఎవరు ఇవ్వరు.... ఇది తెలియకే కదా నా కళ్లల్లో సమస్త సముద్రాన్ని.... నా మనసులో ఒక పర్వతాన్నె మోస్తున్న....

అనుకోని ఒక రాత్రి..... ఒంటరి గా భయం తో వెళ్తున్న నాకు తోడు నడిచావు..... భయం తో నిండిన మనసులో ధైర్యాన్ని నింపావు ..... నా పక్కనున్న నీలో మా నాన్న ని చూసేలా చేసావు.... ఏ అమ్మాయి ఐన తన నాన్న ల చూసేవాడినే గా కావాలి అనుకుంటాది....

అప్పటి నుండి ఏదో తెలియని ఆనందం నిన్ను చూస్తే.... ఏదో తెలియని భయం తిరిగి నువ్వు నన్ను చూస్తే..... ఏమిటో ఈ ప్రేమ దగ్గర అయితే బావుంటాది అనిపిస్తుంది కానీ పక్కకి వచ్చినా గుండె భయం తో గట్టిగా కొట్టు కుంటుంది......

ఎన్నో సార్లు చూసా నీకు చెప్పుధామూ అని కానీ చెప్పాలేక పోయా........అప్పటికే నా మనసు నాకు ఏదో చెప్పింది..... కానీ నేనే వినలేదు..... ఆ రోజు రానే వచ్చింది..... నా ఆశ లని ముంచే స్తూ.....నా మనసులో ఉన్న అమ్మమాయ్ పేరు చెపు తాను అన్నాావు.....ఎవరో అమ్మాయి పేరు చెప్పి... ఎన్నో ఆశల తో చూస్తున్నా కళ్లలో కన్నీళ్ళు నింపావు.... నా గుండెల్లో భారం పెంచావు..... నా మనసు మాట విన నందుకు ...... దాని ముందు నన్ను తల వంచేలా చేసావు.....

నాకు తెలుసు నువ్వు నా సొంతం కావు అని..... కానీ ఈ పిచ్చి మనస్సు కి అర్ధం కావట్ల..... నాకు తెలుసు ని మనసులో నేను ఉండలేను అని....కానీ ఈ గుండెకి చెప్పలేక పోతున్న..... ని జ్ఞాపకాలను చెరప లేక పోతున్నా...... పిచ్చి ప్రేమ.... నువ్వు వస్తావు అని ఇంకా ఎదురు చూస్తుంది.....

ఒక్కక్షణం నా మనసు మాట విని నీకు నా మనసులో ఉన్న మాట చెప్పి ఉంటే నువ్వు ఇప్పుడు నా పక్కన ఉండే వాడివి ఏమో....... ఇప్పుడు మన ప్రేమ కథని ఇలా ఫోన్ లో బాధతో రాయడం కాకుండా ని నా చేతితో మన భవిష్యత్తు ని రాసె వాళ్ళము......
 
I am inspired and motivated. By the way, how soon you want to get 63 points ?
 
నా మాట విను.ఇలా పొద్దస్తమానం ఆఫీసుల చుట్టూ తిరగడమెందుకు?

ఓ రెండు వేలు కొట్టు.ఇలా నీ బర్త్ సర్టిఫికేట్ నీ చేతుల్లో పెడతా అని ఓ ఏజెంటు ఉపదేశం చేశాడు.

లేకుంటే అప్లికేషను తీసుకొని వ్రాసి,తహసీల్దారు ఆఫీసులో సంతకం చేయించుకొని తరువాత దాన్ని తీసుకొని ఆర్డీవో ఆఫీసులో ఇవ్వాలట.

మొత్తం పని జరగడానికి ఓ ఇరవై రోజుల పైనే పట్టేట్లుంది.



వేరే మార్గం ఉందేమో అని ప్రయత్నించాను.

ఎందుకూ.నేను ఈ ఊళ్లోనే పుట్టాను.కావాలంటే హాస్పిటల్ రికార్డ్స్ చూడండి అన్నాను.

బాబూ.అవన్నీ ఇప్పుడు చూడాలంటే కష్టం అని హాస్పిటల్లో అన్నారు.

నాకు చాలా అవసరం ఆ సర్టిఫికేట్.జేబులోంచి రెండు వేయి రూపాయల పచ్చ నోట్లు తీసి అతని చేతిలో పెట్టాను.

ఆ రోజు సాయంత్రానికల్లా బర్త్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది.



అప్పుడు తప్పు చేశానా అని ఆలోచించే సమయం లేదు.

కానీ నా మనసు ఇప్పటికీ సర్ది
చెప్పలేకుంది ఆ విషయంలో.
 
పట్టుదలతో శ్రమిస్తే కొండనికూడ పిండిగా చేయగలరు," అని చెప్పిన పెద్దల మాటలను అక్షరాలా సత్యంగా నిరూపించిన, ఒక వ్యక్తి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ.





ఆయన పేరు "దశరథ్ మాంఝీ". ఆయన 14 జనవరి 1929 గెహూలుర్ బీహార్లో జన్మించారు. ఆయన పుట్టింది ఒక పేద కుటుంబం. ఆయన పుట్టింది పేద కుటుంబంలో కావడంతో చిన్నప్పుడే పని చేయాల్సి వచ్చింది. ఆయన వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న క్వారీలో పని చేసేవాడు. అక్కడికి వెళ్లాలంటే 300 అడుగు ల ఎత్తున కొండ చుట్టు కు వెళ్లాలి, ఆ కొండను చుట్టాల అంటే 32 కిలోమీటర్ల దూరం ఉంది. 32 కిలోమీటర్ల దూరం దాటాలంటే, సగం రోజులు పడుతుంది. దాంతో అందరూ కొండ ఎక్కి దిగి వెళ్లేవారు. ఆయనకు 26 ఏళ్ల ఉప్పుడు, ఆయన భార్య గర్భవతి. ఆయకు భోజనం ఇవ్వాలని ఒక రోజు వాళ్ళ ఆవిడ వెళ్లాలనుకుంటే. వెళ్లాలంటే కొండ ఎక్కి దిగి వెళ్ళాలి. ఆవిడ సరే వెళదాములే అది బయలుదేరింది. కొండ ఎక్కలే సగం దారిలోనే చనిపోయింది. అది తెలిసిన మాంఝీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు, అద్దంలో తన భార్య చనిపోయింది, మాంఝీకి ఏం చేయాలో తెలియలేదు. తన ప్రాణానికి ప్రాణమైన భార్య పోవడం ఆయన తట్టుకోలేకపోయాడు, ఆయనకు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇటు అటు చూస్తున్నాడు. అప్పుడే తన కళ్ళు ఆ పెద్ద కొండ పైన పడింది. తన భార్య చెడిపోవడానికి కొండే కారణమనుకంనాడు కొండు పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు, ఒక రోజైంది, అందరూ ఆయన చెప్తున్నారు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు, కానీ అది ఏది పట్టించుకోకుండా పగలగొట్టాలనే ఆలోచనతో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అందరూ ఆయను చూసి నవ్వుతున్నారు, ఆయన అవేవి పట్టించుకోవటంలేదు. ఆయధ నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. వానకి తడుస్తున్నాడు,యండకు యండుతునాడు. తను 48 ఏళ్లు కష్టపడి ఆ కొండ చిలచాడు. ఆయన ఇరవై రెండేళ్లు కష్టపడి కొండను చిలచేశాడు. ఆ కొండకి మధ్యలో ఒక దారి ఏర్పాటు చేశాడు. ఆ కొండయ్య దాటాలంటే 32 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి, కానీ ఇప్పుడు మూడు కిలోమీటర్లు మాత్రమే.

అది చూసిన బీహార్ గవర్నమెంట్ ఆ దారికీ "దశరథ్ మంఝీ" అనే పేరు పేటింది. అలాగే ఆ ఊరిలో "దశరథ్ మంఝీ ఆస్పటల్ " కట్టించింది బీహార్ గవర్నమెంట్. అలాగే ఆయనకి "మౌంటెన్ మాన్" ఆఫ్ ఇండియా అనే పేరు కూడా ఇచ్చింది.

ఆయనకు 78 ఏళ్ళు ఉన్నప్పుడు,17 ఆగస్టు 2007 ,గాల్ బ్లడ్ క్యాన్సర్ అనే వ్యాధితో ఢిల్లీలో చనిపోయాడు.







మనం ఎన్నేళ్లు బతికామన్నది కాదు ముఖ్యం ,మన పేరు ఎన్నాళ్లు ఉన్నది అనేదే ముఖ్యం.
Idi nijamga jarigina katha... real inspiration....
Bagundhi....
Akkada akkada akshara doshalu unnayi... chinnavi ayithey cheppedanni kadu andi... kani akkada aa akshara dosham valla meaning change ayipothundhi... sarichesukondi edit option lo :Like:
 
మావా! బస్సు పోతాంది. బిన్యా రా అని కేకేసాడు రాజయ్య. సిన్నప్ప కాస్త వేగంగా నడుస్తూ బస్సు ఎక్కి ఓ సీట్లో కూలబడ్డాడు.

బస్సు పక్కనే ఉన్న టౌనుకు బయలుదేరింది. గవుర్నమెంటు మారింది. మట్టి రోడ్డు ఇప్పుడు సిమెంట్ రోడ్డయ్యింది. మనం మాత్రం క్రాపు లోను రెన్నివల్ కోసం తిరుగుతా ఉండాము అనె బస్సులో ఒకరు.

బూములు, లోన్లు, నార్లు ఇయ్యే ఇనుకుంటా బతుకు గడిసిపోతాంది. దుడ్లు సూసేది తక్కవ. కష్టం సేసేది ఎక్కువ అనె వాళ్ళల్లో ఒక పెద్దాయన.

ఆ బస్సులో బ్యాంకుకు పొయ్యే వాళ్ళల్లో క్రాపు లోను తీర్చలేని వాళ్ళు కొందరు. వేరే వాళ్ళ క్రాప్ లోనుకు రెన్నివల్ కమీషన్ కోసం డబ్బులు సర్దే వాళ్ళు కొందరు.

రైతుల ముచ్చట్లు ఇంటూ నాకివన్నే మామూలే అన్నట్టు బస్సు రోడ్డులో యవ్వారాలు పడతా టౌనుకు పోతా ఉంది
.
 
ఇంకో రోజు ఎదురు చూసాడతను. ఆమె అదే దారిలో వెళుతోంది. చిన్న పిల్లలను దాక్కోమని అరుస్తూ, పెద్ద వాళ్ళను తిడుతూ రాత్రి పూట తిరుగుతోంది.



కొంత మంది ఆమెకు పిచ్చి పట్టింది అంటారు. కొంత మంది ఆ అమ్మాయిని ఇంట్లోంచి గెంటేశారు అని అంటారు.



నేనీ రోజు ధైర్యం చేసి ఆమె ముఖం చూసాను. కోల ముఖం. కళ్ళు అదురుతున్నాయి. ఆమె చేసే సైగలు కొంత భయపెట్టినా ఆమె అందం అందరినీ ఆకర్షిస్తుంది.



ఎవరీమె. ఆమె దక్కితే అదృష్టమే అని వీధిలో కుర్రాళ్ళు, ఈ వీధిలోంచి ఆమె వెళ్లిపోతే చాలనుకునే ఆడవాళ్ళ మధ్య ఆమె రోజూ అలాగే తిరుగుతోంది. తిడుతూ. ఏదో వెతుక్కుంటూ, తచ్చాడుతూ..
 
సంజూ. రేపు ఒక్క రోజు నైట్ షిఫ్ట్ చెయ్యవా. కొలీగ్ మాధవ్ నుంచి రిక్వెస్ట్.

ఏం లేదు. వైఫ్ తో కలిసి వెడ్డింగ్ రిసెప్షన్ కి వెళ్ళాలి అన్నాడు.

సరే మాధవ్. నెక్ట్స్ వీక్ నేను ఇంటికి వెళుతున్నా అప్పుడు అవసరం అయితే కొంచెం నా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని తన అవసరం కూడా చెప్పాడు సంజయ్. మాధవ్ తప్పకుండా చేస్తాను అని భరోసా ఇచ్చాడు.

రెండు రోజుల తరువాత..



శేఖర్ సార్. నాకు నెక్స్ట్ వీక్ లీవు కావాలి. మేనేజర్ ని అతి వినయంగా అడిగాడు వరుణ్. లీవు విషయంలో తప్ప మిగిలిన టైంలో ఎప్పుడూ మేనేజర్ కి ఇంత రెస్పెక్ట్ దొరకదు అని శేఖర్ నవ్వుకున్నాడు.



నెక్స్ట్ వీక్ కష్టం వరుణ్. హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్ ఉంది. ఏమైనా అర్జంటా.. అని ఆగాడు శేఖర్.



సార్. మ్యారేజ్ డే కి ట్రిప్ ప్లాన్ చేశాను అని చెప్పాడు వరుణ్.

సరే. ఒక పని చెయ్యి. నెక్స్ట్ వీక్ సంజయ్ కూడా లీవ్ అప్లయ్ చేశాడు. తను క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు నువ్వు వెళ్లొచ్చు అని ఐడియా ఇచ్చాడు శేఖర్.



వరుణ్ సంజయ్ దగ్గరికి వెళ్లి ప్లీజ్ సంజయ్. నెక్స్ట్ వీక్ లీవ్ క్యాన్సిల్ చేసుకోవా. నా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. వెకేషన్ ప్లాన్ చేసుకున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకో బ్రదర్ అని అడిగాడు.



లేదన్నా. నాకు ఇంపార్టెంట్ పని ఉంది. పైగా నేను నాలుగు నెలల నుండి లీవ్ పెట్టకుండా ప్లాన్ చేసుకున్నాను అని సమాధానం చెప్పాడు.



సరే. ఈ ఒక్క సారి హెల్ప్ చెయ్యి. బ్యాచిలర్ వి నీకే లీవ్ అంత అవసరం అంటే మరి నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకో. కావాలంటే తరువాత నువ్వు లీవ్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలన్నా బాస్ తో నేను మాట్లాడుతాను అని అన్నాడు వరుణ్.



వరుణ్ రిక్వెస్ట్ చేయడం చూసి పక్కనే ఉన్న మాధవ్ కూడా పాపం. సంజూ హెల్ప్ చెయ్యొచ్చు కదా అని ఓ ఉచిత సలహా పారేశాడు.



ఈ మాటలతో సంజయ్ కి విసుగు వచ్చింది. అరె! నైట్ షిఫ్ట్ చెయ్యొచ్చు కదా బ్యాచిలర్ వి. రూములో ఏం చేస్తావు. లీవ్ ఎందుకు. బ్యాచిలర్ వి ఏం పనులుంటాయి.



బ్యాచిలర్ అయితే ఏం. బ్యాచిలర్స్ మనుషులు కాదా. వాళ్ళకి పేరెంట్స్ ఇంకా బాధ్యతలు ఉండవా? కాస్త ఫ్యామిలీతో ఆనందంగా గడపాలని, ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లాలని ఉండదా?



అసలు బ్యాచిలర్ కి సంబంధించిన లీవులు, టైమింగ్ ఇలానే ఉంటుంది అని లేకపోతే ఇలానే ఉండాలి అని రాజ్యాంగంలో ఏమైనా వ్రాసుందా అని గట్టిగా అరవాలనుకున్నాడు సంజయ్.



ఈ లోపు శేఖర్ తన టీ కప్పు తీసుకుని బయటికి వచ్చి తాపీగా ఏం జరుగుతుందా అని చూస్తున్నాడు.



వరుణ్ శేఖర్ వైపు చూశాడు. టీం కోసం మీలో మీరే అడ్జస్ట్ అవ్వొచ్చు కదా అని శేఖర్ ఒక డైలాగ్ వేశాడు.



సంజయ్ ఏం మాట్లాడలేదు.

అతడికి తను పని చేస్తున్న ఊరికి చాలా చాలా దూరంగా ఉన్న వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది. కొడుకు లీవు పెట్టుకుని వస్తాడు.

వచ్చినప్పుడు మంచి చెనిగ్గింజల (వేరుసెనగ గింజలు) రసం చేయాలని చెనిక్కాయలు వలుస్తూ కూర్చున్న అమ్మ గుర్తుకు వచ్చింది.
 
ఒక ఊరి లో ప్రతి సంవత్సరం దేవుడిని ఊరేగింపు తీసుకెళ్లే సాంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని, పూజలు చేసి, ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి, మూగ్గులతో, తోరణాలతో, పువ్వులతో, చాలా అందంగా అలంకరించేవారు.

ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి, పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు.

మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్య వంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహ! చాలా చూడ ముచ్చటగా తయారు చేసేవారు.

ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. రాముడు అనే ఓక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి, బండి కట్టారు. గుడి ముందర నుంచోపెట్టి, దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలెట్టారు.

ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి, నమస్కారాలు పెట్టారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకుని భ్రమ పడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా, కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయిటికి పెట్టి నడిచాడు. తనలో తానె మురిసిపోయి, పొంగిపోయాడనుకోండి!



ఇక సాయంత్రంతో మళ్ళి ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా బజంత్రీలతో, గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలి తీలుకుని వెళ్లారు.

విగ్రహం బండిలోంచి దిగంగానే ఇంకేముంది? అందరు రాముడిని మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడిపాయి వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముడిని ఎడ్ల పాక లో తీసుకుని వెళ్లి అక్కడ వదిలేశారు. ఎవ్వరు దండాలు పెట్టలేదు.

అప్పుడు రాముడికి అర్ధమయ్యింది. మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని.
 
ఒక రోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది.

గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలెట్టాడు. పందికి చాలా భయమేసింది. అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది.

ఎలాగో కష్ట పడి గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వేళ్ళ సాగాడు. అప్పు డైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాన్ని మానాన్ని అది వదలకుండా మహా గోల పెడుతూనే వుంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందకి దుంకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది.

అలా గోల గోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనకున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది: “ఎందుకు అంత గోల పెడుతున్నావు? యెంత సిల్లీ గా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలా పట్టుకుని నడుస్తాడు. కానీ మేము ఎప్పుడు ఇలా గోల గోల పెట్టము. మర్యాదగా చెప్పిన మాట వింటాము”

వెనకున్న గొర్రెలన్నీ ఏదో ఎప్పుడు భయమంటే ఏంటో తెలీనట్టు మొహాలు పెట్టి తల ఊపుతున్నాయి.

దానికి పంది ఇలా జవాబు చెప్పింది. “మిమ్మల్ని గొర్రె లోడు జాగ్రత్త గా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి, మేతకు తీసుకువెళ్లి, మిగతా జంతువుల నుంచి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేమి చేస్తాడో తెలీదు కదా? నన్ను వొండుకు తింటాడో, ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో? నా భయం నాకు ఉంటుంది కదా!” నిజమే. ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా, సాహస మంతుల లా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయమంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్లని చూసి నవ్వకూడదు. వాళ్ళ కష్టం అర్ధం చేసుకోవాలి.
 
ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది.

మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకో ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం అయ్యింది.

పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు, అని. కాని ఆ పిచుక మాట వినలేదు.

ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది.

కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలీకా అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

“బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!” అని పిచుక ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు.

ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.
 
అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు వుండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా, కలిసి కట్టుగా ఉండేవారు.

ఆ ఊళ్ళో ఒక గుడి వుండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించి వారు.

అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతం గా వర్షాలు పడి, నది పొంగి, వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్ళు నిండి పోవడం మొదలయ్యింది.

ఊళ్ళో వున్న వారంతా వరదనుంచి తప్పించుకోవటానికి, తమ ఇళ్ళను వదిలేసి పయి ప్రాంతాలకు బయలుద్యారారు.

అందులో ఒక పెద్దమనిషి గుడి వైపు పరిగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయ పడ్డాడు- “వరద నీళ్ళు ఊళ్ళోకి వచ్చేసాయి, ఇంటి గడపల దాకా నీళ్ళున్నాయి, పరిస్థితి ప్రమాదకరంగా వుంది. మేము అందరం ఊరు వదిలి వెళ్లి పోతున్నాము, మీరు కూడా మాతో వచ్చేయండి!”

ఆ పూజారి ప్రశాంతంగా, “నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు. మీరు వెళ్ళండి.” అన్నారు. ఈ మాట విని ఆ పెద్దమనిషి వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి నీళ్ళు నడుము దాకా వచ్చేసాయి. పూజరిగారు గుడి గట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్న వారు కొంత మంది ఆగి, పూజారిగారిని కూడా బండి యెక్క మన్నారు. కానీ పూజారిగారు మట్టుకు, “నన్ను దేవుడే కాపాడతాడు!” అని గుడిలోనే వుండిపోయారు.

ఇంకొంచం సేపటికి నీళ్ళు మెడ దాకా వచ్చేసాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. “మీరు ఇంకా ఇక్కడే వున్నారా! ఇక్కడ వుండడం చాలా ప్రమాదం, నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి, మీరు మాతో రండి!” అన్నారు.

కాని వారితో కూడా పూజరిగారు, “మీరు వెళ్ళండి, నన్ను దేవుడే కాపాడతాడు” అన్నారు.

చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్ళు వచ్చేసరికి ఇంక ఖంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్ళు నిండిపోయాయి. పూజరిగారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంత సేపటికి దిగులు మొదలయ్యింది. ఎప్పటికీ వాన ఆగటంలేదు, చలి గా వుంది, నీళ్ళ ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించటంలేదు.

“దేవుడా! నేను నీకు ఏమి తక్కువ చేసాను? రోజు శ్రద్ధగా పూజలు చేసాను. నిన్నే నమ్ముకున్నాను! అయినా నన్ను కాపాడడానికి రావేంటి!” అని దేవుడితో ఫిరియాదు చేసుకోవడం మొదలెట్టాడు.

దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. “మూర్ఖుడా! నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను! నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేసావు. నువ్వు నన్ను గుర్తు పట్టకపోతే అది నా తప్పా?” అని మందలించి మాయమయిపోయాడు.

పూజారికి వెంటనే గ్యానోదయం అయ్యింది. చేసిన పొరపాటు గ్రహించి, క్షమాపణ కోరాడు.

కొంత సేపటికి మరో పడవలో కొంత మంది కనిపించారు. “పూజారి గారు! మీరు ఇంకా ఇకాడే వున్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ వుండడం మంచిది కాదు!” అన్నారు.

పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు.
 
శీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా జేరాడు.

ఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. అందరికి అతను యెంతో ధనవంతుదని, ప్రపంచమంతా చూసాడని తెలియాలని బాగా తపన పడేవాడు.

ఒక రోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ శీను ని పిలిచి, “శీను, వెళ్లి దుర్భిణి పట్టుకురా!” అన్నాడు. దుర్భిణి అంటే బైనాక్యులర్స్. శీను లోపలి వెళ్లి అడిగినట్లే దుర్భిణి తెచ్చి ఇచ్చాడు.

వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక, ఆ ధనవంతుడు శీనూను పిలిచి తిట్టాడు. “దుర్భిణి తెమ్మంటే తెచ్చేయడం కాదు! యే దుర్భిణి, లండన్ దా అమెరికా దా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుదినో అందరికి తెలిసేది?” అన్నాడు.

శీను తలవంచుకుని, “ఇకపైన అలాగే చేస్తాను సారూ” అన్నాడు.

కొన్ని రోజుల తరవాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చుని మాట్లాడుతుంటే హాల్ లో వున్న పులిచర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు.

ధనవంతుడికి అలవాటే కదా, బడాయిలు చెప్పుకుంటూ, “ఇది మా నాన్న గారు వేట కి వెళ్లి చంపిన పులి!” అంటూ, శీనుని పిలిచి, “మా నాన్నగారి ఫోటో వుండాలి తీసుకుని రా!” అన్నాడు.

వెంటనే అమాయకపు శీను, “యే నాన్నగారు సారూ, లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా?” అని అడిగాడు!
 
ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి.

ఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి జంతువులు నేగ్గేవి.

ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు గబ్బిలాలు మట్టుకు మోసం చేసాయి. ఏ జెట్టు గెలుస్తుంటే అటు వైపుకి మారిపోయి ఇటు జంతువులను, అటు పక్షులను రెండిటినీ మోసం చేసాయి. గబ్బిలాలు అంటే బాట్స్.

యుద్ధం జరుగుతున్నన్ని రోజులు యే జెట్టు ఈ విషయం గమనించలేదు.

ఇలా చాలా సంవత్సరాలు యుద్ధం జరిగేక పక్షులు, జంతువులూ బాగా అలిసిపోయాయి. ఇక యుద్ధం విరమించుకోవాలని నిశ్చయించి, సంధి చేసుకున్నాయి. ఇక మీద ప్రశాంతంగా వుండాలని, ఇలా ప్రాణహాని జరగకూడదని, ఒక నిర్ణయం చేసుకున్నాయి.

యుద్ధం ముగిసి పోయింది.

కాని, ఇప్పుడు గబ్బిలాలకు మట్టుకు ఏమి చేయాలో తెలియలేదు. ముందు పక్షుల దగ్గరకు వెళ్ళాయి. కానీ చాలా సార్లు గబ్బిలాలు పక్షులకు విపక్షంగా పోరాడాయని పక్షులు వాటిని దగ్గరకు రానీయలేదు.

పోనీలే అనుకుని గబ్బిలాలు మృగాల దగ్గరకు వెళ్ళాయి. మృగాలు వాటిని దుత్కారించాయి.

యే ఆశ్రయం లేని గబ్బిలాలు ఇటు పక్షులు కాలేక, అటు మృగాలు కా లేక వంటరిగా ఉండిపోయాయి
 
పింగళి వెంకయ్య ఒక తెలివైన విద్యార్థి మరియు స్వాతంత్య్ర ఉద్యమం పట్ల మక్కువ కలిగి ఉన్నారు. అతను మహాత్మా గాంధీతో సహా అప్పటి జాతీయ నాయకుల నుండి ప్రేరణ పొందాడు మరియు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. ఈ సమయంలో, భారతదేశం యొక్క స్వాతంత్య్ర పోరాటానికి ప్రాతినిధ్యం వహించే సార్వత్రిక చిహ్నం ఏదీ లేదని అతను గమనించాడు.

జాతీయ జెండా రూపకల్పన:

ఈ ఆలోచనే అతన్ని 1921లో బెజవాడ (ఇప్పుడు విజయవాడ)లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మహాత్మా గాంధీకి అందించిన భారత జాతీయ జెండాను రూపొందించడానికి దారితీసింది. జెండా మూడు సమాంతర చారలతో, పైభాగంలో కుంకుమ, తెలుపుతో రూపొందించబడింది. మధ్యలో మరియు దిగువన ఆకుపచ్చ, మధ్యలో స్పిన్నింగ్ వీల్ ఉంటుంది.

జాతీయ జెండా రంగుల వివరణ:

జెండాలోని ప్రతి రంగుకు ఒక నిర్దిష్ట అర్ధం ఉంది: కుంకుమ ధైర్యం, త్యాగం మరియు పరిత్యాగానికి ప్రతీక; తెలుపు స్వచ్ఛత, సత్యం మరియు శాంతిని సూచిస్తుంది; ఆకుపచ్చ విశ్వాసం, సంతానోత్పత్తి మరియు శ్రేయస్సును సూచిస్తుంది. స్పిన్నింగ్ వీల్(చరఖా) పురోగతి మరియు స్వయం సమృద్ధిని సూచిస్తుంది.

భారత జాతీయ జెండా రూపకల్పనను భారత జాతీయ కాంగ్రెస్ అంగీకరించింది మరియు 1947 ఆగస్టు 15న భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్ర పొందినప్పుడు మొదటిసారిగా ఎగురవేసింది. నేడు, భారతదేశం యొక్క జాతీయ జెండా భారతదేశ సార్వభౌమత్వానికి మరియు స్వాతంత్య్రం కి చిహ్నంగా ఉంది మరియు భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి పింగళి వెంకయ్య చేసిన కృషిని జరుపుకుంటారు మరియు స్మరించుకుంటారు.

పింగళి వెంకయ్య కథ మనకు పట్టుదల మరియు శృజనాత్మకత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. అనేక సవాళ్లు మరియు అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి ప్రాతినిధ్యం వహించే చిహ్నాన్ని సృష్టించాలనే తన కలను వెంకయ్య ఎప్పుడూ వదులుకోలేదు. అతను తన శృజనాత్మకత మరియు కల్పనను ఉపయోగించి మొత్తం దేశానికి ఏకీకృత చిహ్నంగా మారే జెండాను రూపొందించాడు.

అతని కథ మనకు దేశభక్తి మరియు ఒకరి దేశం పట్ల ప్రేమ యొక్క ప్రాముఖ్యతను కూడా బోధిస్తుంది. వెంకయ్యకు తన దేశం పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమ, భారతీయ ప్రజల విలువలు మరియు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే చిహ్నాన్ని రూపొందించడానికి అతన్ని ప్రేరేపించింది.

చివరగా, పింగళి వెంకయ్య కథ ఒక జాతి నిర్మాణంలో సృజనాత్మకత, పట్టుదల మరియు దేశభక్తి కలిగిన వ్యక్తి . మన లక్ష్యాల కోసం పని చేయాలని, ఎప్పటికీ వెనుకడుగు వేయకుండా, మన కోసం మరియు మన దేశం కోసం ఎల్లప్పుడూ మంచి భవిష్యత్తు కోసం ప్రయత్నించాలని ప్రేరేపించే కథ ఇది
 
Top