• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

ప్ర"బుద్ధో"పదేశం

EkaLustYa

Eternal Optimist of ZoZo
Senior's
Chat Pro User
( Note: This is my own write up and all fiction)

సిద్థార్ద గౌతముడు, అదేనండి మన "బుద్ధుడు" తన 29 సంవత్సరాలవయస్సులో పదమూడు వసంతాల సాంసారిక సుఖం తర్వాతపెళ్ళాం, పిల్లోడిని వదిలేసి ఓ మఱ్ఱి చెట్టు కింద బాసింపట్టు ( పద్మాసనం) వేసి కళ్ళు మూసేసుకుని ఆలోచించేసి బ్రహ్మాండమైన విషయాన్నికనిపెట్టేశారు కదా !.

అదేంటయ్యా అంటే "ప్రపంచం లో అన్ని బాథలకీ కారణం - కోరికే " అనేసి. నాకెప్పుడైనా సరే మిగిలిన వాళ్ళకి తెలియందేదో నాకు పొరపాట్న తెలిసిపొతే"నే నేర్చిన జీవిత పాఠం మీకే నేర్పాలని వస్తే ...ఇంకా తెలవారదేమి..ఈ చీకటివిడిపోదేమీ" అనే పాట కాని " యురేకా , థకమికా" అని ఆర్కిమెడిస్ వేసినడాన్సు కాని గుర్తొచ్చేస్తాయ్ , దానికి తోడు తెగ బాధ కూడాను! నా సొల్లువినడానికి ఎవడూ లేడే అని!!.
నా మాదిరే మన బుద్ధుడు కూడా తెలుసుకున్న వెంటనే ఆగకుండాప్రపంచమంతా బలాదూర్ ( దీనికి దేశాటన అనే చక్కని పదం ఉంది, కానీనాకు ఇలానే ఇష్టం) మొదలెట్టాడు.

నేను ఈ పాఠం విన్నప్పుడు "ఇంతోటి విషయాన్ని చెప్పడానికిపెళ్ళాం, పిల్లోడిని వదిలెయ్యాలా?" అనిపించింది. ఇప్పుడు నేను ఆయనగొప్ప/గొప్పగాలేనితనం లొకి వెళ్ళడం లేదు. ఒక వేళ నేనా ప్రయత్నం చేస్తే, ఆవిషయం బౌద్ధ బిక్షువుల కంట పడితే వీడిని కాల్చాలా/పూడ్చాలా అనేచర్చల్లొ మునిగి పోతారు [బుద్ధుడు చనిపోయినప్పుడు కూడా వీళ్ళకి ( మహాయాన, తెరవాడ, వజ్రయాన ) ఇదే పెద్ద మీమాంశ వచ్చిపడింది! ]

సర్లే నా సొల్లు ఎక్కువవుతోంది. ఆస్సలు విషయం లోకి వస్తా. అన్నిసంవత్సరాల క్రితం బుద్ధులుంగారు యేదో కనిపెట్టినట్లు నేను కూడా నాఅద్భుతమైన ఆరోతరగతి రోజుల్లో ఏదో కనిపెట్టా!- మా బామ్మ పడక గదిలోమంచం క్రింద పడుకుని 'ఛీ ఎందుకీ ఎదవ జన్మ ' అనుకుంటూ! ఈఏడుపులో నాకో బ్రహ్మాండమైన జ్ఞానోపదేశం అయ్యింది. ఆ జ్ఞానాన్నే మీకుఉపదేశించే నా ఈ చిన్న ప్రయతనం!

ఇంతకీ నేను మంచం క్రింద దూరిన విధం బెట్టిదనిన ---

నా ఆరవ తరగతి మూడో యూనిట్ టెస్ట్ లెక్కల పరీక్ష లో, నా కంటే, నా పక్కసెక్షన్ లో పిలక జడల "నాళం బాలా త్రిపుర సుందరి ' కి ఒక్క అరమార్కుఎక్కువ వచ్చింది. వస్తే వచ్చింది లే ఎదవ అరమార్కే కదా! అని నేనుబిందాస్ గా ఇంటికి వచ్చి మా నాయనమ్మ ని పాయసం చెయ్యవే అన్నాపుస్తకాల సంచి నేను విసరగలిగినంత దూరం విసిరి సోఫా లో కూర్చుని టీవీఆన్ చేశా . నేను "పాయసం " అన్న మాట మా నాన్న చెవిన పడినట్లుంది! ఆఘ మేఘాల మీద నా దగ్గరికి వచ్చి 'ఏరా చదువు చంకనాకింది గానీ, నీకుపాయసాలు, టీవీ లూ కావల్సొచ్చాయా?' అని డిప్ప మీద ఒక్కటిచ్చి, టీవీరిమోట్ లాక్కుని చక్కా పోయారు.

ఇక్కడింకో గమ్మత్తైన విషయం చెబుతా! మా నాన్న నే నా లెక్కలమాష్టారు, ఆయనే పరీక్ష పెట్టింది, పేపరు దిద్దిందీ కూడా! సరే ఆయన అలాఒక్కటి వెయ్యగానె నాకు పెద్ద అవమానమై పోయి నూరున్నొక్క రాగంఎత్తుకుని వీధిలోకి పరిగెత్తి, బలాదూర్ తిరిగి చీకటి పడుతుండేప్పటికి మళ్ళాఎవరూ చూడకుండా ఇంట్లోకి జొరబడి మా నాయనమ్మ మంచం క్రిందపడుకుని బుద్ధుడి టైపు లో యోగ సమాధిలోకి వెళ్ళా. అదో అప్పుడుఅయింది నాకు జ్ఞానోదయం. జ్ఞానోదయం అయిన వెంటనే యా హూ అనిఅరిచే situation నాది కాదని తెలిసి నోరు మూస్కుని అలా నాలో నేనేమురిసిపోతూ పడుకున్నా! ( ఇప్పుడీ మంచం క్రింద నుండి ఎలా బయటికివచ్చాను అనేది మీకు అప్రస్తుతం కాబట్టి వదిలేస్తున్నా, లేకపోతే దీనిమీదేఇంకో రెండు పేజీలు గీకేసేవాడిని )

ఇంతకీ నేను తెలుసుకున్న విషయం ఏంటయ్యా అంటే !......."ప్రపంచం లోనిబాధలన్నింటికీ కారణం - కోరిక కాదు, పోలికే!! అని

అదెలా అంటారా? అదో ..అది చెప్పే ప్రయత్నమే ఈ గీకుడు.

ఈ పోలిక అనునది ఈ విధంగా నిర్వచించ బడింది - "ఒకరిశీలాన్నీ, నడతనీ, స్వభావాన్నీ, తత్వాన్నీ, లక్షణాన్నీ, గుణాన్నీ, ప్రవర్తననీమరొకరితో సారూప్యం గా, సాద్రుశ్యం గా తూనిక రాళ్ళతో కొలవడం". ఏడిసినట్టుంది, నా నిర్వచనం అంటారా ? "పిల్లి అంటే మార్జాలం అన్నట్లు?"

నాకు అప్పుడప్పుడూ అనిపించేదేంటయ్యా అంటే, ఈ సకల చరాచరజగత్తులో ఉన్న అన్ని రోగాల్లోకీ ప్రమాదకరమైన రోగం ఈ "పోలిక". అరిషడ్వర్గాలు దీని బైప్రోడక్ట్సే అని నా ప్రగాఢమైన నమ్మకం.

ఈ జబ్బు ని వ్యాప్తి చేసే సూక్ష్మజీవి- మనిషి పుట్టి, నడక నేర్చి, మాటలుస్పష్టం గా పలుకుతున్న దశ లో మన చుట్టూ వున్న వారి హావభావాలవల్ల, ప్రవర్తన వల్ల, మాటల వల్ల, చేతల వల్ల మస్తిష్క ప్రవెశం చేస్తుంది. అదితర్వాతి దశల్లో "ఇంతింతై వటుడింతై నభోవీదిపైనంతై ...తోయదమండలాగ్రమునకల్లంతై"..మర్రి చెట్టై ..వామన పాదమై..కుస్ముతంబీభత్సమై, రక్త పోటు ఎక్కువై , హృదయ ఘోష మూగదై - కపాలంఫటాలుమని పగులుతుంది.

ఈ పోలిక లు ఎలా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేస్తా..నాకు తోచిన విధంగా..

1. పక్కింటి పంకజాక్షి చూడరా ప్రొద్దున్నే లేచి ఎంత చక్కగా బడికిముస్తాబైందో, నువ్వూ వున్నావ్ మొద్దులాగా ఇంకా బండ నిద్ర పోతూ..
2. "నా.బా.త్రి.సు" చూడు ఎంచక్కా చదువుతుందో, నీకెమొచ్చేపొయేకాలం? ముప్పొద్దులా తింటమే గానీ చదువూ, సంధ్యా లేదు.
3. ఏరవతల అగ్రహారం లో షన్ముఖ శర్మగారి అబ్బాయికి చూడుఎంచక్కా IIT లో సీటు వచింధి. తమరేమో ముప్పొద్దులా అచ్చోసినఆంబోతులా రోడ్లు కొలవడమే సరిపొయే.
4. నీతోటోడే కదా ఎంచక్కా కాలేజీ కి సైకిల్ మీద వెళ్ళొస్తాడు, అబ్బాయి గారికివిమానం కావొల్సిచ్చింది కాబోలు!
5. మన వీధిలో రాజ్యం గారి అమ్మాయికి ఇంకా డిగ్రీ ఫైనలియరు లోవుండగానే TCS వాళ్ళు పిలిచి మరీ వుద్యోగం ఇచ్చారు , మరిఅయ్యగారేమో Air Force లొ జాయిను అయిపొయారు ( గాలి తిరుగుడు కిమరో పేరు)
6. పక్కింటి భాగ్యానికి చూడు నీకైనప్పుడే కదా పెళ్ళైంది, అప్పుడే ఇద్దరుపిల్లలు, మరి నీ ధేభ్యం మొహానికేంటో ఒక్క నలుసూ లేదు! ( ఇది అత్తగారిస్పెషల్)
7. ఇక్కడే పడేడవక పోతే అమెరికా వెళ్ళొచ్చు కదా, నీతోటి వాళ్ళందరూ కోట్లుసంపాదిస్తున్నారు ( ఇదే మరో రకం గా కూడా వుంటుంది - ఇక్కడే పడేడవకపోతే హైదరాబాదు పోయి ఏదన్నా నాల్గు సాఫ్టువేర్లు చెయ్యొచ్చుకదా, ఉద్యోగం వస్తుంది)
8. పక్కింటోడు చూడు 52" TV, AC Car, సొంత ఇల్లూ వున్నాయ్, మనకేఏమీ లేదు( అస్సలీ గోల మీద S V Krishna Reddy సినెమా - పేరు గుర్తులేదు, ఆమని, జగపతి బాబు- "పక్కింటి మంగళ గౌరి " అనే పాటేదోఉంటుంది, ఈ గోలంతా బాగా రాస్తాడు)


సర్లే ఇలా చెప్పుకుంటూ పొతే చాలా వుంది మహా జనులారా! ఇప్పటికేకాలాతీతమైంది. ఇంతకీ నే సెప్పొచ్చేదేటంటే పెజలారా..." మన ఏడుపుమనమేడుద్దాం...మన రాజ్యం మనమేలేద్దాం---పోలికల్లేకుండా!!!"


-EkaLustYa

13DEC2021
 
Top