My best work thus far in zozo!
ఓ నువ్వా!
ఢిల్లీ వీధుల్లో భంగపడ్డ నిస్సిగ్గువి!
రాజ్యాధికార నిచ్చెనల బెస్ట్ బేకరీ సమాధివి!!
అడుగడుగునా అణగద్రొక్కబడ్ద అబలవు!!!
అరె ఏందిరా నీ లొల్లి, ఇదంతా నా గురించే?
సరే! నేనేంటో నేను చెబ్తా విను!
సకల చరాచర జగత్తు సృష్టికర్తను… నేను
అణువిస్ఫోటనపు ప్రోటాన్, న్యూట్రాన్ ల సమ్మేళనం …నేను
విజ్ఞాన సర్వస్వ విశారదను… నేను
పితృస్వామ్య కుత్తుకలుత్తరించే చురకత్తిని…నేను
వారసత్వ వెన్నుపోటల్ని ఎదుర్కొనే చాంద్ బీబీ ని…నేను
బుసకొట్టే "బోడిలింగాల" ఖండ ఖండ అఖండ విఖండ శిఖండిలఖడ్గ సృష్టి…నేను
తుపాకి తూటాలో దట్టించిన గంధక ధూమం…నేను
నవయుగాలకు నాంది…నేను-అరాచకాలకు చరమగీతం..నేను
ఉవ్వెత్తున ఎగసిపడే నయాగరా జలపాతపు హోరు… నేను
స్వేచ్చా సమానతల ఘీంకార ధ్వనుల పాంచజన్యపు రణభేరి…నేను!
ఆకాశంలో సగం… నేను-
కాదంటే?
ఖబడ్దార్!
కోసి కారం పెట్టేసే గుంటూరు మిర్చి…నేను!