• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Meaning of a song

UserNo420

Favoured Frenzy
Ee paata chaala sarle vinnanu. It's a beautiful composition, but chala matuku naaku words artham kaale.

Appudeppudo oka function lo Trivikram antaru: "Ayana patalu vinnaka dictionary vetiki artham telsukovali anipinchedi. Paata ni arthamayyelane kaadu, artham cheskovaali anipinchela kooda rayachu Ani".

Found a video showing meaning of a Telugu song and it's beautiful. Hope you all enjoy it as much as I did

ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు మూన్నాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది

గిరి బాలతో తనకు కళ్యాణమొనరింప దరిజేరు మన్మధుని మసి చేసినాడు
వాడినేది కోరేది...
వర గర్వమున మూడు లోకాల పీడింప తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది...
ముఖ ప్రీతి కోరేటి ఉక్కు శంకరుడు
వాడినేది కోరేది...
ముక్కంటి | ముక్కోపి | ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు
ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది

Sirivennela garuu ..ekkadikellipoyarandi!!!
 
పల్లవి: “ఆదిభిక్షువు వాడినేది కోరేది..? బూడిదిచ్చేవాడినేది అడిగేది..? ఏది కోరేది..? వాడినేది అడిగేది..?”

మొదటిలోనే అసలు అంతలోతు భావంతో కూడిన ప్రాసని వింటే, మిగతా పాట వినకుండా ఎవరూ వదిలిపెట్టరు.. బహుశా అందుకేనేమో మహదేవన్ గారు ప్రారంభంలో ఎటువంటి సంగీతం పెట్టకుండా, పాట మొదలవగానే ఈ రెండు పంక్తులు(Lines) వచ్చేలా చేశారు..

ఇప్పుడు మొదలవుతుంది అసలు సంగతి… ఇప్పుడు ఒక కోకిలని చిలుకని పోల్చమంటే పోలుస్తాం గానీ.. కోకిలని మేఘాన్ని పోల్చమంటే..?

అసలు ఒకటి ప్రాణం ఉన్నది, ఇంకొకటి ప్రాణం లేనిది..
ఒకదానికి ఒకటి అస్సలు సంబంధం లేదు..
ఆ ఘనత సీతారామశాస్త్రిగారికే చెల్లింది..

చరణం-1:
“తీపి రాగాలా కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది?
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది..?”

తియ్యటి పాటలు పాడే కోకిలకి నలుపు రంగేంటి..? గర్జనలు చేసే ఆ మేఘాలకి మెరుపులు అద్దడం ఏంటి..?
ఇటువంటి తింగరిపనులు చేసే శివుని ఏం అడుగుతాం..? అంటూ ఆ రెంటిని శివునితో ఏకంచేసి రాసారు..

సరే.. ఇప్పుడు ఇంకొకటి.. పువ్వుని, రాయిని పోల్చమంటే?? ఏమని పోలుస్తాం..?

(మీరు ఈ పాట ఇంతకు ముందు వినకపోతే కనుక, ఒకసారి ఆలోచించండి మీ బుర్రకి పని చెప్పండి.. )

నేనైతే, పువ్వు రాయి మీద పడితే రాయికి ఏమి కాదు, కానీ రాయి పువ్వు మీద పడితే పువ్వు నలిగిపోతుంది అని చెప్పేవాడిని, అంతకుమించి తట్టదు.. కానీ, ఇక్కడ పాట రాస్తోంది మాములు వ్యక్తి కాదు..
ఇక్కడ వాటి ఆయుష్షుని లెక్కవేసి మళ్ళీ శివుని తిట్టారు.. హహా..

చరణం-2:
“తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది?
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది?”

మకరందాన్ని ఇచ్చే పువ్వులకి మూడే రోజులు ఆయుష్షు ఇచ్చి.. అచేతనంగా పడుండే ఆ రాళ్ళకు చిరంజీవిత్వాన్ని ప్రసాదించాడే.. అటువంటి వాడిని ఏం కోరుతాం..?

ఇదంతా చదివాక మీకు అనిపించచ్చు ఇక్కడ శివుడిని తిట్టారు కదా అని.. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన తిడుతూ కూడా అవన్నీ చేసింది ఆయనే అని చెప్పకనే చెప్పారు..

కోకిలని, మేఘాన్ని, పువ్వుని, రాయిని యవత్త్-విశ్వాన్ని సృష్టించింది ఆయనే అని…

ఒక భక్తుడు తిట్టినా కూడా అది ఆర్తితో కూడినదే అయ్యుంటుంది.. రామదాసు “ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా…” అని పాడినట్టు.. దానికి ఈశ్వరుడు ఏమి అనుకోడు..!

“విధాత తలపున” పాట పండితులు సైతం నిఘంటుసహాయం కోరేలా రాస్తే..
ఈ పాటని పదవ తరగతి ‘తెలుగు’లో విఫలం అయినవాడికి కూడా అర్థమయ్యేలా రాశారు..
అందుకే అత్యంత ప్రజాదరణ పొంది “నంది”ని తెచ్చిపెట్టింది..
కాదు కాదు.. ఆ ఈశ్వరుడే ఆయనను తిట్టించుకుని, తిట్టినందుకు గాను ఆయన వద్దనుండే ‘నంది’ని బహుకరించాడు..

Note : Idi nenu రాయలేదు
 
Last edited:
ఎవడబ్బ సొమ్మనీ కులుకుతూ తిరిగేవు రామచంద్రా…” అని పాడినట్టు.. దానికి ఈశ్వరుడు ఏమి అనుకోడు..!
Andhukenemo- Srinadhudu daahamesi- adukkunevaadiki idharu pellaalu Endhuku - Ganga ni vodhilepettu - neeku parvathi okkati chaalu le - annaaaa em analedhu!
 
ఇదంతా చదివాక మీకు అనిపించచ్చు ఇక్కడ శివుడిని తిట్టారు కదా అని.. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన తిడుతూ కూడా అవన్నీ చేసింది ఆయనే అని చెప్పకనే చెప్పారు..
తిట్టడం కాదు ' నిందా స్తుతి ' అంటారు, అంటే
నిందుస్తూ స్తుతించడం

సిరిగల వానికి చెల్లును
తరుణుల పదునారు వేల తగ పెండ్లాడన్
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
అని శ్రీనాధుడు చెప్పినా

కలికి తురాయి నీకు మెరుపుగ చేయిస్తె రామ చంద్ర
నీవుకులు కుచు తిరిగెదవు
యెవరబ్బ సొమ్మని రామచంద్ర ||

అని కంచెర్ల గోపన్న/భద్రాచల రామదాసు చెప్పినా

లేక సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు చెప్పినా

నిన్న కాక మొన్న వచ్చిన శ్రీవల్లి పాట లో చంద్రబోస్ చెప్పినా

నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు

నువ్వేకాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు

ఎర్రచందనం చీర కడితే
రాయి కూడా రాకుమారే

is a form of prayer in which the person praise and blame God at the same time.

It comes out of a feeling of closeness!!
 
Watching the devotional Telugu movie Ramadasu, which is about a great bhakta (devotee) of Lord Rama and a Carnatic composer named Ramadasu, I was stunned at the song Ikshvaku Kula Tilaka. I vividly remember holding my hand to my mouth while
the composition, which was composed by Ramadasu, that seemingly was insulting Lord Rama was sung.

For instance, one line in the composition goes
“Neevu kulukucu tirigevu evarabba sommani Ramachandra”

which basically means

“With whose father’s wealth do you think you are shamelessly enjoying and traveling?”

Blasphemous, I thought!

The next lines went further:
“Mee tandri Dasharatha Maharaju pettena Ramachandra?

Leka mee Mama Janaka Maharaju Pampena Ramachandra?”

Here, Ramadasu was asking Lord Rama if the wealth and jewels Rama was adorned with in Bhadrachalam were paid for by Dasharatha Maharaja or sent by his father-in-law Janaka Maharaja.

My initial shock transitioned into pondering; I wondered why a devotee that sacrificed freedom to build a Rama temple in Bhadrachalam was questioning the very same divine being.

I didn’t have to think long because I began to understand what I was listening to when the last line from the composition was sung:

“Bhaktu landarini paripalincedi Sri Ramachandra. Neevu kshemamuga Sri Ramadasuni elumu Ramachandra”

Meaning?

“You are the one who rules and looks after your devotees, O’ Lord Rama. So please ensure that your very own Ramadasu is also safe and protected, O’ Lord Rama.”
 
What are Ninda Stutis?

Ninda Stuti essentially translates into praising (Stuti) through blame or abuse (Ninda). Confusing? What I also thought. In Ninda Stuti pieces, you question the Divine. Sometimes you scold them or make unflattering comparisons, such as how Sant Tukaram compares Lord Vitthala to a Bhoota (Ghost) in Pandhariche Bhoota Mothe.

However one chooses to approach Ninda Stutis, one thing is for certain: it always is done out of love. Love for the Divine.

Ninda Stutis are a unique way for great devotees of the Divine to praise them and show their love for them.
 
Watching the devotional Telugu movie Ramadasu, which is about a great bhakta (devotee) of Lord Rama and a Carnatic composer named Ramadasu, I was stunned at the song Ikshvaku Kula Tilaka. I vividly remember holding my hand to my mouth while
the composition, which was composed by Ramadasu, that seemingly was insulting Lord Rama was sung.

For instance, one line in the composition goes
“Neevu kulukucu tirigevu evarabba sommani Ramachandra”

which basically means

“With whose father’s wealth do you think you are shamelessly enjoying and traveling?”

Blasphemous, I thought!

The next lines went further:
“Mee tandri Dasharatha Maharaju pettena Ramachandra?

Leka mee Mama Janaka Maharaju Pampena Ramachandra?”

Here, Ramadasu was asking Lord Rama if the wealth and jewels Rama was adorned with in Bhadrachalam were paid for by Dasharatha Maharaja or sent by his father-in-law Janaka Maharaja.

My initial shock transitioned into pondering; I wondered why a devotee that sacrificed freedom to build a Rama temple in Bhadrachalam was questioning the very same divine being.

I didn’t have to think long because I began to understand what I was listening to when the last line from the composition was sung:

“Bhaktu landarini paripalincedi Sri Ramachandra. Neevu kshemamuga Sri Ramadasuni elumu Ramachandra”

Meaning?

“You are the one who rules and looks after your devotees, O’ Lord Rama. So please ensure that your very own Ramadasu is also safe and protected, O’ Lord Rama.”
Actually prema ni bhakthi ni ela ayina chupinchacchu Deeps, kakapothe.. receiving end ela react avutaro chusukovali... specially 'Bhakthi' vishayam lo ..devudu manam ela pilichina palukutadu, em chesina pattinchukodu kabatti , elaa ayina stutinchacchu... Basically manam evaritho ayina closeness unte..we take the liberty to say, call , do anything with them kada...just like that!!
 
Top