• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Telugu Bhasha Dinotsavam - 29th August

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు.

ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి, లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి టెలివిజన్ మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు.

_114169109_21083549_1980267575547690_728461826267617241_o.jpg
 
Telugu Language Day


Telugu Language Day (తెలుగు భాషా దినోత్సవం "Day of the Telugu Language") is observed on 29 August each year in the State of Andhra Pradesh of the Republic of India.


This date was chosen to coincide with the birthday of the Telugu poet Gidugu Venkata Ramamurthy.

The Government of Andhra Pradesh provides funds and presents awards with the objective of the betterment of the Telugu language. The Department of Culture is responsible for organising the day on behalf of the Government of Andhra Pradesh.
 
Last edited:

తెలుగు భాషా దినోత్సవం: గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాషకు చేసిన కృషి ఇదీ


గిడుగు వెంకట రామమూర్తి (1863-1940) ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ముఖ్యుడు. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్త.

_114169107_69905828_901980450201231_7012732453840224256_o.jpg


ఆధునిక తెలుగు సాహిత్యానికి వైతాళికులని చెప్పదగ్గ ముగ్గురిలో.. వీరేశలింగం, గురజాడలతో పాటు గిడుగు కూడా ఒకరు. ఆయన తన జీవితకాలంలో అనేక జీవితాలపాటు చేయవలసిన మహోద్యమాలెన్నో చేపట్టారు. వాటిలో కొన్ని ఆయన జీవితకాలంలోనే ఫలితాలివ్వడం మొదలుపెట్టాయి. కొన్ని మహోద్యమాల ప్రాశస్త్యాన్ని అర్థం చేసుకోగలిగే స్థితికి జాతి ఇంకా పరిణతి చెందలేదు. ఒక విధంగా చెప్పాలంటే వాటి గురించిన అధ్యయనమే ఇంకా ప్రారంభం కాలేదు.

గిడుగు వారు అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించారు. 1880లో పర్లాకిమిడి సంస్థానంలో ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం మొదలుపెట్టారు. అప్పటినుంచి 1911 దాకా పర్లాకిమిడి సంస్థానంలో విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు.

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు తలకెత్తుకున్నారు. మధ్యలో 1913-14 కాలంలో విజయనగరంలో విజయనగరం సంస్థానంలో ఉద్యోగం చేసారు.

1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించినప్పుడు, ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి తాను స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే కడపటిరోజులు గడిపారు.

గిడుగు జీవితకాలంలో చేపట్టిన కృషి ఎన్నో శాఖలకు విస్తరించింది. వాటిలో ప్రధానంగా నాలుగు విభాగాల గురించి వివరించవలసి ఉంటుంది.
మొదటిది ఆయన ముప్పయ్యేళ్ళకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేసారు. పర్లాకిమిడి మునిసిపల్ కౌన్సిల్ సభ్యుడిగా, పాఠశాలల పరీక్షకుడిగా, పర్యవేక్షణాధికారిగా పనిచేసారు. 1813లో బ్రిటిష్ ఇండియాలో మిషనరీలో మొదటిసారిగా ప్రాథమిక పాఠశాలలు తెరిచారు.

అప్పటినుంచి 1835 దాకా పాతికేళ్ళ పాటు భారతదేశంలో విద్యపట్ల ఈస్టిండియా కంపెనీ ఎటువంటి వైఖరి అవలంబించాలి అన్నదాని మీద పెద్ద చర్చ జరిగింది. కొందరు ప్రాచీన భాషలైన సంస్కృతం, పారశీకాల్లో విద్యాబోధన జరగాలన్నారు. వాళ్ళని ఓరియెంటలిస్టులు అంటారు. కొందరు ఇంగ్లీష్‌లో విద్యాబోధన జరగాలని వాదించారు. వారిని ఆంగ్లిసిస్టులు అంటారు. ఈ చర్చను ముగిస్తూ మెకాలే 1835లో ఒక నిర్ణయం ఒక ప్రకటించారు. తరువాత ఆ మినిటు ఆధారంగా కంపెనీ ఆధ్వర్యంలో పాఠశాలల పాలనావ్యవస్థను ఏర్పాటు చేస్తూ సర్ ఛార్లెస్ వుడ్ 1854లో ఆదేశాలు విడుదల చేసారు.

మెకాలే, వుడ్ ఉద్దేశ్యం ప్రకారం విద్యాబోధన ఇంగ్లీషులో జరగాలి. అది ఆధునిక విద్య కావాలి. ఆ విద్యని అందిపుచ్చుకున్న మొదటి తరం భారతీయులు తాము అందుకున్న ఆధునిక విద్యని తిరిగి తమ తమ దేశభాషల్లో దేశప్రజలకి అందచేయాలి. కాని, 1882లో బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్ నివేదిక ప్రకారం ఆ ఆదర్శాలు నెరవేరనే లేదు.
ఈ పరిస్థితిని చక్కదిద్దాలని లార్డ్ కర్జన్ భావించారు. 1899 నుంచి 1905 కాలంలో ఆయన భారతదేశంలో వైస్రాయిగా పనిచేసిన కాలంలో విద్యకి సంబంధించిన ఎన్నో సంస్కరణలు మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో విద్యారంగంలో గిడుగు చేసిన కృషిని మనం పరిశీలించవలసి ఉంటుంది.
 
Last edited:
కర్జన్ కన్నా దాదాపు ఇరవయ్యేళ్ళ ముందే ప్రాథమిక విద్యారంగంలో ప్రవేశించిన గిడుగు విద్యాబోధన విషయంలో ఎన్నో కొంతపుంతలు తొక్కారు. గిడుగు జీవితచరిత్రకారులు ఈ అంశం గురించి దాదాపుగా ఏమీ చెప్పలేదనే చెప్పాలి. కాని విద్యకి సంబంధించి, ముఖ్యంగా పాఠశాల విద్యకి సంబంధించి గిడుగు ఆలోచనల్ని క్రోడీకరించి చూసుకున్నప్పుడు ఆయన భారతదేశంలోని మహనీయ విద్యావేత్తలైన వివేకానందుడు, జ్యోతిబా ఫూలేలకు సమస్కంధుడిగానూ, మహాత్మా గాంధీ, ఠాగూర్, అరవిందులు, రాధాకృష్ణన్, జిడ్డు కృష్ణమూర్తిలకన్నా ఎంతో ముందే విద్యాచింతన కొనసాగించినవాడిగానూ దర్శనమిస్తారు.

ఇక రెండవ అంశం విద్యారంగంలో గిడుగు చేసిన కృషికి అసాధారణమైన కొనసాగింపు. పర్లాకిమిడి ప్రధానంగా గిరిజన ప్రాంతం. అక్కడి సవరల స్థితిగతులు చూసి వారికి విద్యాబోధన చేపట్టాలనే ఉద్దేశ్యంతో 1892లో గిడుగు సవరభాష నేర్చుకోవడం మొదలుపెట్టారు. వారికోసం ఒక పాఠశాల తెరిచారు. వారి విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తూ 1894 లో ఒక మెమొరాండం రాసి అప్పటి మద్రాసు గవర్నరుకు సమర్పించారు. కాని ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనా లేకపోవడంతో తానే సవర మాధ్యమంలో ఒక పాఠశాల తెరిచి సవరభాషలో వాచకాలు రూపొందించారు.

1913 నాటికి, అంటే, మిషనరీలు ఇంగ్లీషు మాధ్యమం పాఠశాలలు తెరిచిన వందేళ్ళకు సవరమాధ్యమంలో పుస్తకాలూ, పాఠశాలలూ తెరిచారు గిడుగు. కాని అప్పుడు భారతదేశంలో భాషల సర్వే చేపడుతున్న గిడుగు ఆ వాచకాలు బాగున్నాయిగాని, వాటిని తెలుగు లిపిలో రాయడంవల్ల ప్రయోజనం లేదని చెప్పారు. తెలుగు లేదా ఒరియా లిపి వాడటంకన్నా ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ వాడితే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఆ విధంగా గిరిజన భాషామాధ్యమంలో ఒక పాఠశాల తెరవడంలోనూ, వాచకాలు రూపొందించడంలోనూ, వారి విద్య గురించి ఆలోచించడంలోనూ భారతదేశంలో గిడుగునే మొదటివాడు. అందుకని మనం ఆయన్ని భారతదేశంలో మొదటి ఆంత్రొపాలజిస్టు అనవచ్చు.
దాంతో 1913 నాటికి సవర భాషలో తన కృషి పూర్తయిందనుకున్న గిడుగు ఆ రోజు నుంచే తన కృషి నిజంగా మొదలు పెట్టారు. అప్పటినుంచీ మరొక ఇరవయ్యేళ్ళు అపారమైన కృషి చేసి 1931లో మాయువల్ ఆఫ్ సోర లాంగ్వేజ్ నీ, 1933 ల ఇంగ్లీషు-సోర నిఘంటువునీ వెలువరించారు. భాషా శాస్త్రంలోనూ, ధ్వని శాస్త్రంలోనూ ఆయన చేపట్టిన ఈ అద్వితీయమైన కృషి వల్ల ఆయన్ని నేడు గొప్ప భాషాశాస్త్రవేత్త అనీ, కాలం కన్నా ముందున్న భాషావేత్త అని అంతర్జాతీయ స్థాయి లింగ్విస్టులు ప్రశంసిస్తున్నారు.

సవర భాషకి సంబంధించిన కృషి ఆయన్ని తెలుగు భాష గురించి కూడా ఆలోచించేలా చేసింది. కర్జన్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో మద్రాసు ప్రావిన్సులో భాషాబోధనకి సంబంధించి కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. 1906లో విశాఖపట్టణం జిల్లా పర్యవేక్షణాధికారిగా వచ్చిన యేట్సు ఆలోచనలు గిడుగుని శిష్ట వ్యావహారికం వైపు నడిపించాయి.

అప్పటిదాకా పాఠశాలల్లో బోధిస్తున్న తెలుగు, రాసిన పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ కూడా ఒక కృతక గ్రాంథికంలో నడుస్తున్నాయనీ, వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టవలసి ఉంటుందని గిడుగు వాదించారు. ప్రామాణిక భాషగా చెప్పుకుంటున్న పండితుల భాష జీవరహితమైన ఒక కృతక భాష అని చెప్పడానికి, వారి పుస్తకాలనుంచే ఉదాహరణలు ఎత్తిచూపుతూ ఆయన చాలా పెద్ద పోరాటమే చెయ్యవలసి వచ్చింది. ఆ ఉద్యమంలో భాగంగా 'బాలకవి శరణ్యము', 'ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజము', గద్యచితామణి' వంటి రచనలు చేపట్టారు. ఆ పుస్తకాల్లో వెలిబుచ్చిన భావాల సారాంశంగా 1912 లో A Memorandum of Modern Telugu వెలువరించి ప్రభుత్వానికి సమర్పించారు.

గిడుగు అనగానే ప్రజలకు స్ఫురించేది వాడుకభాష గురించి చేపట్టిన ఈ మహోద్యమమే. ఈ ఉద్యమం ఫలితంగానే నేడు మనం పాఠశాలల్లో, సమాచార ప్రసారసాధనాల్లో, సాహిత్యంలో మాట్లాడే భాషను ఉపయోగించుకోగలుగుతున్నాం.
ఇక గిడుగు చేపట్టిన కృషిలో శాసన పరిశోధన, చరిత్ర పరిశోధన కూడా చెప్పుకోదగ్గవే. శ్రీముఖలింగం దేవాలయంలోని శాసనాల అధ్యయనంతో మొదలైన ఆయన చరిత్ర పరిశోధన చివరిదాకా కొనసాగుతూనే వచ్చింది. ఒక విధంగా గిడుగు వల్లనే గురజాడ కూడా శాసన, చరిత్ర పరిశోధన వైపు ఆసక్తి పెంచుకున్నారని చెప్పాలి.

గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని ప్రతిబింబించే రచలన్నింటినీ కీర్తిశేషులు వేదగిరి రాంబాబు చొరవవల్ల తెలుగు అకాడమీ 2014-2016 లో రెండు పెద్ద సంపుటాలుగా వెలువరించింది. ఆ రచనలమీద సమగ్ర అధ్యయనం ఇంకా మొదలుకావలసి ఉంది. ఆయన గురించి తెలుసుకునేకొద్దీ, ఆయన శిష్యురాలు మిస్ మన్రో వర్ణించినట్టుగా 'భారతదేశంలోని ఉదాత్తతకీ, సౌందర్యానికీ సంపూర్ణ ప్రతినిధి గిడుగు ' అని మనకి తెలుస్తూ ఉంటుంది
 

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెలుగు భాష ఎప్పటిది.. ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?​


ద్రవిడ భాషా కుటుంబం 4,500 సంవత్సరాల క్రితమే మనుగడలో ఉందా? అంటే అవుననే అంటోంది ఓ అధ్యయనం.

అంతర్జాతీయ పరిశోధకుల బృందం ద్రవిడ భాషా కుటుంబ చరిత్రపై ఓ అధ్యయనం చేసింది..
ఆ బృందంలో.. జర్మనీకి చెందిన ‘మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ’, భారత్‌లోని ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’కు చెందిన పరిశోధకులు ఉన్నారు.

ఈ పరిశోధనా పత్రాన్ని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’ పత్రికలో ప్రచురించారు.
ద్రవిడ, ఇండో-యూరోపియన్, సినో-టిబెటన్.. ఇలా ఆరు భాషా కుటుంబాలకు చెందిన 600 భాషలకు దక్షిణాసియా పుట్టినిల్లు అని చెప్పవచ్చు.
ద్రవిడ భాషా కుటుంబంలో మొత్తం 80 రకాల భాషలు (భాషలు, యాసలు కలిపి) ఉన్నాయి. దక్షిణ భారతం, మధ్య భారతం, పొరుగు దేశాల్లో ప్రజలు ఈ భాషలు మాట్లాడుతారు.

ద్రవిడ కుటుంబంలోని ప్రధాన భాషలైన తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలు అత్యంత ప్రాచీన సాహిత్య సంపదను కూడా కలిగివున్నాయి.
సంస్కృతం లాగే తమిళ భాష కూడా పురాతనమైనది. తమిళ భాషా సంప్రదాయంలో ప్రాచీన కాలంలోని శాసనాలు, సాహిత్యానికి, వర్తమాన తమిళ భాషకూ సామీప్యత ఎక్కువ.

''యూరప్ ఆసియా సరిహద్దు ప్రాంతాల్లో ద్రవిడ భాష మూలాలను, చరిత్రను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇతర భాషా కుటుంబాలను కూడా ఈ ద్రవిడ భాషలు ఎంతగానో ప్రభావితం చేశాయి'' ఈ అధ్యయనంలో పాల్గొన్న, జర్మనీకి చెందిన పరిశోధకుడు తెలిపారు.

ద్రవిడ భాష ఎక్కడ పుట్టింది.. ఎట్లా విస్తరించింది అన్న అంశాల్లో ఇంకా కచ్చితత్వం రాలేదు. కానీ.. ద్రవిడులు భారత ఉపఖండ మూలవాసులేనని, 3,500 సంవత్సరాలకు పూర్వం ఇక్కడికొచ్చిన ఇండో-ఆర్యన్ల కంటే ముందే ఇక్కడ ఉన్నారన్న వాదనతో చాలామంది పరిశోధకులు ఏకాభిప్రాయాన్ని కలిగివున్నారు.

గతంలో.. ద్రవిడ భాషల ప్రభావం పాశ్చాత్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేదని అధ్యయనకారులు అభిప్రాయపడుతున్నారు
.
ద్రవిడ భాషలు ఎప్పుడు, ఎక్కడ అభివృద్ధి చెందాయి? అన్న ప్రశ్నలను శోధించడానికి.. 20 రకాల ద్రవిడ భాషల మధ్య ఉన్న ప్రాచీన సంబంధాలపై పరిశోధనలు జరిపారు. ద్రవిడ కుటుంబానికి చెందినవిగా భావిస్తున్న భాషలు మాట్లాడే స్థానికుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు.

ద్రవిడ భాషలు 4,000 - 4,500 సంవత్సరాలు ప్రాచీనమైనవని చెబుతున్న అధ్యయనకారులు.. అత్యాధునిక గణాంక పద్దతులను వాడారు. గతంలో జరిగిన అధ్యయనాలకంటే.. ఈ అధ్యయనం మరింత పురోగతి సాధించిందని చెప్పవచ్చు.

ద్రవిడులు ఉత్తర భారతం, మధ్య భారతం, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు విస్తరించిన కాలాన్ని, ద్రవిడుల సంస్కృతి అభివృద్ధిని చెందిన కాలాన్ని.. పురాతత్వ శాస్త్రవేత్తలు గతంలో అంచనా వేశారు.
 
తెలుగులో వాడుక భాషకు పట్టం గట్టిందెవరు?

  • తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దానికి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం 'నాగబు'.
  • హైదరాబాద్ రాజ్యంలో తెలుగు, భాష సాంస్కృతిక పునర్వికాసానికి కృషి చేసిన వారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఊరూరా గ్రంథాలయాల్ని స్థాపించి, నిరక్షరాస్యులైన ప్రజలకు విజ్ఞానాన్ని ప్రసాదించాలని, తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని తెలియజేయాలని గ్రంథాలయ ఉద్యమానికి గట్టి పునాదులు వేసిన వారు లక్ష్మణరావు.
  • తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులు గిడుగు రామ్మూర్తి. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం ఆయన 'తెలుగు' అనే మాసపత్రికను నడిపారు.
  • తెలుగులో యాత్రా సాహిత్యానికి ఆద్యులు ఏనుగుల వీరాస్వామయ్య. ఆయన 1938లోనే తన కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.
  • వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తొలి తెలుగు శబ్దకోశాన్ని ఆయనే పరిష్కరించి ప్రచురించారు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితులయ్యారు.
  • మొట్టమొదటి బైబిల్ ప్రతిని 1812లో ప్రచురించారు. రెవరెండ్ బెంజిమన్ స్కల్జ్ బైబిల్‌ను తెలుగులోనికి అనువదించారు. ఆయన రాత ప్రతులను జర్మనీలోని హాలీలో ప్రచురించారు.
  • ఆంధ్ర ప్రదేశ్‌లో 1966లో అధికార భాషా చట్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య (1974-77) పని చేశారు.
  • ఇప్పటివరకు ముగ్గురు తెలుగు రచయితలు జ్ఞానపీఠ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో డా.సి.నారాయణరెడ్డి, 2012లో రావూరి భరద్వాజ ఈ పురస్కారాన్ని సాధించారు.
  • 1975లో మొట్టమొదటి తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. రెండో తెలుగు మహాసభలు 1981 మలేసియాలోని కౌలాలంపూర్‌లో , మూడో మహాసభలను1990 మారిషస్‌లో నిర్వహించారు. 2012లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నవి ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు.
  • నిజామాబాద్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి మంగారి రాజేందర్‌ (జింబో) తెలుగు భాషలో తీర్పు వెలువరించిన తొలి న్యాయమూర్తి. ఫిబ్రవరి 19, 2002న ఆయన తెలుగులో తీర్పు వెలువరించి తెలుగులో తీర్పు వెలువరించిన తొలి న్యాయమూర్తిగా ఘనతకెక్కారు.
  • అక్టోబర్, 1991లో యూనికోడ్ కన్సార్టియం మొదటి వెర్షన్‌లో తెలుగు లిపికి యూనికోడ్ స్టాండర్డ్ ఇచ్చింది.
  • తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సౌజన్యంతో రూపొందిన ఉచిత ఆన్ లైన్ డిక్షనరీ ‘ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన’. ఈ ఆన్ లైన్ డిక్షనరీలో ముప్పైకి పైగా నిఘంటువుల సమాచారం చేర్చారు.
  • తెలుగు వికీపీడియా 10 డిసెంబర్, 2003లో ప్రారంభమైంది. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టారు. తెలుగు వికీపీడియా మొదటి లోగోను రూపొందించింది కూడా ఆయనే.
  • అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే మాతృభాషల్లో మూడోది తెలుగు. అక్కడ భారతదేశానికి చెందిన భాషల్లో ఎక్కువగా హిందీ మాట్లాడేవారు ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, తెలుగు మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్నవారిలో ఇంటివద్ద సుమారు 3,65,566 మంది తెలుగులోనే మాట్లాడుతారని ఓ సర్వే నివేదిక వెల్లడించింది.
 

తెలుగు భాష: అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానం​


అంశం- అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భాష తెలుగు.

నిజం- అవును, అమెరికా థింక్ టాంక్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఆ దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య గత ఏడేళ్లలో 86 శాతం పెరిగింది. అయితే, అమెరికాలో ఇంగ్లిష్ కాకుండా ఎక్కువగా మాట్లాడే టాప్ 20 భాషల్లో ఇంకా స్థానం పొందలేకపోతోంది.
line

అమెరికాలో ఇంగ్లిష్ కాకుండా సర్వ సాధారణంగా మాట్లాడే భాషల గురించి ఆలోచిస్తే, వాటిలో తెలుగు కూడా ఉంటుందని ఎవరూ ఊహించరు.

అమెరికాలో తెలుగు మాట్లాడేవారు 2010-2017 మధ్య 86 శాతం పెరిగినట్టు ఆన్‌లైన్లో ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వీడియో చెబుతోంది.
ఈ వీడియో అమెరికాలో ఉన్న సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ ద్వారా జరిగిన ఒక అధ్యయనాన్ని ప్రస్తావించింది. అమెరికాలో మాట్లాడుతున్న భాషల గురించి తెలుసుకోడానికి అది జనాభా గణాంకాలను విశ్లేషించింది.

తెలుగు భాష పెరగడానికి కారణం ఏంటి?​

తెలుగు భాషను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 8 కోట్ల 40 లక్షల మంది మాట్లాడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధికులు మాట్లాడే నాలుగో భాష తెలుగు.

అమెరికాలో మాట్లాడే భాషలపై జరిగిన అధ్యయనంలో అమెరికన్ కమ్యూనిటీ సర్వే గణాంకాలను ఉపయోగించారు. 2010-2017మధ్య జరిగిన ఈ సర్వేలో.. ఇంట్లో ఉన్నప్పుడు ఇంగ్లిష్ కాకుండా ఎంత మంది ఏయే భాషల్లో మాట్లాడుతున్నారో పరిశీలించారు.

గత ఏడాది అమెరికాలో 4 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నట్టు గుర్తించారు. ఇది 2010లో ఉన్న వారితో పోలిస్తే రెట్టింపు అయ్యింది.
అమెరికాలో అత్యంత వేగంగా పెరుగుతున్న టాప్ 10 భాషల్లో ఏడు భాషలు దక్షిణ ఆసియాకు చెందినవి కావడం విశేషం.


తెలుగే ఎందుకు?​

"హైదరాబాద్ - అమెరికాలోని ఇంజనీరింగ్, టెక్నాలజీ పరిశ్రమల మధ్య సంబంధాలకు వీరిలో చాలా మంది కారణమని చెప్పచ్చు" అని అమెరికాలోని తెలుగు పీపుల్ ఫౌండేషన్ స్థాపకుడు ప్రసాద్ కునిశెట్టి చెప్పారు. ఆయన ఐటీ రంగంలో తన కెరీర్ కొనసాగించడం కోసం 2001లో యూఎస్ వచ్చారు.
1990ల మధ్యలో జరిగిన ఐటీ వృద్ధితో అమెరికాలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు.

అమెరికాలో ఉన్న వారిలో చాలా మంది హైదరాబాద్ నుంచే ఇక్కడికి వచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు 800కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో అమెరికాకు వస్తున్న తెలుగు ఐటీ నిపుణుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.

టెక్నాలజీ, ఇంజనీరింగ్ పరిశ్రమకు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక మేజర్ హబ్‌గా మారింది. అమెరికాకు భారీగా ఐటీ నిపుణులను అందిస్తోంది.
తెలుగు మాట్లాడే అమెరికన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకోవడం కూడా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

చాలా మంది భారతీయులు హెచ్-1బి వీసా స్కీమ్‌ ద్వారా ప్రయోజనం పొందారు. అది ఏటా టెక్నాలజీ రంగం వైపు వచ్చే కొన్ని వేల మంది విదేశీయులు వర్క్ వీసాలు పొందడానికి కారణమైంది. ఒక అంచనా ప్రకారం వీటిలో 70 శాతం భారతీయులకే దక్కుతున్నాయి. ఈ వీసా పొందినవారు అమెరికాలో శాశ్వత నివాస హోదాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలవుతుంది.


తెలుగు సంఘాల ప్రభావం​

తెలుగు సినిమా, ఇంటర్నెట్‌తో పాటు అమెరికాలోని తెలుగు సంఘాలు కూడా భాషా వ్యాప్తికి చాలా కృషి చేస్తున్నట్లు ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ చెప్పారు. ఈ తరం పిల్లలకు మాతృభాషను చేరువ చేసేందుకు తెలుగు సంఘాలు మొదలుపెట్టిన 'మన బడి', 'పాఠశాల' లాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు.

అమెరికాలోని కొన్ని దేవాలయాల్లో తెలుగు నేర్పిస్తున్నారని, తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్ కుర్రాళ్లు కూడా తనకు తెలుసని, క్రమంగా తెలుగువాళ్లు స్థానిక రాజకీయాల్లోకి కూడా అడుగేస్తున్నారని అంటారు ప్రసాద్.

గతంలో ‘తానా’ అధ్యక్షుడిగానూ సేవలందించిన ప్రసాద్... ఏటా భారత్‌ నుంచి అమెరికా వచ్చే విద్యార్థుల్లో తెలుగువారి సంఖ్యే ఎక్కువని చెబుతారు.
అమెరికాలో ఉంటున్న తెలుగు మాట్లాడేవారిలో మొదటి ఇండియన్-అమెరికన్ మిస్ అమెరికా నీనా దావులూరి, ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

మాట్లాడేవారి శాతం పెరగడం చూస్తే తెలుగు ప్రాధాన్యం పెరిగినట్టే అనిపిస్తుంది. కానీ మిగతా భాషలతో పోలిస్తే ఇది దిగువ స్థాయి నుంచి ప్రారంభమైంది.

సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ లెక్కల ప్రకారం 2010-2017 మధ్య అమెరికాలో పుంజుకున్న కొత్త భాషల్లో స్పానిష్, చైనీస్, అరబిక్, హిందీ కూడా ఉన్నాయి.
 
Gidugu Venkata Ramamurthy (1863-1940) was a Telugu writer and one of the earliest modern Telugu linguists and social visionaries during the British rule. He championed the cause of using a language comprehensible to the common man as opposed to the scholastic language.

Gidugu Ramamurthy was born at Parvatalapeta, Srikakulam near Vamsadhara River on the border of Orissa, His father Veeraraju worked as revenue inspector and died when Ramamurthy was just 12 years old. It was a struggle for him to survive. He studied privately and passed his matriculation, staying in his sister's house and began his life as a teacher in Gajapati Maharaja School, Parlakimidi for 55 years.

Albeit being a historian as well, Ramamurthy was unable to read Sasanas on stone tablets clearly. To understand them he studied books that were imported by Vizianagaram Maharaja's son Kumara Raja. He studied various language scripts and after deciphering the Sasanas he wrote books on languages and scripts.

Ramamurthy had studied many languages and comprehended the philosophy of language. He pleaded for lucidity in text books. In his time there was only a poetic approach and never was a prosaic treat.

He launched a monthly titled Telugu to drive his point.Gidugu gave a social base to Telugu literature and rendered services to the tribals, especially the Savaras, in Parlakimidi area of Srikakulam agency area and tirelessly worked for the development of tribal languages He gave Savara language a script and prepared lexicons. During his research for Savara language, he had to travel in the forests resulting in excessive use of quinine due to which he became deaf.
 
Last edited:
Top