Risikumar Reddy
Epic Legend
"ఏమిటోరా! ఆస్తమాను పెన్ను ఎక్కడ పెట్టానో మర్చిపోతూ ఉంటాను"
ఎందుకు అలా?
ఏమిటో మరి ఈ మతిమరుపు! అందుకే నేను ఎప్పుడో ఖరీదైన పెన్నులు వాడటం మానేసాను. చీప్ పెన్ను మాత్రమే వాడుతున్నాను. అది మర్చిపోయి పారవేసిన బాధ అనిపించదులే! అయితే నా బాధ అంతా ఈ మతిమరుపు గురించే!
"నేను ఒక సలహా ఇవ్వనా?"
"మతిమెరుపు పోతుందా?"
"చెప్పలేను! నీమీద ఆధారపడి ఉంటుంది!"
"ఏమిటది?"
"నువ్వు కొనగలిగినంత అత్యంత ఖరీదు అయిన పెన్ను కొని వాడుతూ ఉండు. అప్పుడు కూడా నువ్వు మర్చిపోతావా? నీ మతిమరువు పోతుందా చూద్దాం."
తప్పకుండా చేస్తాను
ఆర్నెల్ల తర్వాత స్నేహితుడు ఫోన్ చేసి పెన్ను మర్చిపోతున్నావా? అని అడిగాడు.
"అబ్బే! నువ్వు చెప్పిన తర్వాత 22 కేరట్ల బంగారం పెన్ను కొన్నాను. దాని విషయంలో చాల జాగ్రత్తగా ఉంటున్నాను. ఈ ఆరునెలల్లో ఒక్క రోజు కూడా నేను దానిని ఎక్కడా మర్చిపోలేదు."
"నువ్వు పెన్ను మర్చిపోవడానికి కారణం నువ్వు దానికి ఇచ్చిన విలువ. మనం దేనికి విలువ ఇస్తామో దానిపట్ల మనం జాగ్రత్తగా ఉంటాము. వస్తువుకి విలువ ఇస్తే దాన్ని కోల్పోము."
ఆరోగ్యానికి విలువ ఇస్తే ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎంత తినాలో, ఎప్పుడు తినాలో అని జాగ్రత్తగా ఉంటాము.
స్నేహానికి విలువ ఇస్తే స్నేహితుడికి గౌరవం ఇస్తాము.
డబ్బుకి విలువ ఇస్తే ఆచి తూచి ఖర్చు పెడతాము.
కాలానికి విలువనిస్తే సమయం వృధా చేయము.
బంధాలకు విలువనిస్తే వాటిని తెంచుకోము.
"దేనికి ఎంత విలువ ఇవ్వాలో తెలుసుకొని వ్యవహరించడం మనం నేర్చుకోవలసింది.