• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

హే ప్రభూ!నాదో విన్నపం!ఆలకించవూ?!

EkaLustYa

Eternal Optimist of ZoZo
Senior's
Chat Pro User
హే ప్రభూ!నాదో విన్నపం!ఆలకించవూ?!

వికల్పస్వప్న జీవననిశిలో మానసిక పరిభ్రమణాల రహస్య ప్రకంపనల్ని అర్ధం చేసుకునే ఓ మనసునీయవూ?!

నా "అ"సభ్య పద మత్తగజాల ఘీంకారాల్ని వినగలిగే ఓ జత చెవులనీయవూ?!!

దాహార్తినై కుంచుకుపోతున్న హృదయకవాటాల్ని మళ్ళీ తెరిచి వికసింపజేసే తొలకరి జల్లునీయవూ?!!!

ఆశల అడియాశల ఎండమావుల వెంట పరిగెత్తే నా అజ్ఞానానికి ఆత్మదీపం వెలిగించే ఓ ప్రమిదనీయవూ?!

స్వకల్పితమో, పరాఘాతమో తెలీని అయోమయంలో పరాభవాగ్నికీలలకి ఆహుతవ్వని స్తితప్రజ్ఞతనీయవూ?!!

పరీవేదనా నీలాకాశపు వైశాల్యలంతటి నిశ్శబ్దాన్ని వివరించి చెప్పకుండానే అర్ధం చేస్కోగలిగే ఓ స్నేహాన్నీయవూ?!!

ఇన్నిచ్చిన నీకు, నేనేమిచ్చుకోగలవాడను తండ్రీ?! ఆత్మాలింగనం తప్ప!!

EkaLustYa
- 25MAR2023
 
Top