• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Happy Durgasthami - Oct 13th 2021

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
హిందువుల్లో దేవుళ్లు, దేవతలపై ఎంతో నమ్మకం. భగవంతుడుని పూజించడం ఒక లక్షణంగా భావిస్తారు. ప్రతి దేవుడికి నిర్దిష్టమైన కారణముంటుంది. ఎందుకంటే వారి వారి నిర్వర్తించే విధులను బట్టి ఈ విధంగా వర్గీకరించారు. బ్రహ్మదేవుడు సృష్టికర్త కాగా.. శ్రీ మహావిష్ణువు సంరక్షకుడు, శివుడు సంహారకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక ఇతిహాసం ప్రకారం, అది పరాశక్తి తన శక్తులను కలగలపి త్రిమూర్తులకు జన్మనిచ్చింది. ఆది పరాశక్తి అవతారమైన దుర్గామాత మహిషసూరుడు అనే రాక్షసుడిని సంహరించిన సందర్భంగా దుర్గాష్టమిని నిర్వహిస్తారు.

ఆదిపరాశక్తి అంటే స్త్రీ శక్తికి వ్యక్తిత్వం. చూసేందుకు అమ్మవారు ఎనిమిది లేదా పది చేతులతో దర్శనమిస్తుంటుంది. అందుకే ఆమెను అష్ట భుజ లేదా దశ భుజ ధారిని అని అంటారు. సింహాన్ని అధిరోహించిన దుర్గమ్మ.. పాదాల కింద మహిషాసురుడిని సంహిరిస్తూ ఉగ్రరూపంలో ప్రదర్శిస్తుంటుంది. శక్తి స్వరూపమైన అమ్మవారు దుర్గాష్టమి రోజున భక్తులకు పూజలు అందుకుంటుంది
 
Last edited:

Navaratri durgashtami: మహాష్టమి రోజు మహాస్నానం తర్వాత తొమ్మిది కుండలను ఏర్పాటు చేసి 9 శక్తులను ఆవాహన చేస్తారు. ఈ మహా అష్టమి పూజ సమయంలో దుర్గామాత తొమ్మిది రూపాలను పూజిస్తారు.​


నవరాత్రుల్లో దుర్గాష్టమి Durgashtami అష్టమి రోజు వస్తుంది. నవరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత శక్తిమంతమైనవి. ఇక దుర్గాష్టమి మహాస్నానంతో మొదలవుతుంది. ఎందుకంటే పవిత్రమైన వేడుకలకు ముందు శరీరాన్ని, అపవిత్రమైన ఆలోచనలను తొలగించడానికి ఇలా చేస్తారు. దుర్గాష్టమి మన దేశంలో అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు. అష్టమి అంటే ఎనిమిది. నవరాత్రుల్లో మహాగౌరీ అంకితమిచ్చిన రోజు. ఇది దుర్గామాత Durga mata ఎనిమిదవ అవతారం. 2021 అక్టోబర్‌ 13న దుర్గాష్టమి వస్తుంది. బెంగాల్‌లో షష్ఠి నుంచి మొదలు పెడతారు. మొత్తం ఆరురోజులపాటు వేడుకలు నిర్వహిస్తారు. దుర్గాష్టమిని మహాష్టమి అని కూడా అంటారు. ఈరోజు మహాశక్తి చాముండి అవతారాన్ని పూజిస్తారు. చాముండి ఈరోజు మహిషాసురుడి రాక్షస సహచరులైన చండా, ముండా, రక్తబీజాలను అంతం చేస్తుందని నమ్ముతారు.

ఈ రోజున చిన్నారులకు కుమారి పూజలో భాగంగా దేవత రూపంలో తయారు చేసి వారికి పూజలు చేస్తాం. దృక్‌ పంచాంగం ప్రకారం అష్టమి చివరి 24 నిమిషాలు అష్టమి తిథి, మొదటి 24 నిమిషాలు నవమి తిథి అంటారు. దీన్నే సంధి అని కూడా అంటారు. ఈ టైంలో పూజ చేస్తే విశేష లాభాలు ఉంటాయి.పూర్వకాలంలో ఈరోజు జంతు బలి కూడా ఉండేది. దీన్ని నిషేధించిన తర్వాత గుమ్మడికాయను కోస్తారు. అరటిపండ్లు కుకుంబర్‌ను కూడా పూజలో వాడతారు.

అలాగే హారతి సమయంలో 108 మట్టీ దీపాలను వెలిగించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. ఇది ఆచారంగా ఉంది
 
దుర్గాష్టమి..

ఒకానొక సమయంలో దుర్గం అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు విశ్వం పూర్తిగా విధ్వంసం సృష్టించేవాడు. దేవతలు అతడిని ఓడించలేకపోయేవారు. అతడి దారుణాలు భరించలేక కైలాసానికి శివుడి సహాయం కోసం వెళ్లారు. కానీ, దుర్గానికి మనుషుల చేతిలో మరణం లేని వరం పొందాడు. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులు తమ బలాలతో శక్తిని సృష్టిస్తారు. దీంతో ఆమె వెంటనే అవతరించి.. శాంతిని నెలకొల్పడానికి ఆమె ఆ రాక్షసుడిని సంహరించింది. అందుకే ఆమె దుర్గాగా అవతరించింది. ఈరోజు కొబ్బరికాయకు కూడా పూజ చేస్తారు.

అష్టమిరోజు అమ్మవారికి బెల్లాన్ని సమర్పిస్తే.. మన శోకాలు పోతాయట. దుర్గామాతకు ఎర్రటి వస్త్రం లేదా చీరను సమర్పించాలి. ఎరుపు రంగు పూలతోనే అమ్మవారికి పూజ చేయాలి. ఎరుపు అక్షింతలను అమ్మవారికి సమర్పించాలి. ఈరోజు దుర్గ అష్టోత్తరాన్ని తప్పకుండా పారాయణం చేయాలి. ఈరోజు అమ్మవారు కాళరాత్రి రూపంలో దర్శిస్తారు
 
Happy durgaashtmi and And Mahanavmi..
 
Top