ఈ మధ్య ఓ మిత్రురాలు movie బాగుందోయ్, కంటి పాప తోకాదు “పాప కంటి” తో చూసి చావు అని ఆర్డరేసినట్టు మరీ చెబ్తేపోయేదేముంది అని చూసి, నేను పోయిన ఫీలింగ్ తెచ్చుకున్నా! ఆ పోయినఫీలింగ్ లో మా తాత గుర్తొచ్చాడు!
---------------------------------------------------------------------------------------------------------
"ఒరేయ్ రామం .....మనిషి కి మనిషి తోడు రా...తోడు లేనిదే రాచ పీనుగుకూడా కదలదు రా అబ్బీ!" అని మా నాయనమ్మ అంటుండేది. దాని లోనిమర్మమేమిటో నాకప్పుడర్ధమవలేదు!
ఇప్పుడనిపిస్తోంది, అలా అన్న దాంట్లో ఎంత నిగూడార్ధం ఉందో!
ఈ మథ్య నాకేంటో చాలా వింత వింత ముష్టి కలలు వస్తున్నాయ్. అందులోమచ్చుకి కొన్ని చెబుతా.
1. నేను రాసిన పోస్ట్ లకి జనాలు తెగ like లు నొక్కేస్తూన్నట్టు!
2. నేను నా మెడకి తాడు చుట్టుకుని Empire State Buliding అంత ఎత్తైనభవనం పై నుండి క్రిందికి దూకుతున్నట్లు.......వేలాడుతుంటాను. ......మెలకువ వచ్చేస్తుంది.
3. నేను కారు చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా భూమి రెండుగా చీలి పోయి నేను ఆ అఖాతం లో పడిపొతున్నట్లు....మెలకువవచ్చేస్తుంది.
పైన చెప్పిన ముష్టి కలలే కాకుండా నాకీ మధ్య గురక ఎక్కువ వస్తోంది. ఆగురకలోంచి మెలకువ వస్తోంది. ఆ మెలకువలోంచి ఆలోచన వస్తోంది. ఏమనంటే "ఇప్పుడిలా నేను నిద్ర లోనే టపా కట్టేస్తే, నేను పోయాననిమిగిలిన జనాలు ఎన్నాళ్లకి గుర్తిస్తారు?" అని. నేనెవ్వరికీ ఫోన్లు కూడాచెయ్యనాయె! వీడేంటబ్బా ఈ మధ్య ఫోన్ కూడా చెయ్యలేదు అని మిగిలినజనాలు నాకు ఫోన్ చేసి ఏదో జరగరానిదేదో జరిగిందని గుర్తించడానికి! మరెలా?! వీడేంటి ఇంకా ఇంటి అద్దె కట్టలేదు అని మా లీజింగ్ ఆఫీస్ వాడువచ్చేవరకూ అంతేనేమో! అయినా వాడికేం పట్టింది? Payment Defaulter అని credit history లోకి తోసేస్తాడు తప్పితే వచ్చి చూసేంతతీరికుండదు వాడికి!. మరెలా?! ఏదో కుళ్ళిన వాసన వస్తోంది అని, నాపక్కింటి వాడు నా ధుర్గంధాన్ని భరించలేక 911 కి ఫోన్ చేస్తే గానీ నేపోయానన్న విషయం తెలీదేమో ! thanks to the services of 911 [] తర్వాతవీడెవడొ అనాధ ప్రేతం అని మార్చురీ లోకి తోసేస్తారా? కొంచెండబ్బులుంచుకోవాలి.
మా తాతయ్య తన అవసాన దశ లో కూడా ఏ కొడుకు/కూతురు ఇంటికి వచ్చిఉండలేదు, అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా వచ్చి ఉండడం తప్ప. ఆయన ట్రంకు పెట్టెలో యాబై వేల రూపాయలు ఒక న్యూస్ పేపర్ లో చుట్టితాళం వేసి ఉంచేవాడు. ఒక రోజు నేను " ఎందుకు తాతయ్యా! అవెప్పుడూవాడవు, కానీ ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటావు,ముట్నూరి కృష్ణారావు కథ లో 'దొంగ-పిసినారీ లా?" అని అడిగితే ఆయన నవ్వి "హారిభడవా! సరే అడిగావు కాబట్టి చెబుతున్నా, నేను అకస్మాత్తుగా చనిపోతే, ఈడబ్బులు చూసైనా నాకు తల కొరివి, ఖర్మ కాండలు సరిగ్గా చేస్తారని రా" అన్నాడు. "కొడుకులున్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా" అంటే 'ఎవరిఉద్యోగాల్లో వాళ్ళు బిజీ కదరా, అయినా నన్ను కాల్చడానికీ, పూడ్చడానికీవాటాలేసుకుంటారేమో అని నా భయం! అయినా వాళ్ళలా చెయ్యరనుకో! అయినా నా జాగ్రత్త లో నేనుండాలి కదా" అన్నాడు. నిజం సుమా!
నాదనుకున్న బాల్యం, నేను కళ్ళు మూసి తెరిచి వెనక్కి తిరిగే లోగా తూనీగలాఎగిరిపోయింది. మాయ జలతారు జిలుగు వెలుగుల్లో, అహంభావాలనగిషీల్లో బ్రతుకు ఆవిరైపోతోంది. జీవితం ఎప్పుడూ లంబాడి యాత్రల్లా, ఏవారినికి ఆ వారం వెచ్చాల కొట్లల్లో, లాండ్రీ ల drier ల యంత్రాల్లో యాంత్రికంగా నడిచిపోతోంది. బంగారాల ధరల హెచ్చుతగ్గుల్లో బ్రతుకునిఊపేసుకుంటూ బంగారం లాంటి ప్రస్తుతాన్ని చిద్రంచేసేసుకుంటున్నాం....చివరికి దేనికోసం వెంపర్లాడుతున్నాను? కనీసంచావైనా సరిగ్గా చచ్చి చస్తే బాగుంటుందేమో కదా!
అందుకే నా చావు తర్వాతి జాగ్రత్తలు కూడా నేను ఇప్పుడే తీసుకోవాలి [ ]
నేనేమీ ఆత్మహత్య చేసుకునే టైపు కాదు మరి...అయినా నా ప్రాణానికి ఈకలలేంట్రా బాబూ, నువ్వేమైనా విశ్లేషిస్తావా అని సిగ్మండ్ ఫ్రాయిడ్ కి ఫోన్చేస్తే ఆయన దొరకలేదు గానీ ఆయన బాబు లాంటి మా శేషారెడ్డి దొరికాడు.
వాడు ఇలా విశ్లేషించాడు.
"నువ్వు నీ తత్వానికి నచ్చనిదీ, విరుద్ధమైనదీ ఏదో చేస్తున్నావు. నీ ముందురెండు దార్లు ఉన్నాయ్, కానీ నువ్వు ఈ రెండింటి లో దేనినీ ఎంచుకోకుండాఆత్మ వినాశపు దారి వైపు పోతున్నావ్. నీ రెండు కలలూ దీనినేచెబుతున్నాయ్ నువ్వు అగాధం లో పడిపొతున్నావని. నిన్ను నువ్వు సరైనదారి లో తిప్పుకో' అని. నీ శ్రాద్దం!!!
ఔరా! సిగ్మండ్ ఫ్రాయిడూ!!----నీ పిండాకుడు--- ఈ కలలకి అంత అర్ధంఏడిసిందా!!!
ఏది ఏమైనప్పటికీ నేను కొన్ని భీకరమైన నిర్ణయాలు తీసేసుకున్నా నా చావుకిసంభంధించి.......
1. ఒక తోడు ని వెతకడం, ప్రస్తుతానికి రూమ్మేట్ - నేను టపా కట్టేస్తే వెంటనెమిగిలిన జనాలకి తెలియపరచ డానికి ఉపయోగపడతాడు.
2. నలుగురు స్నేహితులని సంపాదించడం - నేను పోతే మొయ్యడానికివీలుగా ఉంటుంది.
3. Funeral Home కి ఫోన్ చేసి ఒక శవాన్ని కాల్చడానికి ఎంత ఫీజ్తీసుకుంటాడో తెలుసుకుని ఆ మొత్తాన్ని save చెయ్యాలి – కాల్చడా నికిఉపయోగపడుతుంది
4. పైన సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పిన వెరే దారేంటో వెతకడం - బాగుపడడానికిఉపయోగ పడుతుంది.
ఆగండాగండి.....నా చావు ని నేనెక్కడ చూడొచ్చాను? మన “సిరివెన్నెలసీతారామ శాస్త్రి” గారు ఎంత గొప్పగా సెలవిచ్చారీ పాట లో !
“నొప్పి లేని నిమిషమేది జననమైన , మరణమైన జీవితాన అడుగుఅడుగునా?
నీరశించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది, ప్రాణముంది, నెత్తురింది, సత్తువుంది ..ఇంతకన్నసైన్యముండునా ?!
ఆశ నీకు అస్త్ర మౌను, శ్వాశ నీను శస్త్ర మౌను, ఆశయమ్ము సారధౌనురా!!
నిరంతరం ప్రయత్నమున్నదా!...”నిరాశ కే నిరాశ” పుట్టదా ?
ఆయువంటు ఉన్న వరకు చావు కూడ నెగ్గలేక శవముపైనే గెలుపు చాటు రా!!!”
నేను చచ్చి పోయానని నేనెక్కడ క్లెయిమ్ చెయ్యగలను? నా చావుని నేనెక్కడఅనుభవించగలను?
ఇవన్నీ కాదు కానీ స్వయం కల్పిత భ్రమల్ని వొదిలేసి జీవన పోరాటం లోసక్రమంగా జీవిస్తే , ఈ పుట్టుక కి ఒక అర్ధం, పరమార్ధం ఉంటాయేమో కదా?!!
పైన చెప్పిన నిర్ణయాలకి ఇంకో నిర్ణయాన్ని జత చేశా!
5. కొన్ని మందులు కొనాలి ......నేను తిన్నది అరగడానికి పనికొస్తుంది