హిందూ సంవత్సరాదిలోని ఐదో నెల శ్రావణం. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ మంచి రోజే. అయితే, శ్రావణమాసానికి పరిపూర్ణత, పరిపక్వత కలిగేది వరలక్ష్మీ వ్రతంతోనే. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని హిందువులు జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారికి లక్ష్మిదేవి అనుగ్రహం, అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్ముతారు. ముఖ్యంగా అత్తవారింట్లో కొత్త కోడళ్లతో ఈ వ్రతాన్ని చేయించడం విశేషం. మహాలక్ష్మీ అష్టవిధ రూపాలతో సర్వ మానవాళి కోరికలు తీరుస్తూ, ఎల్లవేళలా రక్షిస్తుంది. కానీ అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా లక్ష్మీల కంటే వరలక్ష్మీని పూజించడం చాలా శ్రేష్ఠమని పండితులు చెబుతారు. వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకుని మీ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు శుభాకాంక్షలు
అందరికీ శ్రావణ శుక్రవారం
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు
అందరికీ శ్రావణ శుక్రవారం
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు