• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Depression ku Karana - NIvarana Upayaalu

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
డిప్రెషన్ కు కారణాలు...నివారణోపాయాలు....!


ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినా, అనుకున్నది జరగకపోయినా, ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా బాధపడినా కాలక్షికమంలో మరిచిపోతాం. కానీ ఈ బాధ ఎక్కువ కాలం కొనసాగి, దానిలో నుంచి బయటకు రాలేకపోవడమే డిప్రెషన్. దీనివల్ల మానసికంగా దిగులు, నిస్సత్తువలతో పాటు శారీరకంగా అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి.

మూడు దశలు: తీవ్రతను బట్టి డిప్రెషన్‌ను మైల్డ్, మాడరేట్, సివియర్‌గా గుర్తించవచ్చు

మొదటి దశలో మనోవ్యాకులత తీవ్రత కొద్దిగా ఉంటుంది. కొంచె డల్‌గా ఉండటం, ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడటం, పని సామర్థ్యం తగ్గడం లాంటివి కనిపిస్తాయి.


రెండవ దశలో రోజువారీ కార్యక్షికమాలు కుంటుపడతాయి. నిరాశతో ఉంటారు.

మూడోదశలో తీవ్ర పరిణామాలు కనిపిస్తాయి. ఆత్మన్యూనతా భావంతో కుంగిపోతూ, జీవించడం వ్యర్థమన్న భావనలో గడుపుతూ ఉంటారు. విచక్షణారహిత ఆలోచనలు, ఆత్మనింద, ఆత్మహత్య భావనలుంటాయి. విశ్లేషణాశక్తి, హేతువాద దృక్పథం క్షీణించడమే ఇందుకు కారణం.


లక్షణాలు:

భయం, ఏకాగ్రత పోవడం, ఒంటరిగా ఉండిపోవడం, మానసిక అస్థిరత, అభవూదతా భావం, అనాసక్తి, విసుగు, కోపం, మతిమరుపు, జీవితం వ్యర్థమన్న భావన, ప్రతిదానిలోనూ చెడు జరుగుతుందన్న భయం, వ్యతిరేక భావనలు. వీటికి తోడు తలనొప్పి, తలతిరగడం, అజీర్తి, నిద్రలేమి, నీరసం, బద్దకం, శృంగారం పట్ల అనాసక్తి లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవి రెండు వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే దాన్ని డిప్రెషన్‌గా గుర్తించాలి

తీవ్ర డిప్రెషన్ వల్ల మెదడు కుంచించుకుపోయి, భావోద్వేగాలపై అదుపు పోతుందని ఏల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. డిప్రెషన్‌కు గురైన వ్యక్తులు దైనందిన జీవితంలో ఏ పనినీ సమర్థవంతంగా నిర్వహించలేరు. దురలవాట్లకు బానిసలయ్యే అవకాశమూ ఉంది. ఆలోచనా ధోరణులు మారుతాయి. ఏ పనిలోనూ ఆనందాన్ని ఆస్వాదించలేరు. జీవితం వ్యర్థమన్న భావనకు లోనవుతారు.

డిప్రెషన్ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో డిప్రెషన్ బాధితులుంటే తరువాతి తరం వాళ్లు కూడా సులువుగా డిప్రెషన్‌కు లోనవుతారు. పురుషుల్లో కన్నా స్త్రీలు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారు. మెదడులోని రసాయన ద్రవాల్లో ముఖ్యంగా సెరటోనిన్‌లో కలిగే అసమతుల్యతే డిప్రెషన్‌ను కలిగిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. థైరాయిడ్ లాంటి సమస్యలున్న వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, ఫ్లూ జ్వరం లాంటి వైరల్ సమస్యలు కూడా తాత్కాలిక డిప్రెషన్‌కి కారణమవుతాయి.

ఇటీవలి కాలంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి డిప్రెషన్ బాధితుల సంఖ్యను రోజురోజుకీ పెరుగుతోంది. దీర్ఘకాలిక శారీరక, మానసిక సమస్యలతో ఇబ్బందిపడటం, పెరిగే వయసులో ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా లేకపోవడం, తల్లిదండ్రులు తరచూ పోట్లాడుకోవడం, విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు, గృహహింసకు ప్రభావితం కావడం, మద్యం, పొగాకు లాంటి దురలవాట్లు, ఆర్థిక ఒడిదుడుకుల లాంటివన్నీ డిప్రెషన్‌కి దోహదపడతాయి. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఊహించుకోవడం. అకస్మాత్తుగా ఆర్థిక పరిస్థితి దిగజారడం. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాలు తగ్గడం, సరిగ్గా ఇవ్వకపోవడం, ఇబ్బందికర వాతావరణంలో ఉద్యోగాలు చేయడం, కుటుంబానికి దూరంగా ఎక్కువ రోజులు పనిచేయాల్సి రావడం, ఎక్కువ పని ఒత్తిడి, డెడ్‌లైన్స్‌ కారణంగా ఎవరైనా సరే, డిప్రెషన్‌కు లోనవుతారు.


నివారణ:

డిప్రెషన్‌ నుండి బయటపడాలంటే మరచిపోవడం అనేది ఒక గొప్ప మెడిసిన్‌ లాంటిది. ఏవైనా ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాని గురించే ఆలోచించకుండా మన మూడ్‌ను డైవర్ట్‌ చేసుకుని దానిని మరచిపోవడానికి ప్రయత్నించాలి. అట్లా ప్రయత్నించినట్లయితే మనం చాలా సులభంగా ఈ డిప్రెషన్‌ నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. దేనినైనా సరే పాజిటివ్‌గా తీసుకోగలిగితే మనం డిప్రెషన్‌కు గురి కావలసిన అవసరమే ఉండదు. వీటితో పాటు రొటీన్ గా చేయాల్సినవి మరొకొన్ని క్రమం తప్పకుండా పాటించినట్లైతే డిప్రెషన్ నుండి బయటపడవచ్చు...
 
Last edited:
సమతుల్య ఆహారం:

సరైన ఆహారం లభిస్తేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ఆహారంలో పిండిపదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, లవణాలు, ఖనిజాలు, విటమిన్లు - అన్నీ వుండేలా చూసుకోవాలి. ఎప్పుడూ ఒకేరుచి కలిగిన పదార్థాలను తీసుకోకూడదు. అన్ని రుచులను కలిపి తీసుకోవాలి. తృణధాన్యాలు, తాజా పళ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, తక్కువ కొవ్వు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Food.jpg
 
Last edited:
వ్యాయామం

ప్రతి రోజూ వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించాలి. శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువుతోపాటు, ఒత్తిడి కూడా తగ్గుతుంది.

exer.jpg
 
నిద్ర

ఆరోగ్యకరమైన నిద్రను పొందాలి. కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.

sleep.jpg
 
కాఫీ మరియు టీలు

సాయంత్రం 6 తర్వాత కాఫీలు, టీలు కూల్‌డ్రింకులు, ఎక్కువ నూనె పదార్థాలు తీసుకోకూడదు.

coffe.jpg
 
విటమిన్ డి

విటమిన్ డి లోపం వల్ల కూడా డిప్రెషన్ కు దారితీస్తుంది. కాబట్టి మనస్సును ప్రశాంతగా ఉంచుకోవాలన్నా విటమిన్ డి అత్యవసరం. అందుకు ప్రతి రోజూ సూర్యోదయలో ఏర్పడే సూర్యరశ్మిలో కొద్దిసేపు గడపటం చాలా అవసరం. లేదా డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి.
 
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మంచి క్రొవ్వులు నిల్వ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనస్సుకు సంబంధించిన హార్మోనులను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఫిష్ ఆయిల్ లేదా చేపలను తీసుకోవడం చాలా మంచిది.
 
నవ్వాలనుకుంటే మనస్పూర్తిగా నవ్వండి

దు:ఖం కలిగితే భారం దిగిపోయేంత వరకూ ఏడ్చేయండి. దీని వలన మనసులోని భారమంతా దిగిపోయి మనస్సు తేలికగా అనిపిస్తుంది. నవ్వడం అనేది దేవుడు మీకిచ్చిన వరం. మనసారా నవ్వితే నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అన్న అనుమానాన్ని కలలో కూడా రానీయకండి. మీ చుట్టు పక్కల ఉండే వారందరూ మీ వాళ్ళే అనుకుంటేనే వారితో స్వేచ్ఛగా నవ్వుతూ వుండగలరు. ముఖ్యంగా ఒంటరిగా దూర ప్రాంతాలలో ఉద్యోగం చేసే మహిళలకు ఇది చాలా అవసరం.
 
dk sayanthram sayanthram mandhu kottavaaa :Cwl: edhedho matladthunaav ramdev babaji laaa
 
గార్డెనింగ్

ఒంటరిగే గడిపేవారికి గార్డెనింగ్, పెట్స్ ను పెంచుకోవడంతో పాటు పుస్తకాలు మంచి నేస్తాలు. అవి మీ మనస్సును ప్రతిబింబిస్తాయి. ఒక మంచి పుస్తకం చదివితే ఒక మంచి ఫ్రెండ్ ని కలిసిన అనుభూతి కలుగుతుంది. వీలు దొరికినప్పుడల్లా మంచి సాహిత్య గ్రంథాలు కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒంటరితనం అనిపించినప్పుడల్లా అవి మీకు మంచి కాలక్షపం అవుతాయి. అలాగే మీకు మంచి నేస్తాలు పువ్వులను మొక్కలు. వీటిని పెంచుకొన్నట్లైతే సమయం అంతా గార్డెన్ లో సరిపోతుంది. అవి వికసించినప్పుడు మనస్సుకు కలిగే ఆనందం ఇంతా అంతా కాదు. అలాగే పెట్స్.. మనతో ఉంటే మనకు తోడు ఒకరున్నారన్న భావన కలిగి వాటితో మాట్లాడి, ఆడిపాడి సరదాగా గడిపేయెచ్చు.
 
మద్యపానం

మద్యపానం మానాలి. మద్యపానం వల్ల డిప్రెషన్‌ లక్షణాలు ఇంకా తీవ్రంగా మారతాయి. తీసుకునే మందులు సరిగ్గా పనిచేయవు
 
అలంకరణ

మరో రకంగా మానసిక దెబ్బను ఎదుర్కొనాలంటే, మీరు అందంగా అలంకరించుకొని బయట తిరగండి. ఇక మీకు వచ్చే డిప్రెషన్ కూడా రాకుండా దూరం అయిపోతుంది. మీరు కనుక బాధ పడుతూ, ఏడుస్తూ, ఏ అలంకరణ లేకుండా కూర్చుంటే మీకు మనో వేదన కలిగి మరింత దిగజారిపోయే పరిస్ధితి ఏర్పడుతుంది. కనుక మొదటి చర్యగా అందంగా అలంకరించుకొని గ్రేట్ గా భావిచండి
 
కుటుంబ సభ్యులు-స్నేహితులు

కుటుంబ సభ్యుల, స్నేహితుల నెట్‌వర్క్‌ డిప్రెషన్‌ బాధితులకు ఎంతో తోడ్పడుతుంది. తాము ఒంటరిగాలేమనే భరోసా ఇస్తుంది.
 
మెడిటేషన్(ధ్యానం)

ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల డిప్రెషన్ లో మంచి ఫలితాన్ని ఇస్తుంది.
 
విహారయాత్రకు:

ఒక రోజు పిక్నిక్ లేదా రెండు మూడు రోజుల విహార యాత్ర వంటి వాటికి హాజరు కావటం, తరుచు పిల్లలతో బయటకు వెళ్లి సరదాగా గడపటం, మీకు ఇష్టమైన పనులు చేయడం వంటివి చేస్తే దాదాపు డిప్రెషన్ నుంచి విముక్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
 
Top