1. కిట్టు గాడి స్వతంత్రం
ఏడేళ్ళ కిట్టు గాడు రోడ్డు పక్క టీ బంకు లో టీలు అమ్మే పని చేస్తుంటాడు. వాడి పని రొజూ ప్రతి షాపుకీ తిరిగి వాడి యజమాని చేసిచ్చే టీలు అమ్మడం. ఆ రోజేంటో మిగిలిన రోజుల్లా కాకుండా, బడికి వెళ్ళే పిల్లలందరూ వీపులపైపుస్తకాల బస్తాలు మానేసి, సూటూ బూటూ వేసుకుని చేతిలో మూడురంగుల జెండా తో కేరింతలు కొడుతూ సంతోషం గా ఉన్నారు. జాతరలాకదులుతున్న బడిపిల్లల్ని చూసిన కిట్టు గాడికి, ఇదంతావింతగానూ, ఆశ్చర్యం గానూ అనిపించి బడికి పరిగెత్తుతున్న ఓ పిల్లోడినిఆపి "ఏంటీ మీ స్కూలు లొ ఏం జరుగుతోంది?" అని అడిగాడు. దానికివాడు, వీడిని వింతగా చూసి "నీకీ విషయం తెలీదా? మనకీ రోజు స్వతంత్రంవచ్చిన రోజు, మా స్కూలు లో జెండా ఎగరేసి మిఠాయిలు, చాక్లెట్లుపంచిపెడతారు" అని చెప్పాడు. కిట్టు గాడు వెంటనే "మరి నాకు కూడాపెడతారా?" అని అడిగాడు ఆశగా. "నువ్వు మా స్కూల్ కాదు కదరా!" అనివాడు పరిగెత్తి పోయేంతలో వాడి చెయ్యి పట్టుకుని ఆపి "నీ చొక్కా మీదఅదేంట్రా పిన్ పెట్టి?" అని అడిగాడు. దానికి ఆ పిల్లోడు ఒరేయ్ నీకు ఇదికూడా తెలీదా అన్నట్లు చూసి " ఇది మన దేశ జెండా" అని చెప్పి నా గుండెలమీద ఎంత బాగుందో కదా అన్నట్లు ఫొజ్ ఇచ్చుకుంటూ మరలా పరుగులంకించుకున్నాడు. కిట్టు గాడు వెంటనే పెరిగెత్తుకుంటూ వాడి యజమానిదగ్గరికి వెళ్ళి "ఆయ్యానాకో పది పైసలు ఇవ్వు, జెండా కొనుక్కోవాలి" అనడిగాడు, దానికా ఓనరు "ఏరా నీకు పని మానేసి జెండాలుకావొల్సొచ్చాయా, పోయి టీలమ్మరా" అని డిప్ప మీద ఒక్కటిచ్చాడు. సరేటీలమ్మడానికి మళ్ళా కాళ్ళీడ్చుకుంటూ రోడ్డు మీద పడి, వెంటనే ఒక ఐడియావచ్చి టీ స్టాండ్ ఒక మూల పెట్టి వాడి గుడిసెకు పరుగునందుకుని వాళ్ళమ్మధగ్గరికి వెళ్ళీ ఓ పదిపైసలిమ్మన్నాడు. ఏరా పని మానేసి ఇక్కడ పెత్తనాలేంట్రాఅని వీపు మీద ఒక్కటిచ్చింది. దాంతో నెత్తీనోరు ఏకమయ్యేట్టు ఏడ్చిఎలానైతేనేం ఒక పదిపైసలు సాధించాడు. ఇక ఇనుమడించిన ఉత్సాహంతో జెండాలమ్మే కొట్టు వైపు పరుగు తీసి, కొట్టువాడిని చొక్కాకి పెట్టుకునే ఒకజెండా ఇమ్మని, ఏడ్చి సాధించిన పది పైసలు వాడి చేతిలో పెట్టాడు. వాడుజెండా ఇవ్వగానే, మరి చొక్కాకి పెట్టుకోడానికి "పిన్నో" అంటే దానికింకో పైసాఅవుతుంది రా అన్నాడా కొట్టువాడు. సర్లే ఆ అడిగేదేదో పదకొండు పైసలుఅడుక్కున్నా బాగుండేదనుకుని, ఒక ఈత ముల్లు పెట్టుకుంటేసరిపోతుందిలే అని సర్ది చెప్పుకుని, ఒక ఈత ముల్లు ఎట్లాగైతేనేంసంపాదించి జెండాకి గుచ్చి చొక్కాకి పెట్టుకోబేంతలో తీరా చూస్తే వాడి ఒంటిమీద చొక్కా లేదు! ఏ ఆచ్ఛాదనా లేని వాడి ఎండిన గుండెలు తప్ప!!
2. రంగడి బస్సు ప్రయాణం
రంగడు తన ఊర్లో ఒక వ్యవసాయ కూలీ. ఎంతదూరమైనా కాలినడకనేపోతుండేవాడు. అందుక్కారణం వాడికి బస్సు చార్జీల స్థోమత లేకపొవడంఒకటైతే, శక్తి వున్నన్నాళ్ళూ కాళ్ళని నమ్ముకుంటే పొలా అనేది రెండోదికావొచ్చు. ఒక రోజు వాడి భార్యతో పక్క వూర్లో పొలం పనికి పోయి, నిండుచూలాలైన ఆమెతో తిరిగి వస్తున్నాడు. కొంచెం దూరం నడిచిన తర్వాతఇకామే "నేను నడవలేనురా రంగా" అంటూ ఒక చోట కూర్చునిపోయింది. దానికి రంగడు ఇంకొక మూడు మైళ్ళే కదవే ఎలాగోలా ఓర్చుకుని నడవ్వే అనిబతిమాలాడు. దానికామె ఇక నావల్ల కాదు, ఒక్క అడుగు కూడా ముందుకివెయ్యలేను అని చెప్పేసింది. ఇలాగైతే ఎలాగే నీతో చచ్చేది, అలా అనుకుంటేఈ రోజు పనిలోకి రాకుండా వుండాల్సింది అని విసుక్కుని, సరే ఏంచేద్దాంవూళ్ళోకి ఏదైనా బండి పోకపోతుందా అనుకుంటూ భార్య పక్కన వాడూచతికిలపడ్డాడు. ప్రొద్దుగుంకి పోతోంది, ఎక్కడా బండ్లు వాస్తున్న జాడే లేదు. చీకటి పడుతున్న వేళకి ఒక ఎర్రబస్సు దుమ్ము రేపుకుంటూ వస్తూకనబడింది. దాంతో రంగడు పరిగెత్తుకుని దానికి అడ్డం వెళ్ళి దాన్ని ఆపి, "ఇదో కండక్టరుబాబూ, నా పెళ్ళాం అక్కడ కూలబడింది దాన్ని తీసుకొచ్చే వరకు బస్సు ఆపుసామీ" అని చెప్పాడు. అప్పటికే బస్సు నిండి వుంది, ప్రయాణీకులంతా వీడివైపు అసహనం గా చూడ్డం మొదలెట్టారు. అయినా వాడివేమీపట్టించుకోకుండా పరిగెత్తుకెళ్ళి భార్యని నెమ్మదిగా బస్సులోకి ఎక్కించాడు. వీళ్ళ చెదిరిన ముగ్గుబుట్టలాంటి జుట్టుని, చెమటకంపు కిముక్కులుమూసుకుంటూ, వీళ్ళని అంటుకోకుండా నిలబడడానికిప్రయత్నిస్తూ దూరం గా జరిగి కాస్తంత చోటిచ్చారు. ఇంతలో కండక్టర్ "ఏఊరు వెళ్ళాలి, టిక్కెట్లు తీసుకో' అంటూ డబ్బులకోసం చేయి జాపాడు. రంగడు అతనికి డబ్బులిస్తూ "దుంపల గూడెం కి ఒక ఆడ టిక్కెట్టు, ఒక మగటిక్కెట్టు" అని చెప్పాడు. దాంతో బస్సులో జనమంతా ఎగతాళి గా గొల్లుననవ్వడం మొదలెట్టారు వీడి అజ్ఞానానికి. " ఏరా ఎప్పుడైనా బస్సెక్కినమొఖమేనా? ఇక్కడ ఆడా, మగా టిక్కెట్లుండవ్ అన్నీ ఒకటే" అనినవ్వుకుంటూ టిక్కెట్లు చింపి వాడి చేతిలో పెట్టాడు కండక్టర్. దానికి రంగడు, "అదేం దొరా! మా కూలి పని లొ మగ కూలి కి 70 రూపాయలు, ఆడ కూలికి 50 రూపాయలే ఇస్తారు కదా!! మరిక్కడ ఇదేం తేడా" అన్నాడు. దాంతోరంగడు తన భార్య తో బస్సు దిగే వరకూ దారి పొడవునా నిశ్శబ్దమేఆవరించింది.
వారినీ!! ఏముంది ఈ కథల్లో అని మీరడిగితే, నేను చెప్పేదేమీ లెదు. అది మీమీ ఆలోచనా పథానికి వదిలేస్తాను
( Note: Before Billy Jean King Rebellion for equal prize money in tennis, Men used to get more prize money than Women. This inequaity was addressed though they play only best of 3 sets compared to best of 5 sets by Men. But nothing has been done about the wages in un-organized sector of India and similar other countries)
-Ekalustya
04JAN2022