• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

విజయదశమి - 15th October 2021

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ దసరాను అందరూ కలిసి జరుపుకుంటారు. ఈ రోజు ఏ పని ప్రారంభించిన విజయ చేకూరుతుందని విశ్వసిస్తారు. ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాధలు, చరిత్ర ఉన్నాయి.

ముహూర్తం చూడకుండా ఏ పనైనా మొదలుపెట్టవచ్చు.​

దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకూండా దసరా పండగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం తథ్యం. చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్ర సమయం సకల వాంచితార్థ సాధకమైందని గురువాక్యం.

శమీ పూజ ఎందుకు చేస్తారంటే​


శమీ పూజ దశమి రోజు ఎంతో ప్రత్యేకమైంది. శమీ వృక్షమంటే జమ్మిచెట్టు. పాండవుల అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు.. ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి తిరిగి ఆయుధాలను పొందుతారు. శమీవృక్ష రూపంలో అపరాజితా దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధిస్తారు.

రాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి.. రావణుడిని సహరించాడు. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్టను చూసే సంప్రదాయముంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజిస్తార. తర్వాత "శమీ శమయతే పాపం శమీ శతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ" అనే ఈ శ్లోకాన్ని స్మరిస్తూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు శనిదోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తారు.


దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా పండగ జరుపుకున్నారు. అదే విజయదశమి. దేవి పూజా ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో అధికంగా ఉంటుంది. దేవదానవులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జన్మించిన శుభముహూర్తాన్నే విజయదశణిగా పేర్కొన్నారు


పాలపిట్టను ఎందుకు చూస్తారంటే..​


దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధమముంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా, శుభసూచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు. ఇదే రోజు రావణాసురుడిని అంతమొందించిన శ్రీరాముడు యుద్ధంలో ఘనవిజయం సాధించాడు. మహిషారుడి వధ లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే పండుగ నాడు పాలపిట్టను చూస్తే అదృష్టంగా భావించాలని పండితులు చెబుతున్నారు.
 

Vijayadashami-2021: దసరా ఉత్సవాలకు సిద్ధమైన ఇంద్రకీలాద్రి...​

 
చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించు కునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.

చరిత్ర చెబుతున్నదేమిటి..?

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు.

మహిషాసురుడిని వధించిన అమ్మవారు

బ్రహ్మదేవుని వరాల వలన వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.

విజయదశమి రోజునే శమీ పూజ


ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా పోరు. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినము దసరా పర్వదినంగా పిలవబడింది. అదే విజయదశమి కూడా.విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమీ చెట్టుపై పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు.
 
Top