పెళ్లి కాని అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం ఎక్కువకాలం స్నేహంగా కొనసాగలేదు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. ఎదుటి వ్యక్తితో మన స్నేహం బాగా ముదిరిన తర్వాత ఎదుటి వ్యక్తిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ముదిరిన స్నేహమే ప్రేమ అని కొంతమంది గుర్తించలేకపోవచ్చు. స్నేహానికి, ప్రేమకు మధ్య ఓ గీత ఉంటుంది. కొన్ని సార్లు గీత అవతలివైపు ఉన్నామా? ఇవతలివైపు ఉన్నామా? మనది స్నేహమా… ప్రేమా.. ఏదో తెలియని కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. అది కొంతమందిలో మాత్రమే. మరికొంత మంది ఈ ఆలోచనలేవీ లేకుండా ప్రేమనే, స్నేహంగా భావిస్తుంటారు. ఇంతకీ ఎదుటి వ్యక్తి మీద మనకున్నది ప్రేమ.. స్నేహమా తెలుసుకోవటం ఎలా?.. ఎదుటి వ్యక్తికి మన మీద ఉన్నది స్నేహమా.. ప్రేమా తెలుసుకోవటం ఎలా?.. దీనికి కొన్ని సంకేతాలు ఉంటాయి. అవి గ్రహిస్తే సరిపోతుంది.
1) ప్రతి క్షణం వారి ఊహలే.. ఊసులే..
మనం ఓ వ్యక్తిని ప్రేమిస్తున్నపుడు మనకు తెలియకుండానే వారి గురించి ఆలోచించటం పరిపాటి. వారిగురించిన ప్రస్తావన లేకుండా ఏ విషయాన్ని చర్చించలేని పరిస్థితికి వస్తాం. ఆమె లేదా అతడు మనల్ని గురించి ఎక్కువగా మాట్లాడటం, మనం ఆమె లేదా అతడి గురించి ఎక్కువగా మాట్లాడటం కేవలం స్నేహం మాత్రమే కాదు. ఎదుటి వ్యక్తి మన పేరును ఉచ్ఛరించే తీరు కూడా వారికి మనపై ఉన్న ప్రేమను తెలియ జేస్తుంది.
2) ఇద్దరూ కలిస్తే యుగాలు క్షణాలవుతాయి..
మామూలుగా కంటే ఎక్కువ సమయం ఇద్దరూ కలిసి గడపటం. అది కూడా యుగాలు క్షణాలు అయ్యేంతలా.. ఓ జంటలా కలిసి షాపింగ్‌లకు వెళ్లటం, రెస్టారెంట్లలో తినటం, గుళ్లకు వెళ్లటం లాంటివి. మీరు ఒంటరిగా కంటే ఎదుటి వ్యక్తితో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడుతున్నారా? అయితే ఓ సారి ఆలోచించండి.
3) ఓ రోజు మాట్లాడకపోతే ఏమీ తోచదు..
మనం ఇష్టపడేవారితో ఓ రోజు కూడా మాట్లాడకుండా ఉండలేము. ప్రతి రోజు కలుసుకునే అవకాశం లేనపుడు ఫోన్లలో మాట్లాడుకోవటం తప్పని సరిగా చేస్తాము. వాళ్లతో మాట్లాడందే పూట గడవదు.. రాత్రి నిద్ర కూడా పట్టదు. ఇది కేవలం ఇద్దరు స్నేహితులమధ్య సంభాషణ లాంటిది మాత్రమే కాదు. అంతకు మించింది కూడా అయ్యుండచ్చు.
4) ఏదో తెలియని బంధం..
మనం ఎదుటి వ్యక్తితో ఉన్నపుడు ఏదో తెలియని ఆనందం. వారినుంచి వెళ్లిపోతుంటే ఏదో బాధ. వాళ్లు మన వాళ్లు అనిపించటం. ఎదుటి వ్యక్తి మనల్ని తాకటం లేదా మనం ఎదుటి వ్యక్తిని తాకటం. వారి స్పర్శకూడా ఓ మధురానుభూతిలాగా అనిపించటం.
5) ప్రేమ ఉన్న చోటే అసూయకూడా ఉంటుంది..
మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారు వందశాతం మన కోసమే సమయం కేటాయించాలని అనుకుంటాం. వాళ్లు మనతో కాకుండా వేరే వాళ్లతో మాట్లాడుతూ ఉంటే సహించలేం. వేరే వాళ్ల గురంచి మాట్లాడుతుంటే అస్సలు సహించలేం. ఇవన్నీ ఓ ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నారు అనటానికి సూచనలు.