చావుబతుకుల మధ్య కొట్టుకుంటున్న ఓ వ్యక్తి భార్యాపిల్లలను పిలిచి చెప్పాడిలా. ముందు భార్యకి చెప్పాడిలా.
నువ్వు కూకట్‌పల్లిలో ఉన్న పది అపార్ట్‌మెంట్స్ తీసుకో!
పెద్దకొడుక్కి చెప్పాడిలా.
నువ్వు మియాపూర్‌లోని మూడుషాపింగ్ కాంప్లెక్సులూ, అక్కడి గుడీ తీసుకో!
రెండోవాణ్ణి పిలిచి చెప్పాడిలా.
నువ్వు ఎర్రగడ్డలోని రెండు గుళ్ళూ తీసుకో!
చిన్నవాణ్ణి పిలిచి చెప్పాడిలా.
నువ్వు మోతీనగరంతా తీసుకో!
కూతుర్ని పిలిచి చెప్పాడిలా.
నువ్వు కల్యాణ్‌నగర్లోని రెండు స్వీట్‌షాప్సూ తీసుకో!
చెప్పాల్సింది చెప్పి, చనిపోయాడతను. గమనించింది నర్స్. అడిగిందిలా.
మీ నాన్నగారు చాలా గొప్పవారిలా ఉన్నారే. సంపాదించిన ఆస్తి అంతటినీ పంచి మరీ పోయారు.
ఆస్తా పాడా! మాది పాలవ్యాపారం తల్లీ! పాలఖాతాలు అప్పజెప్పి చచ్చూరుకున్నాడు అన్నారు పిల్లలు.