లవ్ ఫేయిల్ అవ్వటానికి కారణాలు ఏవైనా కావచ్చు.. అది వన్ సైడ్ లవ్‌గా ఉండగానే ఫేయిల్ అయి ఉండవచ్చు. ఇద్దరు వ్యక్తులు లవ్‌లోకి అడుగుపెట్టి, మనస్పర్థలతో విడిపోయి ఉండవచ్చు. కారణం ఏదైనా.. నిజంగా ప్రేమించిన మనసు.. ఆ ప్రేమించిన వ్యక్తి దూరమైనపుడు పడే బాధ వర్ణణాతీతం. కంటికి కనిపించని బాధతో బయటికి కనిపించే యుద్ధం చేయాల్సి వస్తుంది. నిరంతరం ఛస్తూ బ్రతికాల్సి వస్తుంది.. చావాలనిపిస్తుంది కూడా. జీవితంలో అన్నీ కోల్పోయిన వారిలా ఫీలవుతుంటారు.. బాధపడుతూ ఉంటారు. ప్రేమలో ఓడిపోవటం అంటే జీవితంలో ఓడిపోయినట్లుకాదు..
మనం మన సంతోషాలకు దూరమైనట్లు అస్సలు కాదు. మనల్ని వదిలిపోయినవారి గురించి వదిలేసి.. మనకోసం బ్రతుకుతున్న వాళ్లకోసం( తల్లీదండ్రి, కుటుంబసభ్యులు, స్నేహితులు)బ్రతకాలి. లవ్ ఫేయిల్ బాధనుంచి బయటపడటం చెప్పినంత అంత ఈజీ కాదంటారు! నిజమే కానీ, అసాధ్యమైతేకాదు. మనం మన ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకుంటే లవ్ ఫేయిల్ బాధనుంచి బయటపడొచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా..
1) మీకోసం మీరు బ్రతకండి.. మీ కోసం టైం స్పెండ్ చేయండి.
2) జరిగిపోయిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించండి.
3) పదేపదే మీ మాజీ ప్రేయసి లేదా ప్రియుడికి ఫోన్ చేసి విసిగించకండి. అలా చేస్తే వాళ్లు మీ మీద కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. దీంతో మీరు మళ్లీ హర్ట్ అవ్వాల్సి వస్తుంది.
4) మీ చేతుల్లో లేని విషయాల గురించి పదేపదే ఆలోచించకండి. ప్రేమను బ్రతికించుకోవాలనుకునే ప్రయత్నంలో మిమ్మల్ని మీరు బాధించుకోకండి.
5) ఎదుటి వ్యక్తిని క్షమించండి. మిమ్మల్ని మీరు క్షమించుకోండి. దాన్నో గుణంపాఠంగా భావించండి. తప్పు ఎదుటి వాళ్లదే అని నిందించటం వల్ల లాభం ఉండదు.
6) మాజీ ప్రేయసి లేదా ప్రియుడిని గుర్తుకు తెచ్చేవాటికి దూరంగా ఉండండి.
7) మంచి సంగీతం వినండి. సంగీతం ఓ మంచి మందులా పనిచేస్తుంది. మీ మనసు తేలికపడుతుంది.
8) స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపండి. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడుగా..
9) మంచి ఆహారం తీసుకోండి. ఎక్సర్‌సైజులు చేయండి.. సమయానికి నిద్రపోండి. మైండ్ సరిగ్గా పనిచేయాలంటే ముందు మన శరీరం బాగా పనిచేయాలి.
10) కొత్త కొత్త వ్యక్తుల్ని కలవండి.. కొత్త కొత్త ప్రదేశాల్ని తిరగండి.
గట్టి నమ్మకంతో వీటిని పాటించండి.. విజయం తప్పక మిమ్మల్ని వరిస్తుంది.