Risikumar Reddy
Epic Legend
ఆడపిల్లలంటేనే సున్నితమైనవారు.
అందులోను కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఏడుస్తుంటారు. కనీళ్ళు పెట్టుకుంటారు. అలాంటి వారిపై అందరికి చులకన బావనే.
వారి గురించి వారి వెనుక హేళన చేసి నవ్వుకుంటారు.
అందరికి చిన్న విషయలుగా కనిపించే చాలా విషయాలు వీరికి పెద్ద విషయాలుగా కనిపిస్తుంటాయి.
నిజానికి చుట్టూ వుండే చాలమందికి వీరంటే ఒకరకమైన ఏహ్యభావం వచ్చేస్తుంది.
వారి కన్నీటి వెనుక కారణాలు తెలిస్తే వారంటే మీకు కూడా గౌరవం పెరుగుతుంది.
వీరు ఎదుటివారి కష్టాలకి కూడా చలించిపోతారు.
వారి భావోద్వేగాలను సమన్వయపరచుకోలేక ఏడుస్తారు.
అలాంటి వారు ఎవరినైనా ప్రేమిస్తే స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తారు. అలాగే మానసికంగా పూర్తిగా వారిపైన ఆధారపడిపోతారు. వారి తోడులేకుండా ఉండలేరు.
వీరి ఆలోచనలు చాల ఉన్నతంగా ఉంటాయి.ఎదుటివారిని బాగా అర్థం చేసుకుంటారు.
వీరు పొరపాటున కూడా ఎవరి మనసును నొప్పించరు. తాము నొచ్చుకున్న ఎదుటివారికి హాని కలిగించాలని ఆలోచించరు.
ఇలాంటివారికి మొహమాటం అధికం. ఎవరినైనా సహాయం అడగాలన్నా చాలా ఆలోచిస్తారు. ఇంకొకరిని తమ అవసరాలకి వాడుకోవడం వీరికి చేతకాదు. వీరు ఇబ్బంది పడిన బయటికి చెప్పలేరు.
వీరి మొహమాటం వలన ఎవరితోనూ కలవలేక తమకి ఎవరులేరని బాధపడుతుంటారు. ఆ ఒంటరి భావనలో ఏడుస్తుంటారు.
కానీ కొన్ని పరిస్థితితులలో వీరు మానసికంగా దృఢత్వం కలవారు. ఎవరు తనని చూసి నవ్వుకున్నా పెద్ద విషయంలా అనిపించదు.తమ ఉద్వేగాలను ప్రదర్శించడానికి ఎలాంటి సంకోచం ఉండదు.
ఎవరైనా హాని చేసినా ఏడుస్తారు తప్ప తర్వాత అది మనసులో పెట్టుకొని సాధించారు, వైరం పెంచుకోరు.
అనుకోకుండా తప్పుగా మాట్లాడిన తమ తప్పును అంగీకరిస్తారు.
వీలైతే ఎక్కువ సమయం వీరితో గడపండి. ఇలాంటి వారు ఏ విషయం మీ దగ్గర దాచాలనుకోరు.
కష్టాలను భరిస్తారు తప్ప ఎప్పుడూ విడిచి వెళ్లాలనే మనస్తత్వం కాదు వీరిది.
వీరు మంచి చెడులను గుర్తించి ప్రవర్తిస్తారు.
కనుక ఎంత స్వచ్ఛమైన మనస్సుగల అమ్మాయిలను ఏడిపించడం మానేసి వారి మనసును అర్థం చేసుకోగలరని మనవి.