• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Chanakya Niti: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. వ్యక్తి కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలన్న చాణక్య

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
ఆచార్య చాణక్యుడు (Chanukya) బహుముఖ ప్రజ్ఞాశాలి. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి . తన అనుభవాల ఆధారంగా మనిషి జీవించే విధానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు. అవి నేటి జనరేషన్ కు అనుసరణీయం. ఒక వ్యక్తి అలవాట్లను బట్టి మాత్రమే మంచి మరియు చెడు అని నిర్ణయిస్తారు. మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ప్రజలకు స్పూర్తిగా నిలవడమే కాకుండా గౌరవం, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అదే సమయంలో, తప్పుడు అలవాట్లను కలిగి ఉన్న వ్యక్తి తన జీవితాన్ని తనే స్వయంగా నాశనం చేసుకున్నవాడు అవుతాడు. ఆచార్య చాణక్యుడు చాణక్య నీతి (Chanakya Niti) పుస్తకంలో అలాంటి కొన్ని అలవాట్లను పేర్కొన్నాడు, ఒక వ్యక్తి చెడు అలవాట్లు కలిగి ఉంటే.. లక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందలేడు. దీంతో కుటుంబంలో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. పేదరికం ఉంటుంది. కనుక ఎవరైనా జీవితంలో ఆనందం , సంపదను పొందాలనుకుంటే.. కొన్ని అలవాట్లను పెంపొందించుకోవాలి.. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

రొజూ దైవాన్ని స్మరించే అలవాటు: పూజ చేయడం వల్ల మనిషి ఆలోచనలు మంచి వైపు మరలుతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే ప్రతి వ్యక్తి పూజలు చేయాలి. నిత్య పూజ జరగని ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎపుడు ఉండదు.

అపరిశుభ్ర పరిశరాలు: లక్ష్మీదేవి ఎప్పుడు పరిశుభ్రతను ఇష్టపడుతుంది. విడిచిన బట్టలు ధరించే వారు, పళ్ళు శుభ్రం చేసుకోనివారు, ఇంటిని మురికిగా ఉంచేవారు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు నివసించదు. అటువంటివారు ఎప్పుడు రోగాల బారిన పడతారు. అంతేకాదు ధన నష్టాన్ని కూడా పొందుతారు. కనుక ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. ఇల్లు, శరీరం పరిశుభ్రంగా ఉంచుకోండి.

గొడవలు పడే ఇంట్లో:
ఎవరి ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటే.. అటువంటి వాతావరణం ఉండే ఇంటి పట్ల లక్ష్మిదేవి అసంతృప్తిగా ఉంటుంది. అలాంటి వారి ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. కనుక ఎవరైనా లక్ష్మీదేవి అనుగ్రహం పొందలనుకుంటే.. కుటుంబంలో ప్రేమ, స్నేహ పూర్వక వాతావరణం ఉండేలా చూసుకోవాలి.

పెద్దలతో అమర్యాదగా ప్రవర్తించేవారు:
వృద్ధులను అవమానించే వారు, నిస్సహాయులను వేధించే వారిపై లక్ష్మిదేవి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అలాంటి ఇంట్లో సమస్యల వలయం కొనసాగుతూనే ఉంటుంది, ఆనందానికి తావు ఉండదు. కనుక వృద్దులను , పెద్దలను గౌరవించడం అలవరచుకోండి.
 
Top