మనకు ఆరోగ్యంగా ఉన్నంతకాలం మనమే కింగ్స్. ఏ జ్వరమో వస్తే మాత్రం ఇబ్బందే. అది వంద దాటిందంటే మంచాన పడతాం. మరెలా... జ్వరం అంతు చూసేదెలా...
జనరల్‌గా మన బాడీలో సరిపడా వేడి ఉంటుంది. అది తగ్గినా, పెరిగినా ప్రమాదమే. వేడి పెరిగితే... జ్వరం మొదలవుతుంది. అది వంద దాటితే... ఇక నిలబడనివ్వదు. మంచానికే పరిమితం చేస్తుంది. ఆ సమయంలో ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా... వేడి తగ్గదు. ఏ ఇంజెక్షనో ఇవ్వాల్సిందే. కానీ... డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలన్నా పేషెంట్‌కి ఎనర్జీ ఉండాలి కదా. కానీ ఆ వేడిలో ఏమీ తినబుద్ధి కాదు. నోరు చప్పగా, చేదుగా ఉంటుంది. ఎలాగొలా ఏదైనా తినిపించినా... వికారంగా ఉందనో, వామ్టింగ్స్ వస్తున్నాయనో అంటారు. ఆ పరిస్థితులు అలాగే అనిపిస్తుంది. మరి. అప్పుడు పేషెంట్‌ని కాపాడుకోవడం ఎలా? ఏం చేస్తే జ్వరం తగ్గుతుంది?
ఇలా చెయ్యండి : ఓ 200 గ్రాములు పెసరపప్పు తీసుకోండి. దాన్ని ఓసారి కడగండి. తర్వాత దాన్ని ఓ గిన్నెలో పోసి, గిన్నె నిండేలా నీరు (250 గ్రాములు లేదా 300 గ్రాములు పోయండి. జ్వరం తీవ్రతను బట్టీ... ఎక్కువ జ్వరం ఉంటే... 20 నిమిషాలపాటూ పెసరపప్పును నీటిలో నానబెట్టండి. ఆ తర్వాత పెసరపప్పును వడగట్టి... ఆ నీటిని గ్లాసులో పోసి, పేషెంట్‌కి తాగించండి. జ్వరంతో ఉన్నవారు తాగేందుకు ఇష్టపడకపోయినా... ఎలాగొలా తాగించండి.
ఆ నీరు తాగిన 10 నిమిషాల్లో పేషెంట్ శరీరంలో వేడి తగ్గుతూ వస్తుంది. 20 నుంచీ 30 నిమిషాల్లో వేడి తగ్గుతుంది. అంతేకాదు... నోటిలో చేదు, చప్పదనం కూడా కాస్త తగ్గుతుంది. అప్పుడు పేషెంట్‌కి ఏమైనా తినాలనే ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు ఏ ఇడ్లీయో లేదంటే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తినిపించాలి. అదే సమయంలో డాక్టర్ చెప్పిన టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. అంతే... ఆటోమేటిక్‌గా జ్వరం తగ్గిపోతుంది.
ఇదెలా సాధ్యం : పెసరపప్పు మనకు ఎంతో మేలు చేస్తుంది. దానికి మన శరీరాన్ని చల్లబరిచే లక్షణం ఉంది. ఎందుకంటే అందులో విటమిన్ బి, సి, మాంగనీస్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన బాడీని కూల్ చేస్తాయి. అందుకే చాలా ఇళ్లలో పెసర లడ్డూలు చేసి తింటారు. అవి మన శరీరంలో వేడిని కంట్రోల్ చేస్తాయి. వీలైతే... వారానికి ఓసారైనా పెసరపప్పుతో వంటలు చేసి తినడం ఆరోగ్యానికి హాయి.