• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

వినాయక చవితి - Vinayaka Chavithi

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak

గణేశ్ చతుర్థిని భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు.​

ఈ ఏడాది సెప్టెంబరు 10 శుక్రవారం నాడు రానుంది. చవితి తిథి ముందు రోజు 12.18 గంటల నుంచి సెప్టెంబరు 10 రాత్రి 09.58 గంటల వరకు ఉంటుంది.​

వినాయకుడిని చవితి తిథినాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారి ఇంట కష్టాలనేవే రావని విశేషంగా నమ్ముతారు.​


భారత్ లో పండుగలకు ఎంతో విశిష్ఠస్థానముంది. తీరిక లేకుండా పనిలో నిమగ్నమయ్యే ప్రజలు పండుగంటే మాత్రం ఆధ్యాత్మిక చింతనతోనే కాకుండా కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అందులోనూ వినాయక చవితి వస్తుందంటే ఆ కోలాహలమే వేరు. విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించిన దగ్గరి నుంచి నిమజ్జనం వరకు రకరకాల పూజలు, సేవలతో హడావిడిగా ఉంటుంది. ముఖ్యం గణేశుని ఉత్సవంలో పిల్లపాపలతో సహా అందరూ ఇందులో పాల్గొంటారు. పురాణాల ప్రకారం విఘ్నేశ్వరుడికే తొలి పూజ చేయాలి. ఎందుకంటే జనుల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి మన లంబోధరుడు. ప్రతి ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి సెప్టెంబరు 10న రానుంది.
 
Last edited:
చతుర్విధ ఫలితాల అధిష్ఠాన దైవం

ప్రథమ పూజ్యుడు, పరిపూర్ణ దివ్యతత్త్వ స్వరూపుడు- మహాగణపతి. ప్రకృతీ పురుషులకు పార్వతీ పరమేశ్వరులు సాకార రూపం. వారిరువురి ఏకత్వమే గణపతి. సమస్త దేవతాగణానికి, సకల మంత్ర సమూహానికి గణేశుడు అధినాయకుడు. అఖిల జగత్తు గణమయం. జగపతి అయిన ఈశ్వరుడి శక్తే గణపతిగా ఆకృతి దాల్చింది. ‘గణ’ అనే శబ్దంలో ‘గ’కారం సగుణత్వానికి, ‘ణ’ కారం మనసు, మాటలకు అందరి పరతత్త్వానికి సంకేతాలు. అ, ఉ, మ అనే అక్షరాల మేలు కలయికతో ‘ఓంకారం’ ప్రభవించింది. సృష్టి స్థితి లయలను సత్త్వరజస్తమో గుణాలను, త్రికాలాలను, త్రిలోకాలను ఆ మూడు అక్షరాలు సూచిస్తాయి. మూడక్షరాల సగుణ రూపధారిగా, ఓంకార నాదానికి ప్రతీకాత్మకంగా వేదం గణపతిని ప్రస్తావించింది. సంపద, శక్తి, జ్ఞానం, ఆనందమనే చతుర్విధ మహా ఫలితాలకు వినాయకుడు అధిష్ఠాన దైవం.


అష్టదిక్కులలో వ్యాపించిన శిష్టజన రక్షకుడిగా గణపతిని ముద్గల పురాణం అభివర్ణించింది. బ్రహ్మ విష్ణు రుద్రాది దేవతలు సైతం తమ విశ్వనిర్వహణ కార్యాలకు ఆరంభంగా గణపతిని పూజిస్తారని శివమహాపురాణం పేర్కొంది. అనంతమైన ఆకాశ తత్త్వానికి ప్రతిఫలనం గణపతి. నాదాత్మక స్థితికి ఆకాశం ఆలంబన. అందుకే గణేశమూర్తిని శబ్దబ్రహ్మగా, నాదాత్మక పరమాత్మగా తైత్తిరీ యోపనిషత్తు ప్రకటించింది. మంత్రశాస్త్ర రీత్యా గణాధ్యక్షుడు, మహా కాయుడైన దశభుజ గణపతిగా విరాట్‌ రూపంలో అభివ్యక్తమయ్యాడు. దేవతా శక్తుల సమన్వయ రూపంలో తేజరిల్లుతూ తన పది చేతుల్లో వివిధ దేవతలకు సంబంధించిన ఆయుధాల్ని విశ్వనాయకుడై వినాయకుడు ధరిస్తాడు. వక్రతుండంపై రత్న కలశం లక్ష్మీప్రదమైన లక్షణ శక్తికి ప్రతిఫలనం. ఏకదంతుడైన స్వామి రూపం అద్వైత భావానికి ఆకృతి దాల్చిన మూర్తిమత్వం. ‘ఏక’ శబ్దానికి ప్రధానం అని అర్థం. ‘దంత’ శబ్దం బలవాచకం. సర్వోత్కృష్టమైన బలశాలిగా ఏకదంత గణపతి ఆవిష్కారమయ్యాడు.

గణపతిని శ్రీకృష్ణ అవతారంగా బ్రహ్మవైవర్త పురాణం వర్ణించింది. పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ఆచరించి, గోలోక నివాసియైన కృష్ణుణ్ని వరపుత్రుడిగా కోరుకుందని, ఫలితంగా కృష్ణుడే గణపతిగా ఆవిర్భవించాడని పురాణ గాథ. పరమేశ్వరుడే గణేశ్వరుడిగా సాకారమయ్యాడని గణేశ పురాణం వివరించింది. శక్తి అంశ అయిన నలుగు పిండితో వ్యక్తమైన శక్తిత్వ పుత్రుడిగా, జగన్మాత దివ్య తేజో రూపుడిగా హేరంబోపనిషత్తు పార్వతీ నందనుణ్ని ప్రస్తుతించింది.


గణపతిని తొమ్మిది రాత్రులతో కూడిన కాలగణనతో ఉత్సవ నేపథ్యంగా ఆరాధిస్తారు. నవావరణలకు ఆవల ఉండే భగవచ్ఛక్తిని ఉపాసనతో దర్శించడానికి నిర్వహించే అర్చనా ప్రక్రియల సమాహారమే- గణేశ నవరాత్రులు. గణపతి పూజలో ఏకవింశతి అనగా ఇరవై ఒక్క పత్రాల్ని వినియోగిస్తాం. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, సాధకుడి మనసు- ఇవన్నీ కలిపితే మొత్తం ఇరవై ఒకటి. వీటి సమ్మేళనంతో కూడిన దేహమనే దేవాలయంలోకి గణపతిని ఆవాహన చేసుకోవడమే పత్రిపూజలో పరమార్థం. దైవత్వం, ద్రవ్యం, మంత్రం, క్రియాత్మకం- ఈ నాలుగింటితో కూడినదే యజ్ఞం. చతుర్వేదాల రూపుడిగా, యజ్ఞమూర్తిగా, చతుర్భుజుడిగా గణపతి వర్ధిల్లుతున్నాడు. అందుకే నాలుగు సంఖ్య ప్రధానంగా కలిగిన ‘చవితి’ నాడు షోడశోపచారాలతో విఘ్నరాజును ఆరాధిస్తున్నాం. పురాణాల రీత్యా గణపతి ఆవాసం- ఆనంద భువనం. ఈ భువనం చుట్టూ చెరకు రసాల కడలి ఆవృతమై ఉంటుంది. అందుకే మధుర మనోజ్ఞ ఆనంద రసమూర్తిగా గణేశుడు ప్రకాశిస్తూంటాడు.
 
విఘ్నేశ్వరుని శోభాయాత్రలు..

మట్టి వినాయకుడి పూజగదిలో ప్రతిష్టించి ఆయనకు ప్రత్యేక పూజలు చేస్తారు. గణేశ్ చతుర్థి నుంచి విఘ్నేశ్వరుడికి నవరాత్రి పూజలు మొదలవుతాయి. భక్తిగీతలు ఆలపిస్తూ, భజనలతో ఆ తొమ్మిది భక్తిభావంతో మునిగితేలుతారు. ఈ పూజలు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 14 రోజులు ఇలా ఎవరి తాహతు బట్టి వారు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి నాడు గణేశుని సాగనంపుతూ ఉత్సవాన్ని జరుపుతారు. మచ్చి వచ్చే ఏడాది రావయ్య బొజ్జ గణపయ్య, గణపతి పప్పా మోరియా అంటూ భక్తులు నినదిస్తారు.


విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు..


వినాయకుడిని చవితి తిథినాడు భక్తి శ్రద్ధలతో కొలిస్తే వారి ఇంట కష్టాలనేవే రావని విశేషంగా నమ్ముతారు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి ఆ సర్వేశ్వరుడు విఘ్నాధిపత్యం ఇచ్చారు. విఘ్నాధిపత్యం ఎవరికి ఇవ్వాలనే ఆలచనలో ఉన్న శివపార్వతులు.. తమ కుమారులిద్దరైన గణేశుడు, కార్తికేయులను పిలిచి ఓ పరీక్ష నిర్వహిస్తారు. ముల్లోకాల్లో ఉన్న పుణ్య నదుల్లో స్నానమాచరించి ఎవరైతే ముందు కైలాసానికి వస్తారో వారే విజేత అనేది పరీక్ష. ఈ విషయాన్ని కుమారస్వామి తన వాహనం నెమలిని ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. తన ఆకారాన్ని తలచుకుని బాధపడుతున్న గణేశుడు పరీక్షలోని అసలు సారాంశాన్ని పట్టి తల్లిదండ్రుల వద్దే ఉండి వారికి ముమ్మారు ప్రదక్షిణలు చేస్తాడు. కుమారస్వామి ఎక్కడికి వెళ్లినా అప్పటికే గణేశుడు చేరుకుని ఉండటాన్ని గమనిస్తాడు. ఆ విధంగా పరీక్షలో నెగ్గి విఘ్నాధిపత్యాన్ని పొందుతాడు

భాద్రపద శుద్ధ చవితి రోజున విఘ్నేశ్వరుడు పుట్టిన రోజని కొందరు, గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు భావిస్తారు. మహేశ్వరాది దేవతా గణాలకు గణపతి ప్రభువు. అంటే సకలదేవతలకు ఆయనే ప్రభువన్న మాట. బ్రహ్మ తొలుత సృష్టి కార్యాన్ని ప్రారంభించే ముందు గణపతిని పూజించినట్టు రుగ్వేదం చెబుతోంది. బ్రహ్మవైవర్తన పురాణంలో 'గణ' శబ్ధానికి విజ్ఞానమని, 'ణ' అంటే తేజస్సు అని పేర్కొన్నారు. ఇక పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు తన లేఖకుడిగా గణపతిని నియమించాడు. గణనాథుడు జయకావ్యాన్ని అద్భుతంగా రాయడంతో దానిని తమ దగ్గరే ఉంచుకోవాలని దేవతలు తస్కరించారంటారు.
 

విఘ్నేశ్వరుని కథ

  • సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు.
  • పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు.
  • కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది' అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు.
  • శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు 'మీకేం కావాలో కోరుకోండి!' అనగా, విష్ణుమూర్తి 'ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి' అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో 'నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని' వేడుకొన్నాడు.
  • అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి 'ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది' అని చెప్పి అంతర్థానమయ్యాడు
 
Top