సాయంత్రం పల్లవి ఇంటికి వచ్చిన రాములమ్మ ,అమ్మా మా అయ్య గారు బలే మంచోళ్ళు కదా అనింది రాములమ్మ .ఏ..... మీ అయ్య గారి గురించి నీకు తెలియదా అనింది పల్లవి .(ఆమ్మో పంతులమ్మ మామూలు మనిషి కాదు తెలివైనదే అనుకుంది రాములమ్మ ).హా అది కాదమ్మా ఊరికే అడుగుతున్న దాదాపు సంవత్సరం అవుతుంది మీరు వచ్చి, మా అయ్య గారు గురించి ఏమనుకుంటున్నారా అని అని అనింది రాములమ్మ .అనుకోడానికి ఏముంది మీరు అనుకునేదే మంచి మనిషి సరదా మనిషి ఇక కొత్తగా నేను చెప్పడానికి ఏముంది అనింది పల్లవి .(ఆమ్మో ఈమె ఒకవేళ లోపల వున్నా బయట పడను కాక పడదు ఎంత తెలివి ,,నేనేమైన అనుకుంటా అని కాబోలు అనుకుంది రాములమ్మ ).సరే కానీ మీ అయ్య గారు రోజు కాలునొప్పి అంటున్నారు గ ,ఈ ఆయింట్మెంట్ తీసుకెళ్లి రాయి కొంచెం అనింది పల్లవి .లేదమ్మా నేను ఇంట్లో వంట చేయకుండా వచ్చా అదేదో మీరే రాయండి అనింది రాములమ్మ .ఓయ్ రాములమ్మ ఇదిగో వుండు కనీసం ఇచ్చేసి అయినా వెళ్ళు అని పల్లవి అంటుంటే ఇప్పటికే ఆలస్యం అయిందమ్మా ఏమనుకోకండి మా ఆయనని ఆకలేస్తుంటది వెళ్లి వంట చేసుకోవాలి అని వెళ్ళిపోయింది రాములమ్మ .ఇప్పుడెలా అని సంకోచిస్తూ ,రామయ్య గారు ఇదిగోండి ఆయింట్మెంట్ అనింది పల్లవి .అక్కడ పెట్టు పంతులమ్మ నేను తర్వాత రాసుకుంటాలే అన్నాడు రామయ్య .హా బలే రాసుకుంటారులే మీరు ఇక పక్కన పడేస్తారు అయినా మోకాలు నొప్పి అంటూ ఆ పొలం లో తిరగకపోతే ఏం ఇంకా ఎంత సంపాదించాలో అనింది పల్లవి .ఓపిక ఉన్నంత వరకు అన్నాడు రామయ్య .మీకు తోడు కూడా ఎవరు లేరు జాగ్రత్త ,డబ్బు కంటే ఆరోగ్యం ముఖ్యం అంటూ ఆయింట్మెంట్ తీసి రామయ్య మోకాలికి రాస్తుంది పల్లవి .అయ్యో పంతులమ్మ మీకెందుకు శ్రమ నేను రాసుకుంటా అన్నాడు రామయ్య .ఏమి కాదులే పెద్దవారేగా మీరు మీరేమైనా ఇంకా వయసులో వున్నారా ఏంటి అనింది పల్లవి .ఇదిగో పంతులమ్మ నాకు మొన్ననే యాభై ధాటి యాభై ఒకటిలో అడుగు పెట్ట అన్నాడు రామయ్య .హా అవునా నేనింకా మొన్ననే ఇరవై వచ్చాయి అనుకున్నానే అని నవ్వింది పల్లవి .నవ్వితే బావుంటావ్ పంతులమ్మ నువ్వు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి అన్నాడు రామయ్య .నేను ఒక్క దానినే కాదు మీరు కూడా మీ పిల్లలకి దూరం అయిన దిగులు నుండి బయటకు రండి .అవును మీరు నాకో సాయం చేయాలి నేను కార్ కొనుక్కుందాం అనుకుంటున్నా మరీ అంత పెద్దది వద్దు అంత చిన్నది వద్దు నాకు వాటి గురించి అంతగా తెలియదు ,మొన్న మీ అమ్మాయి వచ్చిన కారు నాకు నచ్చింది అది ఎంత ఉంటుంది అనింది పల్లవి .ఒక తొమ్మిది లక్షల దాకా ఉండొచ్చు అన్నాడు రామయ్య .సరే అయితే అదే తీసుకుందాం అనింది పల్లవి .మొత్తం కట్టేస్తావా అన్నాడు రామయ్య. లేదు EMI లో తీసుకుంటా ఎలాగో టాక్స్ కట్టడం ఎందుకు ఊరికే అదేదో కార్ అయిన లోన్ తీసుకుంటే బావుంటుంది అని అనింది పల్లవి .అవును పంతులమ్మ ,,,,,నీ జీతం సగం EMI కే పోతుందిగా అన్నాడు రామయ్య .హా పోనివ్వండి నేను ఒక్క దాన్నే కదా నాకు ఖర్చులు ఏమి లావుగా అనింది పల్లవి .అవును పంతులమ్మ ఇంతకీ నీకు కార్ తోలడం వచ్చా అన్నాడు రామయ్య .హా పెళ్లి అయిన కొత్తలో మా ఆయన నేర్పించారులే ,తర్వాత చాలా సార్లు అన్నయది నడిపేదాన్ని అనింది పల్లవి .అవును మీ అన్నయ్య నిన్ను పట్టించుకోడా అన్నాడు రామయ్య .పట్టించుకునేవారు కానీ మా వదిన అంటే భయం .నేనేదో ఉద్యోగం చేయబట్టి నా కాళ్ళ మీద నేను నిలబడబట్టి కానీ లేదంటే ఎప్పుడో నాకు ఇష్టం లేని ఇంకో పెళ్లి చేసేసేవాళ్ళు అనింది పల్లవి .నిజమే పంతులమ్మ ఆడది ఎవరి దయా దాక్షణ్యాలతో బతక కూడదు అన్నాడు రామయ్య .మీ అమ్మాయి ఒక పక్క జాబ్ ,పిల్లలు ,ఇంకా వాళ్ళ అత్త మామలకి ఆరోగ్య సమస్యలు అంట కదా ఇవన్నీ ఎలా నెట్టుకొస్తుందో అని అనింది పల్లవి .రామయ్య కూతురు అంటే ఏమనుకున్నావ్ మరి దానిని నా భుజాలపై ఎత్తుకొని తిప్పా .చిన్నప్పుడు అది కాళ్లతో నా గుండెల పై ఎక్కి తొక్కేది. ఎవరూ వేలెత్తి చుపియకుండా పద్ధతిగా పెంచా గారాబంగా ,నేనే ఆశ్చర్యపోయా ,మా ఇంట్లో ఒక్క పనీ చేయదు పెళ్లి అయ్యాక ఇంత ఓపిక ఎలా వచ్చిందో సంసారం ఇంత బాగా ఎలా నెట్టుకొస్తుందో అని నేనే ఆశ్చర్యపోయా అన్నాడు రామయ్య .ఆడదాని బాధ్యత అంటే అంతే ,తల్లి తండ్రి దగ్గర గారాబం ,అత్త గారి ఇంటికి వెళ్ళాక బాధ్యత తప్పదు అనింది పల్లవి .అవునూ మీ అత్త మామలు పట్టించుకోలేదా నిన్ను తర్వాత అన్నాడు రామయ్య .వాళ్ళు నన్ను కాదని కూతురు దగ్గరకి వెళ్లారు .సరే నేనేం పాపం చేసానో దేవుడు నాకు అందరిని దూరం చేసాడు అని కళ్ళలో నీళ్లు తిరుగుతున్న నవ్వుతు మాట్లాడుతుంది పల్లవి .ఇదిగో అమ్మాయి ఇదేం బాలేదు నట్టింట్లో ఆడపిల్ల ఏడవకూడదు .నీకు మేము ,ఈ ఊరు లేదా ఎందుకు ఏడుపు, ఇంకెప్పుడు ఏడవకూడదు నువ్వు ఇలా ఏడిస్తే నేనేదో చేసాను అనుకుంటారు అమ్మాయ్ అన్నాడు రామయ్య నవ్వుతూ ,చి చాల్లే ఆపండి మీ గురించి తెలిసి బుద్ధున్న వాళ్లెవరు అలా అనుకోరు అనింది పల్లవి. .