Risikumar Reddy
Epic Legend
ముక్కు పుడక ముక్కుకే కాదు, ముఖానికే అందం తెచ్చే అతి చిన్న ఆభరణం. ఆ మాట కొస్తే ముఖానికే కాదు, మొత్తం ఆడవారికే అందం తెస్తుంది, అతి చిన్నదైన ఈ ముక్కు పుడక. ముక్కు పుడక అందానికి మాత్రమే అంబాసిడర్ అనుకుంటే పొరపడినట్లే! ఆరోగ్యానికి కూడా మూలమే ఈ ముక్కు పుడక! మనం శ్వాస పీల్చే క్రమంలో దుమ్ము, దూళిని సైతం, నియంత్రిస్తుందని కూడా చెప్తారు. ఆడవారి అందానికి, ముక్కు పైన కృత్రిమంగా పెట్టే రంద్రానికి లింకెవరెట్టారో గాని వాళ్లకు దండం పెట్టొచ్చు. ఎందుకంటే ముక్కు పుడక నిజంగానే అందాన్ని రెట్టింపు చేస్తుంది కాబట్టి. టెన్నిస్ తెలియని ఆడోళ్లు కూడా, సానియా మీర్జాని ఇష్టపడతారంటే కారణం, ఆ ముక్కుకు తగిలించిన ముక్కెరే కదూ..ముక్కు పుడక ఉన్నా లేకున్నా బాగున్నోళ్లు, బాగానే ఉంటారు, పెట్టుకుంటే ఇంకా బాగుంటారు..