Risikumar Reddy
Epic Legend
చల్లచల్లని చలికాలం దూరమై
మెల్లమెల్లగా వేసవికాలం చేరువై
మదిని ఆహ్లాదపరిచే ప్రకృతితో మమేకమై
జరుపుకొనే రంగుల పండుగ హోళీ..
పంటలు ఇంటి గుమ్మంలోకి చేరి
ధాన్యపు రాసులు గుమ్ముల్లో జారి
పాడిసంపద సమృద్ధిగా పారి
రైతన్న మోమున చిరునవ్వులు విరిసే సందర్భం..
వసంత ఋతువుని ఆహ్వానిస్తూ
కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ
కోయిల కూతలని ఆస్వాదిస్తూ
ఆనందోత్సాహాలతో జరుపుకొనే సంబరం..
పుడమి తల్లిని సప్తవర్ణాలతో అభిషేకించి
సహజసిద్ద పుష్పాల రంగులను విదిలించి
ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కురిపించి
సుమగంధాలను పులుముకొనే ఉత్సవం..
HOLIకా దహనం గావించబడిన దినం
పూతన రాక్షశి ప్రాణాలు హరించిన సుదినం
శివుడు కామున్ని భస్మం చేసిన పర్వదినం
పురాణగాధలేవైనా కులమతాలకు అతీతంగా
భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పర్వం.
మెల్లమెల్లగా వేసవికాలం చేరువై
మదిని ఆహ్లాదపరిచే ప్రకృతితో మమేకమై
జరుపుకొనే రంగుల పండుగ హోళీ..
పంటలు ఇంటి గుమ్మంలోకి చేరి
ధాన్యపు రాసులు గుమ్ముల్లో జారి
పాడిసంపద సమృద్ధిగా పారి
రైతన్న మోమున చిరునవ్వులు విరిసే సందర్భం..
వసంత ఋతువుని ఆహ్వానిస్తూ
కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తూ
కోయిల కూతలని ఆస్వాదిస్తూ
ఆనందోత్సాహాలతో జరుపుకొనే సంబరం..
పుడమి తల్లిని సప్తవర్ణాలతో అభిషేకించి
సహజసిద్ద పుష్పాల రంగులను విదిలించి
ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలు కురిపించి
సుమగంధాలను పులుముకొనే ఉత్సవం..
HOLIకా దహనం గావించబడిన దినం
పూతన రాక్షశి ప్రాణాలు హరించిన సుదినం
శివుడు కామున్ని భస్మం చేసిన పర్వదినం
పురాణగాధలేవైనా కులమతాలకు అతీతంగా
భక్తిశ్రద్ధలతో జరుపుకొనే పర్వం.
Last edited: