మనం పీకల్లోతు ప్రేమలో ఉన్నపుడు మనం ప్రేమించే వాళ్లు ఏం చేసినా మనకు అందంగా ఉంటుంది. ఆఖరికి వాళ్లు మనల్ని బూతులు తిట్టినాకూడా. కన్న తల్లిదండ్రులతో తిట్లు తినని మనం వాళ్ల చేత తిట్టించుకుంటాం..ఆనందపడిపోతాం. ఆమె లేదా అతడు మనపై సీరియస్‌గా చెయ్యిచేసుకున్నా ‘‘ అబ్బని తియ్యని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బ’’ అని పాటలు పాడుకుంటాం. ఎదుటి వ్యక్తి ఆలోచనలకు, అభిప్రాయాలకు స్థాయికి మించి ప్రాధాన్యత ఇస్తాం. ఒకరకంగా మనల్ని మనం చంపుకుని ప్రేమను బ్రతికించుకుంటాం.
ఇవన్నీ ప్రేమ మన బుర్రను పనిచేయనీయకుండా చేసినంత కాలమే.. రోజులు గడుస్తాయి. కాలం ప్రభావమో.. లేదా హార్మోన్స్ ప్రభావమో.. ప్రేమ కొద్దికొద్దిగా దిగిపోతుంది. గతంలో వారిలో నచ్చిన విషయాలు, లక్షణాలు నచ్చటం మానేస్తాయి. గతంలోని లెక్కలు(మనల్ని తిట్టిన, కొట్టిన, ఏడిపించిన సంఘటనలు) తేల్చడానికి సమయం వెతుక్కుంటాం. ఎదుటి వాళ్లను చూసే తీరులో మార్పు వస్తుంది. తిడితే, తిడతాం… కొడితే.. తిరిగి కొట్టే స్థాయికి పరిస్థితి చేరుకుంటుంది.
ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ చెప్పినట్లు ప్రేమ కొద్ది కాలమే బాగుంటుంది..
ఇది ప్రతీ ప్రేమలో జరిగేదే.. ఎందుకంటే మనం హార్మోన్ల చేతిలో కీలుబొమ్మలై నడిచే మనుషులం కాబట్టి.. వయసుకు తగ్గట్టు మనలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు కొత్త ఆలోచనలు తెస్తాయి. ఆలోచనలతో ప్రేమ ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే ప్రేమలో మనల్ని మనం చంపుకోకూడదు. ఆ అవకాశం ఎదుటి వాళ్లకు ఇవ్వకూడదు. ఒకవేళ ఇద్దరూ ఏ కారణాల చేతైనా విడిపోవాల్సి వస్తే ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునేలా ఉండకూడదు.
అందుకే మన ప్రేమకు కావాల్సింది ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటం.. ఒకరికోసం ఒకరు అడ్జస్ట్ కావటం. ఈ అడ్జస్ట్ కూడా మన ఇష్ట ప్రకారమై ఉండాలి. ఉదాహరణకు.. అబ్బాయికి బీరు తాగటం అలవాటు.. అమ్మాయికి ఆ అలవాటు ఉండే మనషులంటే ఇష్టం ఉండదు. అబ్బాయి బీరు తాగుతాడని తెలిసినపుడు ఏం చేయాలి?… అతడికి దూరంగా ఉండాలి. చిన్న విషయానికి దూరం అయిపోతే ఎలా?.. అలా అనుకుంటే తన ఇష్టాల్ని పక్కన పెట్టి అబ్బాయిని బీరు తాగటానికి అనుమతించాలి. అబ్బాయి వైపునుంచి అయితే.. తను బీరు తాగితే అమ్మాయి ఇబ్బంది పడుతుందన్న సంగతిని గుర్తు చేసుకుని ఆ అబ్బాయి బీరు తాగటం మానేయాలి. ఇక్కడ అమ్మాయిది అడ్జస్ట్‌మెంట్.. అబ్బాయిది అండర్‌స్టాండింగ్. ఈ రెండు ఉంటేనే ప్రేమ సక్సెస్‌ఫుల్‌గా ముందుకు నడుస్తుంది.
నోట్: అడ్జస్ట్‌మెంట్, అండర్‌స్టాండింగ్‌లకు కూడా హద్దు ఉంటుంది. దాన్ని దాటి ఎవరూ ప్రవర్తించకూడదు.