• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Corona Ayurvedam Mandu or choornam

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
కృష్ణపట్నం లో కరోనాను తగ్గించేందుకు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారుచేసే ఆయుర్వేద మందు కు సంబంధించి సమాజంలోని అన్ని వర్గాలు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు పలికారు...


♂️♂️♂️♂️♂️♂️♂️

కరోనా వైరస్ కి #విరుగుడు_మందు(ఆయుర్వేదం) ఉచితంగా అందిస్తున్న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామ ఆయుర్వేద వైద్యులు #బొనిగి_ఆనందయ్య గారు

#డబ్బులు_తీసుకోరు వస్తువులు ఇవ్వొచ్చు

మందు తయారీకి కావలసిన వన మూలికలను
తెచ్చి ఇస్తే వాటితో ఆ మందును తయారు చేసి మనకు ఇస్తారు.

#వన_మూలికలు:
1. అల్లం
2. తాటి బెల్లం
3. తేనె
4. నల్ల జీలకర్ర
5. తోక మిరియాలు
6. పట్టా
7. లవంగాలు
8. వేప ఆకులు
9. నేరేడు చిగుర్లు
10. మామిడి చిగుర్లు
11. నేల ఉసిరి చెట్టు
12. కొండ పల్లేరుకాయల చెట్టు
13. బుడ్డ బుడస ఆకులు
14. పిప్పింట ఆకుల చెట్టు
15. తెల్లజిల్లేడు పూల మొగ్గలు
16. ముళ్ళ వంకాయలు

#ముఖ్య_గమనిక: మీ పరిసర ప్రాంతాలయందు అందుబాటులోవున్నవాటిని తీసుకొని రావాలని కోరుతున్నారు

కృష్ణ పట్నం
ఆనందయ్య గారి నెంబర్
ఆయుర్వేద మందు..6281025921
Covid 19 వచ్చిన వాళ్లు కాంటాక్ట్ చెయ్యండి దయచేసి ఎవరూ టైంపాస్ చేయొద్దు
 
Krishnapatnam: ఆయుర్వేద మందుకి వేలాదిగా వస్తున్న ప్రజలు

కృష్ణపట్నం: కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. దీంతో సుమారు 3కి.మీ మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఇంత వరకు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. దీంతో అక్కడికి వచ్చిన వారు నిరాశగా వెనుదిరిగారు.

పంపిణీ చేయాలా? వద్దా?

మరోవైపు ఈ అంశంపై సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. ఆయుర్వేద ముందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించనున్నారు. ఆ మందు శాస్త్రీయత, పనిచేసే విధానాన్ని సీఎం తెలుసుకోనున్నారు. ఇప్పటికే అధికారుల బృందం చేసిన పరిశీలన, నివేదికపై ఆయన చర్చించనున్నారు. అనంతరం పంపిణీపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ పంపిణీకి అధికారికంగా అనుమతిస్తే ప్రభుత్వపరంగా చేయాల్సిన ఏర్పాట్లపై జగన్‌ చర్చించి ఆదేశాలివ్వనున్నారు.
 
Nellore...:wink:

Screenshot_20210521-130556_Instagram.jpg



RUMORS ARE THAT THE MEDICINE WILL CURE PATIENT IN 2 DAYS... Let's see what happens... Let's hope for the best...
 
Infact AP Govt gave approval for free distribution of this medicine as the report shows there are no harmful elements in this medicine
 
Nellore: కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. నేటి నుంచి పంపిణీ

Source : "News18 తెలుగు" via Dailyhunt

యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి
 
Krishnapatnam ఆనందయ్య ఔషధం మంచిదే: ఆయుష్‌

అమరావతి: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఔషధంలో హానికారమైన పదార్థాలేవీ లేవని ఆయుష్‌ విభాగం స్పష్టం చేసింది. ఔషధం కోసం మొత్తం 18 మూలికలు వాడినట్లు తెలిపింది. వాటిపై పూర్తిగా చర్చించామని, వివరాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి తెలిపామని ఆయుష్‌ కమిషన్‌ రాములు మీడియాకు వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక వస్తుందన్నారు. ఆ మందుతో లబ్ధి జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని ఆయన అన్నారు.

‘‘70 నుండి 80 వేల మందికి పైగా ఇప్పటి వరకు మందులు ఇచ్చామని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువ మంది మందు తీసుకోవడం వల్ల ఒకరిద్దరిలో ఇబ్బందులు ఉండొచ్చు. మందులో వాడే పదార్ధాలన్నీ ఆయుర్వేదం అంగీకరించినవే. కానీ, ఆయుర్వేద ముందుగా గుర్తించాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ పుస్తకాల్లో లేని మందు ఏదైనా క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఏ మోతాదులో ఆ పదార్ధాలు వాడుతున్నారనేది కూడా ముఖ్యమే.ఆయుర్వేదిక్ మెడిసిన్ అని పిలిచేదానికి అవకాశం లేదు. ఈ ఔషధాన్ని కోవిడ్‌కు మందుగా పరిగణించలేం. ‘నాటు మందు’ అని అవమానించే అవసరం లేదు. ఆ మందు వల్ల ఉపయోగం ఉంది’’ అని రాములు వివరించారు.

వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్నది తమకు తెలియదని, దీనిపై కంటి వైద్య నిపుణుల సలహాలు కూడా తీసుకుంటామని రాములు అన్నారు. కంట్లో వేసే చుక్కలపై కొన్ని అనుమానాలు ఉన్నాయని, అవి తొలగిపోయిన తర్వాత దానిపైనా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘ కళ్లలో వేసే మందులో మూడు పదార్ధాలు వేస్తున్నారు. ఆయుర్వేదాన్ని బట్టి ఆ మూడింటి వల్లా నష్టం లేదు. నాణ్యత లాంటి అంశాలు పరిశీలించాల్సి ఉంది. గామస్థులను విచారించిన తర్వాత ఆ ప్రాంతంలో కరోనా కేసులు తక్కువ ఉన్నాయని తెలిసింది. కరోనా మరణాలు కూడా ఆ ప్రాంతంలో ఉన్నాయి. పూర్తి వివరాలను సీఎంకు వివరించాము. మరో నాలుగైదు రోజుల్లో పూర్తి నివేదిక అందిస్తాం’’ అని రాములు చెప్పారు.
 
Top