ఆకలేసినప్పుడు ఎవరికైనా ముందుగా అమ్మ గుర్తొస్తుంది. అమ్మ చేతివంటలు లొట్టలేసుకుని తినేస్తాము. అమ్మ దగ్గరున్నన్నాళ్లు తినడమే తెలుసు, వండటం చేతకాదు.
ఇలా పెళ్లయి అలా వెళ్తామో లేదో! మన వచ్చీరాని పాకకళా ప్రావీణ్యంతో, రకరకాల ప్రయోగాలతో శ్రీవారిని బుట్టలో వేసే ప్రయత్నం చేస్తాము.
మగడి హృదయంలోకి దారి కడుపు నిండినపుడే అన్నమాట అక్షరాలా నిజం! అలా వండి పెట్టగలిగినపుడే ‘భోజ్యేషు మాత’ అనిపించుకోగలం.
అలా ఎలా చేసినా తింటూ, మనలని ఎంకరేజ్ చేస్తుంటే, వాళ్ల కోసం ఏదయినా నేర్చేసుకుంటాము. అలా అమ్మల దగ్గరనుండి, అత్తగారి దగ్గరనుండి నేర్చుకున్న వంటలతో అన్నపూర్ణాదేవి అవతారమెత్తే అమ్మాయిలందరూ మన బాపతే!
దేనికయినా వాటి మూలాలుంటాయి. అలాగే ప్రాంతాలవారీగా రకరకాల వంటలు ప్రాముఖ్యత చెందుతాయి. ఇంక శాఖాహార వంటలు అయితే చెప్పక్కరలేదు.
ఎన్ని రకాల కూరలో ఎన్ని విధాల వండుతారో! అయితే ఎక్కడ ఏది తిన్నా, ఏది నచ్చినా ఎలా చేసారో కనుక్కుని వండి పెట్టడానికి భేషజాలకు పోనక్కరలేదు. నేర్చుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో పంథా ఉంటుంది.
So tell which dish you cook deliciously?