ఏకాంత ద్వాంతన మొహమాటాల మొగ్గలు విప్పారి, స్వాగత సౌరభాల అగరొత్తులు ఎరుపుతీగలైనప్పుడో, దైనక మర్యాదల నిర్జల ధారలలో తడిసిమోపెడైన సభ్యతా వస్త్రాలు మోయలేని బరువైనప్పుడో, వాంఛాస్నానానికి ఉద్యమాంకురార్పణ జరిగినప్పుడో, బాహ్యాంతర భావాల సంఘర్షణల మధ్య మనశ్శరీరాగ్నులతో మలియైనప్పుడో, బాధ మనస్సుని జ్వలింప చేసినప్పుడో, సమస్యలు హ్రుదయాల్ని తొలిచేసినప్పుడో…..
Emile Durkheim , అనే FRENCH SOCIALOGIST - "ఆత్మహత్యలు - ఒకవిస్త్రుత సామజిక పరిశీలన" అనే పుస్తకం లో జనాన్ని ANOMIC, ALTRUISTIC, EGOISTIC అనే మూడు రకాలక్రింద విభజిస్తాడు. ప్రేమించేవాళ్ళు లేక, తను ప్రెమించగలిగే వాళ్ళు లేక ఏకాంతానికి బానిసలైనఒంటరి మనుష్యులు - ఒక కలకోసం, జీవితం పన్నిన భ్రమల వలల్లో సంక్షిప్తసారాంశం కోసం వెతుక్కుంటూ స్వఖీయ గోతుల్లో పడిపోతారంటాడు. ప్రారబ్ధవిచారాల నుండీ, వాటి వెన్నాడే ఆత్మ జీవావశేషాల నుండీ బయటపడలేరంటాడు. నాకీ గదుల్లో సంచరించే మనుష్యుల్ని చూశాక. ఔరా! నిజమేకదా అన్నట్లనిపిస్తుంది.
జీవన విలాపాలు..సరస సల్లాపాలు..భామా కలాపాలు..కష్టాలు.. నష్టాలు..కన్నీళ్ళు..వెక్కిళ్ళు..అంతరంగసంద్రాలు..విషవలయాలు..కోపాలు..తాపాలు..కోరికలు..రసగంగఉత్తానాలు..విలువల పతనాలు..అవరోహణల వైకుంట పాళీలు..ఆరోహణలనిచ్చెనలు..కలిమి లేములు..కావడి కుండలు..అనుబంధాలు..హ్రుదయస్పందనలు .. రసస్ఫోరకాలు..జిలుగు వెలుగులు..వెలుగు జిలుగులు.. ప్రగల్భాలు..కుక్కల అరుపులు..నక్కల వినయాలు..దైనందినదైన్యాలు..కష్మలాలు.. కశ్మలాలు....స్నేహం ముసుగులోదగుల్బాజీలు..సానుభూతి కథలు..అన్నీ కలసి భ్రమల జీవితాలు!
-Ekalustya
17FEB2022
(To be continued ......)