• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Sarvepalli Radhakrishnan - గురువులకే గురువు సర్వేపల్లి.. ఆయన జీవితం ఓ స్ఫూర్తి పాఠం

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak

వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి ఎంతో ఉత్తముడు. స్వశక్తితో అసాధారణ ప్రఙ్ఞా పాటవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు.​


ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ఏటా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఆయన నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యా వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి సర్వేపల్లి. కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు అతి సులభంగా బోధించేవారాయన. ఉపాధ్యాయుడి బాధ్యత ఎప్పుడూ గురుతరమైనదే. అలాంటి బోధనావృత్తికి తలమానికంగా నిలిచిన సర్వేపల్లి గురించి క్లుప్తంగా

సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీ. దూరంలోని తిరుత్తణిలో జన్మించారు. ఇది తిరుపతి సమీపంలో ఉంది. ఆయన తల్లిదండ్రులు సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ. వీరాస్వామి నాటి జమీందారీ వద్ద తహసిల్దార్‌గా పనిచేసేవారు. వీరి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి.

ప్రాథమిక విద్య తిరుత్తణిలో పూర్తి చేసిన రాధాకృష్ణన్.. తిరుపతి, నెల్లూరులో తదనంతర విద్యాభ్యాసం సాగించారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీ నుంచి ఎంఏ పట్టా పొందారు. 1906లో తన 16వ ఏట సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు శివకామేశ్వరితో వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. ఆయన సతీమణి 1956లో తన 51వ ఏట మరణించారు. రాధాకృష్ణన్‌ బాల్యం నుంచే అసాధారణమైన తెలివితేటలు కనబరిచేవారు. ఆయన తెలివితేటలకు ఉపాధ్యాయులు ముగ్ధులయ్యేవారు.

విద్యార్థికి, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో విడమరిచి చెప్పారు ఆచార్య రాధాకృష్ణ. అధ్యాపకుడిగా, వైస్‌ ఛాన్సలర్‌గా, దౌత్యవేత్తగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఆయన సేవలు నిరుపమానం, అనితరసాధ్యం. ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి.

సర్వేపల్లి 21 ఏళ్ల వయస్సులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. తత్వశాస్త్రంలో ఆయన ప్రతిభను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం ఆయన్ని ప్రొఫెసర్‌గా ఆహ్వానించింది. ఆయన ఉపన్యాసాలు విద్యార్థులనెంతో ఆకట్టుకునే.

సర్వేపల్లి ప్రతిభ గుర్తించిన డాక్టర్ అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్.. కలకత్తా విశ్వవిద్యాలయ ఆచార్య పదవి చేపట్టమని ఆయణ్ని కోరారు. వారి ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లారు. అక్కడే ఆయన కీర్తి దశదిశలా వ్యాపించింది.

కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా ఉన్న సమయంలో సర్వేపల్లి ‘భారతీయ తత్వశాస్త్రం’ అనే గ్రంథం రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలు అందుకుంది. ‘మీరు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ తీసుకుని ఉంటే మీకు ఇంకా మరింత గొప్ప పేరు వచ్చేది’ అని ఒక మిత్రుడు అనగా.. సర్వేపల్లి ‘నేను ఆక్స్‌ఫర్డ్ వెళ్తే.. అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తా. విద్యార్థిగా మాత్రం కాదు’ అన్నారట. సర్వేపల్లి దేశభక్తి, స్వదేశీ విద్యాలయాలపట్ల గౌరవం, ఆత్మాభిమానానికి ఈ ఘటనను మచ్చుతునకగా పేర్కొంటారు.
gen_204

pixel

l


ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆహ్వానం మేరకు సర్వేపల్లి ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు అక్కడికి వెళ్లారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికా లాంటి విదేశాల్లో ఉపన్యాసాలు ఇచ్చి మాతృదేశ కీర్తిని పెంచిన ఘనత కూడా ఆయనదే.

1931లో డా. సి.ఆర్. రెడ్డి తర్వాత రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లరుగా పనిచేశారు. 1931లోనే రాధాకృష్ణన్ ‘లీగ్ ఆఫ్ నేషన్స్ ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటీ’ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యాపకులుగా పనిచేశారు.


1946లో సర్వేపల్లి భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులుగా కీలక పాత్ర పోషించారు. 1947 ఆగస్టు 14, 15 తేదీ మధ్య రాత్రి ‘స్వాతంత్ర్యోదయం’ సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం భారతీయులను ఎంతో ఉత్తేజపరిచింది.

1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డాక్టర్ రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక కమిటీ నియమించింది. ప్రధాని నెహ్రూ కోరిక మేరకు డాక్టర్ రాధాకృష్ణన్ 1952-62 వరకు భారత ఉప రాష్ట్రపతిగా పనిచేశారు. భారత్‌కు ఆయనే తొలి ఉప రాష్ట్రపతి.

ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రిఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ లాంటి అనేక గొప్ప గ్రంథాలు సర్వేపల్లి రచించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్‌
1962లో బాబూ రాజేంద్రప్రసాద్ తర్వాత సర్వేపల్లి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్యపాశ్చాత్వ తత్వశాస్త్రాలపై ఆయన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన ఛలోక్తులు, హాస్యం అందరినీ కట్టి పడేసేవి.

ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలు సర్వేపల్లిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం ‘భారతరత్న’తో సత్కరించింది.
1967లో రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత డాక్టర్ సర్వేపల్లి మద్రాసులోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. చివరి రోజుల్లో తాత్విక చింతన చేస్తూ గడిపారు. 1975 ఏప్రిల్ 17న ఆయన తుదిశ్వాస విడిచారు.



సర్వేపల్లి ప్రబోధాలు..
  • ‘మతం ఆదర్శం - ఆధ్యాత్మిక సంబంధమైన అంతర దృష్టిని పొందడం. దీనికి మార్గమే నైతిక జీవనం, ధ్యానం’
  • ‘తత్వవేత్త జ్ఞానాన్ని ప్రేమించేవాడేగానీ జ్ఞాని కాడు.. యాత్ర ముగించడం ముఖ్యం కాదు, యాత్ర చేయడమే ముఖ్యం’
  • ‘విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే’
ఈ లోకంలోకి ఎంతో మంది వస్తున్నారు, వెళ్లిపోతున్నారు. కానీ, కొందరు మాత్రమే కారణ జన్ములు. వారు భౌతికంగా ఇక్కడ లేకున్నా.. మన మనసుల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు. అలాంటి మహామహుల్లో ఉత్తములు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన కూడా అందరిలా జన్మించినా.. స్వశక్తితో అసాధారణ ప్రఙ్ఞా పాటవాలతో ఉన్నత శిఖరాలకు ఎదిగి పలువురికి మార్గదర్శకంగా, తన వృత్తి ధర్మానికి మకుటంగా వెలిగారు.

సర్వేపల్లిది కొనితెచ్చుకున్న గౌరవం కాదు. ‘కొలిచి’ తెచ్చుకున్న గౌరవం, వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా ఆయణ్ని వరించింది. ఏ పనిలోనైనా నిబద్ధత కలిగి ఉండాలని ఆయన జీవితం మనకు పాఠం చెబుతుంది. సర్వేపల్లి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.
 
సర్వేపల్లి ప్రత్యేకతలు..
  1. రాధాకృష్ణన్‌ అద్వైత వేదాంతి. శంకరుల మాయావాదాన్ని యథాతథంగా స్వీకరించలేదు. తన సొంత భాష్యం రాశారు. ఆయన రచనలు హిందూ ధర్మానికి పునరుద్దీపన కలిగించాయి. దార్శనిక శాస్త్రాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచిన ఘనత సర్వేపల్లికే దక్కుతుంది.
  2. సర్వేపల్లి గొప్ప మానవతావాది. ప్రతి మానవుడూ అతడి మతమేదైనా, సాంఘిక స్థితిగతులేమైనా పరమేశ్వరుడి రూపంలో పుట్టినవాడే అని నమ్మేవారు. ప్రతి మనిషీ ఆ ఈశ్వరుడికి ప్రియపుత్రుడిగా రాణించగల నిగూఢ శక్తులతో జన్మించినవాడేనని ఆయన అభిప్రాయం.
  3. సర్వేపల్లి దృష్టిలో మతం అంటే - శక్తి, సంపదల కోసం కాకుండా.. శాంతి కోసం, సత్యం కోసం నిత్యాన్వేషణ. మతం అనేది సర్వసంగ పరిత్యాగం, ప్రారబ్ధానికి తలొగ్గడమూ కాదు. ధీరోదాత్తంగా సాగిపోవడమే మతం.
  4. ప్రస్థాన త్రయానికి ఆంగ్లంలో ఆధునిక దృష్టితో భాష్యం రాశారు సర్వేపల్లి. సోక్రటీస్‌ మొదలుకొని పాశ్చాత్య దార్శనికవేత్తల వరకు అందరి రచనలూ ఆయనకు కంఠోపాఠమే.
  5. భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్‌ చదివారు సర్వేపల్లి. ఖురాన్‌ ఆయనకు కొట్టిన పిండి. సూఫీ తత్వాన్నీ మధించారు.
  6. సర్వమతాలవారూ ఇతర మతాల పట్ల విశాలమైన, ఉదారమైన దృక్పథాన్ని అవలంబించాలని సర్వేపల్లి ప్రబోధించారు. ఎవరైనా ఇతర మతాలను, సంస్కృతులను విమర్శించడాన్ని ఆయన అంగీకరించేవారు కారు.
  7. మతం కాలానుగుణంగా మార్పు చెందుతుందన్న విషయం మరచిపోరాదని రాధాకృష్ణన్‌ అనేవారు. ఉపనిషత్తుల ఉపదేశాలు, బుద్ధుడి బోధనలు, గీతా సందేశం ప్రాతిపదికగా జాతీయ జీవనాన్ని తిరిగి నిర్మించుకోవాలని సందేశం ఇచ్చారు.
  8. సమాజంలో పండితులేగాని నిజమైన తత్వవేత్తలు కనిపించడం లేదని, సృజనాత్మకత కొరవడిందని సర్వేపల్లి ఆవేదన వ్యక్తం చేసేవారు. వారసత్వ సంపద ఎవరినీ మానసిక దాస్యానికి గురిచేయకూడదని మన మహర్షులు కూడా హితవు పలికారని.. అలా వారు నూతన సత్యాలు కనుగొనడానికి, అలాంటి పరిష్కారాలనే సూచించడానికి ఆసక్తి కనబరిచారని వివరించారు.
  9. తత్వవేత్తలుగా ప్రసిద్ధి చెందినవారెవరూ రాధాకృష్ణన్‌ పనిచేసినన్ని రంగాల్లో ప్రవేశించి ఉండరు. ఆయన పాలనాదక్షుడు, రాజనీతిజ్ఞుడు. అన్నింటినీ మించి.. ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో భారతీయ సంస్కృతికి ప్రతినిధిగా వ్యవహరించగలిగిన ప్రజ్ఞాధురీణుడు.
  10. తత్వశాస్త్రాన్ని వర్తమాన పరిస్థితులకు అన్వయించడమే కాకుండా ప్రపంచమంతటికీ వర్తింపజేసిన మేటి రాధాకృష్ణన్‌. ఆయన పర్యటించని ప్రదేశం లేదు. ఆయనను గౌరవించని స్థలం లేదు.
 
చేపట్టిన పదవులు

  • మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు.
  • 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు.
  • 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.
  • 1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.
  • 1929లో ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు అతనును ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు "తులనాత్మక మతము" (Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.
  • 1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసారు.
  • 1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో 1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు.
  • 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసారు.
  • 1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు.
  • 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.
  • 1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు.
  • 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు.
  • 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు.
  • 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
 
  • ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
  • 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది.
  • 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు.
  • 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.
  • 1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు.
  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేటులు సంపాదించారు.
  • ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది.
 
Top