• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

Broken Mirror!

EkaLustYa

Eternal Optimist of ZoZo
Senior's
Chat Pro User
పగిలిన అద్దం



నీకేంటి రా .........!!
ఆరడుగుల అందగాడివి .....నువ్వు సై అంటే చాలు ...
ఏడడుగులు వెయ్య డానికి ఏ అమ్మాయి అయినా రెఢి అని friends అంతాఅంటుంటే ...
నిజమేనేమో ....ఆనేసుకుని ఉబ్బి తబ్బిబ్బ యి మెలికలు తిరిగి పోయే వాడిని..గుండెలు గాలూదిన బూరల్లా పొంగి పోయేవి !

ఇదెంత ఘోరమైన అబద్దమో నాకు నిన్నటి వరకు తెలీలేదు ..
నిన్న ఏం జరిగిందంటే ...

దారెంట పోతున్న అందాలరాశి ని " ఏయ్ పెల్లి సేస్కుందాంవత్తావేటి ?" అని అడిగా స్టైల్ గా ..
దానికామె .."ఛీ పోరా నత్తి సచ్చినోడా , నీ మొహమెప్పుడైన అద్ధం లోసూస్కున్నావేట్రా ..థూ " అనేసి చక్కా పోయింది

నాకొక్క సారిగా కళ్ళు బైర్లు కమ్మేశాయ్ ...ఛీ నా బతుకు ఇదిలా అనేసిందేంటి....అనుకుని
పరిగెత్తుకుంటూ వొచ్చి storeroom లో పడేసిన అద్దాన్ని తుడిచి సిద్ధం చేశా నాముఖారవిందాన్ని చూసుకుందామని!
ఇన్నాళ్ళూ భట్రాజుల పొగడ్తలు వినేసి ఆహా, ఓహో అనేసుకుని కలల్లోబతికెయ్యడమే తప్ప ..
నా మొహాన్ని నేను అద్దం లో చూసుకున్న పాపాన పోలేదు!!

నాకు చాలా ఉద్విగ్నంగా ఉంది ..మొట్ట మొదటి సారి నా మొహాన్ని నేనుఅద్దం లో చూస్కోబోతున్నా!
అద్దాన్ని గోడకి తగిలించి , చంద్రబింబం లాంటి నా మొహాన్ని చూస్కోబోయే o తలో .....
కెవ్వు మనే కేక ..storeroom మొత్తం ప్రతిద్వనిం చేలా ..వినిపించింది !!
వెనక్కి తిరిగి చూద్దును కదా!
.....ఈ కేక ...
అప్రయత్నం గా, అసంకల్పిత ప్రతీకార చర్యలా నన్ను నేను చూస్కోగానే నాగొంతులోంచి వొచ్చిన పొలిగావుకేక !!

థూ ....థూ ...థూ ...అని నా భుజాన్ని నేనే తట్టుకుని, నాకు నేనే ధైర్యంచెప్పుకుని ..
మళ్లా అద్దం లోకి ...తొంగి చూశా !

ఇది నేనేనా ? ఇంత అసహ్యం గా ఉన్నానేంటి ?సమాజం లోని రుగ్మతలకిసాక్షీ భూతం లా , అన్ని అవలక్షణాలకి ప్రతి రూపం లా!!
అద్దం లో నా ప్రతిబింబం నన్ను చూసి వికటాట్టహాసం చేస్తోంది !..
ఇది నువ్వే రా !
నేను నీ అంతరాత్మని !!
ఇన్నాళ్ళు అతి జుగుప్సాకరంగా పెంచి పోషించిన నీ అంతర్ముఖాన్ని !!!

అవునా!..నేనేనా!!..అవునూ!!!

నా కళ్ళలో ఎర్రగా కదలాడుతున్న నెత్తుటి జీరలేమిటి ? "కామమా?"
నా అందవికారమైన చేతగాని తనానికి ప్రతీకగా తలలో భూష ణమై ధగ ధగలాడుతున్నదేమిటి ? "క్రోధమా ?"
సకల చరాచర సృష్టి లోని అష్టైస్వర్యాలన్ని నా హంస తూలికా తల్పాలుగాఉండాలనే ఈ గుండె చప్పుళ్ళెమిటి ? "లోభమా?"
బంధమూ, బాంధవ్యా ల్లా అంతు తెలియకుండా ఒకదానికొకటిమెలివేసుకున్న ఈ నరాలేమిటి? "మోహమా?"
భస్మాసురుడి హస్తాల్లా ఎదుటి వాడిని బూడిద చెయ్యాలన్నంతగా నాకడుపులో రేగుతున్న ఈ అగ్ని కీలలేమిటి ? "మధమా?"
తనకి తానే ఆజ్యం పోసుకుంటూ రాకాసి నాల్కల్లా ఎగసి పడుతూ ulcer లాతయారయిన ఈ మాంసపు ముద్ద ఏమిటి? "మాత్సర్యమా?"

నాకు పిచ్చెక్కుతోంది!..నాలోకి నేను కూరుకు పోతున్నాను!! ఆరడుగులఅందగాడినని విర్రవీగిన నేను మరుగుజ్జునైపోతున్నాను !!!
నా అవస్థ చూడలేక అద్దం భళ్ళున పగిలింది ....
మెల్లగా నేను క్రిందకి వొంగి ...."అరిషడ్వర్గాల" ముక్కల్ని వేరుచేస్తూ ....నన్నునేను తిరిగి పునరుజ్జీవిం పజేసుకునే ...పనిలో నిమగ్నమౌతున్నా !!!
 
Top