• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Nidra—sleep

Nidra!
What a beautiful thing it is.
Utmost important for overall well being.
One of the precious gift or boon given to mankind for free.
Rich ,poor, Animals ,birds and so on to everyone.
One would tumble without it in a couple of days.
The irony is some have to buy it in many ways be it in the form of pills and other and other and other and many other ways.
 
చ్చిందంటే అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుంది... రాకపోతే మాత్రం ఎన్నింటినో గుర్తు చేసేస్తుంది... ఎంత చిత్రమైనదయ్యా నిద్ర!’ అన్నాడొక తత్వవేత్త. కమతాల్లో చెమటోడ్చి ఎండ వేళల్లో చేల గట్లమీద, చెట్ల నీడల్లోను తలగుడ్డ పరచుకొని క్షణాల్లో నిద్రలోకి జారుకొనే కర్షకులను చూస్తే తెలుస్తుంది- ఆ భోగం ఎలాంటిదో! ‘శ్రీవల్లభుడు తన్ను చేరిన యట్లైన చెలికాండ్రనెవ్వరి చేరమరచు... తనను శ్రీహరి సమీపించాడని అనిపిస్తే చాలు, ప్రహ్లాదుడు సావాసగాళ్లను వెంటనే మరచిపోయేవాడని భాగవతం చెప్పినట్లు- ఆవరించిందంటే చాలు, అలసటను అలవోకగా తుడిచిపెట్టేస్తుంది నిద్ర
 
ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు’ అనే సామెత... రెండూ వర్తిస్తాయి శ్రమజీవులకు. శీతల మందిరాల్లో పట్టు పరుపులపై పవళించినా రెప్పలు మూతపడక పొడి కళ్లతో అసహనంగా అటు ఇటు పొర్లేవారిని అడిగితే చెబుతారు- సుఖనిద్ర మనిషికి ఎంతటి సౌభాగ్యమో! నిద్రపట్టక పోవడమనేది నిజానికి అనారోగ్య హేతువు.‘కలత నిద్రలోనూ నా బంతులకు సచిన్‌ తెందుల్కర్‌ కొట్టిన షాట్లు నా కలల్లో గిర్రున తిరిగేవి... వెంటనే మెలకువ వచ్చేసేది’ అని వాపోయాడు ఆస్ట్రేలియా స్పిన్‌ బౌలర్‌ షేన్‌వార్న్‌. ‘అరయంగా కర్ణుడీల్గె అందరి చేతన్‌’ అన్నట్లుగా, నిద్ర చెడిపోవడానికి ఇలా సవాలక్ష కారణాలుంటాయి. ఇవన్నీ కాక తాజాగా ఆధునిక ‘గాడ్జెట్ల’తో తెల్లవార్లూ కాలక్షేపం చేస్తూ నిద్రను నేటి యువత దారుణంగా నిర్లక్ష్యం చేస్తోందని, దాంతో నిద్రకు దోహదం చేసే ‘మెలటోనిన్‌’ ఉత్పత్తి తగ్గుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అది మానసిక కుంగుబాటుకు, మత్తుమందుల అలవాటుకు దారితీస్తుందని హెచ్చరిస్తోంది. మనవాళ్లు ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అని ఊరికే అన్నారా!
 
Top