• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి.

EkaLustYa

Eternal Optimist of ZoZo
Senior's
Chat Pro User
[ Note:
This was actually forwarded to me by my father and recommended reading this. After reading, I felt
What a realistic heart wrenching catalogue of events and narration!!!
If you think this post is politically contradicting or offensive to any of “ zozo” rules - you are free to delete.]

జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య ముని మనుమరాలి లేఖ)

బ్రాహ్మణుడికి జంధ్యం ఎంత ముఖ్యమో.. మా కుటుంబంలో దేశభక్తి కలిగి ఉండటం అంత ముఖ్యం (ఈ పోలిక కావాలనేచెప్తున్నాను). దేశం గురించి ఏమన్నా తెల్సా అంటే.. తెల్సి కాదు, అది వారసత్వంగా వచ్చిన ఆస్తి.

ముత్తాత స్వతంత్రోద్యమంలో ఉన్నారు. త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారు. ఇది నా చిన్నప్పుడే నూరి పోశారు. స్కూల్‌ లోజెండా వందనం రోజు ఒక గౌరవం. ఈ ప్రివిలేజ్‌ ని చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని.

వెంకయ్య కొడుకు, అంటే మా తాత, చలపతిరావు ఇండియన్‌ ఆర్మీలో పని చేశారు. సర్వీస్‌ లో ఉండగానే చనిపోయారు. మా నాయనమ్మని కనీసం ట్రైన్‌ పాస్‌ కూడా తీసుకోనివ్వలేదు వెంకయ్య గారు. మా నాన్నని 28 ఏళ్ళకి చంపేశారు. ఈత్యాగాలు, కీర్తుల వల్ల, నేను చదువుతున్న పుస్తకాల వల్ల.. తెలీకుండానే.. మా కుటుంబ వాతావరణంలో దేశభక్తి అనేది, బ్రష్‌ చేసుకోవటంలా ఒక భాగం.

కానీ మా ఇంట్లో, బంధువుల్లో .. బిజెపి భావజాలాన్ని నమ్మిన వాతావరణం అప్పుడు లేదు. బాబ్రీ మసీదు కూల్చినపుడునేను స్కూల్‌ ఏజ్‌. మా నాయనమ్మకి క్యాన్సర్‌, మేం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్తుంటే.. బంద్‌ వల్ల మా బండి ఆపేశారు. ఆరోజునేను, 'మీ మసీదు కూలితే, మమ్మల్ని ఎందుకు ఆపుతారు?' అని ఏడుస్తూ అరిచాను.

మా అమ్మ, నాయనమ్మ ఇద్దరూ తిట్టారు. 'తప్పు కదా, షిరిడీ మీద ఏమన్నా చేస్తే నువ్వు బాధపడవా?' అని అడిగిందిమా అమ్మ. అప్పటికి సాయిబాబా పారాయణం ప్రతి నెలా చేసే నేను, ఆ ఊహకు కూడా భయపడ్డా. ఈ రోజు మసీదు మీదమా కుటుంబీకుల అభిప్రాయం అడిగే ధైర్యం చేయలేను.

దేశం పట్ల ఒక లౌకిక దృక్పథం, దేశ గొప్పతనం పట్ల గర్వం ఉన్న వాతావరణం అప్పట్లో మా కుటుంబంలో వుంది. ఇప్పడులేదు. 'భారత దేశము నా మాతృభూమి' అని స్కూల్‌ లో ప్రార్థన చేయటం వల్ల.. ఇది (యూనియన్‌) 'సమాఖ్య' అనేసంగతి అందరి పిల్లల్లా నాకు తెలీదు.

భారత దేశం ప్రజాస్వామ్య విలువలకు, శాంతికి కట్టుబడి ఉంది అని, మనం ఎవరి మీదా దాడి చేయం అని పూర్తిగానమ్మాను. పాకిస్తాన్‌ దుర్మార్గ దేశం అని, కాశ్మీర్‌ ని ఆక్రమించుకున్నారు అని కోపం ఉండేది. మన సైన్యం ప్రాణాలుపణంగా పెట్టి పోరాడుతున్నారు అనే ఫీలింగ్‌. పైగా మా తాత చైనా యుద్ధ సమయంలో, సర్వీస్‌లో పోయాడాయె. ఇవన్నీనా మీద సైన్యం గొప్పది అనే ముద్ర వేశాయి.

అయితే 'ఇండియన్‌ ఆర్మీ రేప్‌ ఇష్యూ' బ్యానర్‌ పట్టుకుని మణిపూర్‌ మహిళలు 'నగ ప్రదర్శన' చేసినప్పుడు నాకు పెద్దషాక్‌. గుండె బద్దలు అయ్యింది. ఆ తర్వాత అనేక సంవత్సరాల ప్రయాణం.. చదివాను, తెలుసుకున్నాను. కాస్త పైసలుజమ అవ్వగానే, ఏదో ఒక రాష్ట్రం తిరగటం నా పని.

మణిపూర్‌, నాగాలాండ్‌, త్రిపుర, కాశ్మీర్‌ రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌, బర్మా దేశాలు.. వెళ్ళాను. చరిత్ర తెల్సుకోటానికే! విహారానికికాదు. స్త్రీల పట్ల 'భారత సైన్యం' ఎలా ఉంటుంది.. నా కళ్లతో చూశాను. అనుభవించాను కూడా! నాతో వచ్చిన మాబాలుతో, 'వెళ్లిపోదాం, వాళ్ళు నైట్‌ మన హోటల్‌ కి వస్తే..' అని భయపడ్డాను. 'మనని (!?) ఏం చేయరులే' అని మా బాలుధైర్యం చెప్పేవాడు.

చాలా మందికి దేశభక్తి కలిగి ఉండటం ఒక లక్షణం. నేను పెరిగిన వాతావరణం వల్ల , నాకు అది గుండె చప్పుడు. మోయాలేమో అని ఫీల్‌ అయిన ఒక వారసత్వం. ఏ రోజైతే.. నేను మణిపూర్‌ లో రక్తం తొక్కుతూ నడిచానో.. ఆ క్షణం నాహృదయం ముక్కలయ్యింది. నాగాలాండ్‌ లోని ఒక ఊరిలో, ప్రతి రోజూ ఉండే కర్ఫ్యూ వల్ల, హాస్పిటల్‌కి తీసుకెళ్ల లేక తల్లిచేతిలో చనిపోయిన బిడ్డని చూశానో.. ఆ క్షణం 'నా భారత మాత' మారిపోయింది.

కాశ్మీర్‌ లో తమ పొలాల్లోకి తాము వెళ్ళాలి అంటే.. ఆడ మగ అనే భేదం లేకుండా ఆర్మీతో ఒళ్ళంతా తడిమించుకునేకాశ్మీరీలను చూసి.. సిగ్గుతో చచ్చాను. 'ఓషన్‌ ఆఫ్‌ టియర్స్‌ డాక్యుమెంటరీ' లో ఉన్న పరిస్థితి ప్రతి క్షణం ఉంటుంది అక్కడ. కరెంట్‌, ఇంటర్నెట్‌, ఫోన్లు.. ఏ క్షణం అయినా ప్రభుత్వం బంద్‌ చేస్తుంది. రోజూ కర్ఫ్యూ.

త్రిపుర లో బెంగాలీల ఆధిపత్యం వల్ల అస్తిత్వం కోల్పోతున్న భిన్న ఆదివాసీల కథలు.. రకరకాలు. బెంగాలీలు అక్కడబిజినెస్‌ చేస్తారు. కాబట్టి బెంగాలీ, మన కర్మకి హిందీ, ఇంగ్లీష్‌, అస్సామీ, మణిపురి నేర్చుకుంటారు. ఇన్నేసి భాషల మధ్యవాళ్ళ సాంస్కృతిక నేపథ్యం క్రమంగా కనుమరుగవుతోంది.

నేను నా కళ్లతో చూశాను.. అక్కడ పిల్లలు ఎప్పుడూ ఒక భయం లో ఉంటారు. వాళ్ళకి బాల్యం సహజంగా ఉండదు. దేశభక్తితో, భారత దేశంలో భాగంగా ఉండాలి అనుకున్న 'రాణి గైడిన్‌ ల్యూ' జీవిత చరిత్ర రాయాలి అని వెళ్లిన నేను.. ఈశాన్య రాష్ట్రాల చరిత్ర, ఇరోమ్‌ షర్మిల జీవిత కథ నేపథ్యంతో రాస్తున్నాను.

నా దేశం, శాంతి సందేశం అని నమ్మిన నేను.. 'ఇండియా ఈస్‌ అప్రెసర్‌' అని అర్థం చేసుకున్నాను. రెండు వాక్యాల్లోరాసిన ఈ మాటలు.. నాకు జీర్ణం కావడానికి సంవత్సరాలు పట్టింది. నేను ఆ ప్రాంతాల నుండి వెనక్కి వచ్చిన తర్వాత, కొన్ని రోజుల వరకు నిద్ర పట్టేది కాదు.

ఈ సంవత్సరం అరుణాచల్‌ ప్రదేశ్‌ వెళ్ళాలి అని ప్లాన్‌ చేసుకొని, పైసలు కూడపెట్టాక.. నాకు ధైర్యం చాలక ఆగాను. ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉన్నాడు. వాడు స్వేచ్ఛగా నవ్వటం, ఆడటం చూసిన కళ్ళతో.. వాడిని పక్కనే ఉంచుకుని, అక్కడపిల్లల్ని చూస్తుంటే.. అపరాధ భావన వస్తోంది.

నాలో ఉన్న దేశభక్తి కేవలం 'ఇండియా'గా భావించబడుతున్న నేల మీదా? లేదా మనుషుల మీదా? అనేది తేల్చుకోవటంతేలిక. 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అనే ముక్క అర్థమయ్యి చస్తే! కానీ దేశభక్తి కరవటం వల్ల... ఖర్చు, ఏడుపు, భయం, 'ఇలాంటి చోట్లకి ఎందుకు తీసుకొస్తావు?' అని మా బాలుతో తిట్లు, జీవితంలో పదేళ్లు.. పట్టింది. అందుకే ఎవరన్నా దేశభక్తి తో రంకెలు వేస్తుంటే.. ఏమన్నా వాక్సినేషన్‌ ఉంటే బావుండు అనిపిస్తుంది.

- పింగళి చైతన్య
 
Yeah I know ! We can discuss -only - if you bring up facts to support your arguments !
I wish I get the same kind of liberty to reply to this post as this women got, unfortunately this is not the right platform...someone or other will delete my post , still I can send in your pvt if you want !!
 
భారత దేశం ప్రజాస్వామ్య విలువలకు, శాంతికి కట్టుబడి ఉంది అని, మనం ఎవరి మీదా దాడి చేయం అని పూర్తిగానమ్మాను. పాకిస్తాన్‌ దుర్మార్గ దేశం అని, కాశ్మీర్‌ ని ఆక్రమించుకున్నారు అని కోపం ఉండేది. మన సైన్యం ప్రాణాలుపణంగా పెట్టి పోరాడుతున్నారు అనే ఫీలింగ్‌. పైగా మా తాత చైనా యుద్ధ సమయంలో, సర్వీస్‌లో పోయాడాయె. ఇవన్నీనా మీద సైన్యం గొప్పది అనే ముద్ర వేశాయి.
When she reached Kashmir, how come she missed the pain and the tears of kashmiri pandits, who are still hiding here and there leaving their ancestral properties in kashmir !
బ్రాహ్మణుడికి జంధ్యం ఎంత ముఖ్యమో.. మా కుటుంబంలో దేశభక్తి కలిగి ఉండటం అంత ముఖ్యం (ఈ పోలిక కావాలనేచెప్తున్నాను). దేశం గురించి ఏమన్నా తెల్సా అంటే.. తెల్సి కాదు, అది వారసత్వంగా వచ్చిన ఆస్తి.
Ok got the answer in first paragraph... kashmiri pandits also bramhin community..part of Hindu community (which she intentionally) showed as example... their pain is not a pain for anti- nationals
అయితే 'ఇండియన్‌ ఆర్మీ రేప్‌ ఇష్యూ' బ్యానర్‌ పట్టుకుని మణిపూర్‌ మహిళలు 'నగ ప్రదర్శన' చేసినప్పుడు నాకు పెద్దషాక్‌. గుండె బద్దలు అయ్యింది. ఆ తర్వాత అనేక సంవత్సరాల ప్రయాణం.. చదివాను, తెలుసుకున్నాను. కాస్త పైసలుజమ అవ్వగానే, ఏదో ఒక రాష్ట్రం తిరగటం నా పని.
How dare she generalises and defame INDIAN ARMY? They are not gods, they are humans too but the one she quoted is just half facts..Indian army is the most disciplined and professional compared to any other country!!

One side we are celebrating 75th independence day and the other side we are in debate with anti- nationals who doesn't want to leave the country at any cost but..they have problem for every solution

Happy independence day!!
 
[ Note:
This was actually forwarded to me by my father and recommended reading this. After reading, I felt
What a realistic heart wrenching catalogue of events and narration!!!
If you think this post is politically contradicting or offensive to any of “ zozo” rules - you are free to delete.]

జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య ముని మనుమరాలి లేఖ)

బ్రాహ్మణుడికి జంధ్యం ఎంత ముఖ్యమో.. మా కుటుంబంలో దేశభక్తి కలిగి ఉండటం అంత ముఖ్యం (ఈ పోలిక కావాలనేచెప్తున్నాను). దేశం గురించి ఏమన్నా తెల్సా అంటే.. తెల్సి కాదు, అది వారసత్వంగా వచ్చిన ఆస్తి.

ముత్తాత స్వతంత్రోద్యమంలో ఉన్నారు. త్రివర్ణ పతాకం రూపకల్పన చేశారు. ఇది నా చిన్నప్పుడే నూరి పోశారు. స్కూల్‌ లోజెండా వందనం రోజు ఒక గౌరవం. ఈ ప్రివిలేజ్‌ ని చక్కగా ఎంజాయ్ చేసేదాన్ని.

వెంకయ్య కొడుకు, అంటే మా తాత, చలపతిరావు ఇండియన్‌ ఆర్మీలో పని చేశారు. సర్వీస్‌ లో ఉండగానే చనిపోయారు. మా నాయనమ్మని కనీసం ట్రైన్‌ పాస్‌ కూడా తీసుకోనివ్వలేదు వెంకయ్య గారు. మా నాన్నని 28 ఏళ్ళకి చంపేశారు. ఈత్యాగాలు, కీర్తుల వల్ల, నేను చదువుతున్న పుస్తకాల వల్ల.. తెలీకుండానే.. మా కుటుంబ వాతావరణంలో దేశభక్తి అనేది, బ్రష్‌ చేసుకోవటంలా ఒక భాగం.

కానీ మా ఇంట్లో, బంధువుల్లో .. బిజెపి భావజాలాన్ని నమ్మిన వాతావరణం అప్పుడు లేదు. బాబ్రీ మసీదు కూల్చినపుడునేను స్కూల్‌ ఏజ్‌. మా నాయనమ్మకి క్యాన్సర్‌, మేం ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్తుంటే.. బంద్‌ వల్ల మా బండి ఆపేశారు. ఆరోజునేను, 'మీ మసీదు కూలితే, మమ్మల్ని ఎందుకు ఆపుతారు?' అని ఏడుస్తూ అరిచాను.

మా అమ్మ, నాయనమ్మ ఇద్దరూ తిట్టారు. 'తప్పు కదా, షిరిడీ మీద ఏమన్నా చేస్తే నువ్వు బాధపడవా?' అని అడిగిందిమా అమ్మ. అప్పటికి సాయిబాబా పారాయణం ప్రతి నెలా చేసే నేను, ఆ ఊహకు కూడా భయపడ్డా. ఈ రోజు మసీదు మీదమా కుటుంబీకుల అభిప్రాయం అడిగే ధైర్యం చేయలేను.

దేశం పట్ల ఒక లౌకిక దృక్పథం, దేశ గొప్పతనం పట్ల గర్వం ఉన్న వాతావరణం అప్పట్లో మా కుటుంబంలో వుంది. ఇప్పడులేదు. 'భారత దేశము నా మాతృభూమి' అని స్కూల్‌ లో ప్రార్థన చేయటం వల్ల.. ఇది (యూనియన్‌) 'సమాఖ్య' అనేసంగతి అందరి పిల్లల్లా నాకు తెలీదు.

భారత దేశం ప్రజాస్వామ్య విలువలకు, శాంతికి కట్టుబడి ఉంది అని, మనం ఎవరి మీదా దాడి చేయం అని పూర్తిగానమ్మాను. పాకిస్తాన్‌ దుర్మార్గ దేశం అని, కాశ్మీర్‌ ని ఆక్రమించుకున్నారు అని కోపం ఉండేది. మన సైన్యం ప్రాణాలుపణంగా పెట్టి పోరాడుతున్నారు అనే ఫీలింగ్‌. పైగా మా తాత చైనా యుద్ధ సమయంలో, సర్వీస్‌లో పోయాడాయె. ఇవన్నీనా మీద సైన్యం గొప్పది అనే ముద్ర వేశాయి.

అయితే 'ఇండియన్‌ ఆర్మీ రేప్‌ ఇష్యూ' బ్యానర్‌ పట్టుకుని మణిపూర్‌ మహిళలు 'నగ ప్రదర్శన' చేసినప్పుడు నాకు పెద్దషాక్‌. గుండె బద్దలు అయ్యింది. ఆ తర్వాత అనేక సంవత్సరాల ప్రయాణం.. చదివాను, తెలుసుకున్నాను. కాస్త పైసలుజమ అవ్వగానే, ఏదో ఒక రాష్ట్రం తిరగటం నా పని.

మణిపూర్‌, నాగాలాండ్‌, త్రిపుర, కాశ్మీర్‌ రాష్ట్రాలు, బంగ్లాదేశ్‌, బర్మా దేశాలు.. వెళ్ళాను. చరిత్ర తెల్సుకోటానికే! విహారానికికాదు. స్త్రీల పట్ల 'భారత సైన్యం' ఎలా ఉంటుంది.. నా కళ్లతో చూశాను. అనుభవించాను కూడా! నాతో వచ్చిన మాబాలుతో, 'వెళ్లిపోదాం, వాళ్ళు నైట్‌ మన హోటల్‌ కి వస్తే..' అని భయపడ్డాను. 'మనని (!?) ఏం చేయరులే' అని మా బాలుధైర్యం చెప్పేవాడు.

చాలా మందికి దేశభక్తి కలిగి ఉండటం ఒక లక్షణం. నేను పెరిగిన వాతావరణం వల్ల , నాకు అది గుండె చప్పుడు. మోయాలేమో అని ఫీల్‌ అయిన ఒక వారసత్వం. ఏ రోజైతే.. నేను మణిపూర్‌ లో రక్తం తొక్కుతూ నడిచానో.. ఆ క్షణం నాహృదయం ముక్కలయ్యింది. నాగాలాండ్‌ లోని ఒక ఊరిలో, ప్రతి రోజూ ఉండే కర్ఫ్యూ వల్ల, హాస్పిటల్‌కి తీసుకెళ్ల లేక తల్లిచేతిలో చనిపోయిన బిడ్డని చూశానో.. ఆ క్షణం 'నా భారత మాత' మారిపోయింది.

కాశ్మీర్‌ లో తమ పొలాల్లోకి తాము వెళ్ళాలి అంటే.. ఆడ మగ అనే భేదం లేకుండా ఆర్మీతో ఒళ్ళంతా తడిమించుకునేకాశ్మీరీలను చూసి.. సిగ్గుతో చచ్చాను. 'ఓషన్‌ ఆఫ్‌ టియర్స్‌ డాక్యుమెంటరీ' లో ఉన్న పరిస్థితి ప్రతి క్షణం ఉంటుంది అక్కడ. కరెంట్‌, ఇంటర్నెట్‌, ఫోన్లు.. ఏ క్షణం అయినా ప్రభుత్వం బంద్‌ చేస్తుంది. రోజూ కర్ఫ్యూ.

త్రిపుర లో బెంగాలీల ఆధిపత్యం వల్ల అస్తిత్వం కోల్పోతున్న భిన్న ఆదివాసీల కథలు.. రకరకాలు. బెంగాలీలు అక్కడబిజినెస్‌ చేస్తారు. కాబట్టి బెంగాలీ, మన కర్మకి హిందీ, ఇంగ్లీష్‌, అస్సామీ, మణిపురి నేర్చుకుంటారు. ఇన్నేసి భాషల మధ్యవాళ్ళ సాంస్కృతిక నేపథ్యం క్రమంగా కనుమరుగవుతోంది.

నేను నా కళ్లతో చూశాను.. అక్కడ పిల్లలు ఎప్పుడూ ఒక భయం లో ఉంటారు. వాళ్ళకి బాల్యం సహజంగా ఉండదు. దేశభక్తితో, భారత దేశంలో భాగంగా ఉండాలి అనుకున్న 'రాణి గైడిన్‌ ల్యూ' జీవిత చరిత్ర రాయాలి అని వెళ్లిన నేను.. ఈశాన్య రాష్ట్రాల చరిత్ర, ఇరోమ్‌ షర్మిల జీవిత కథ నేపథ్యంతో రాస్తున్నాను.

నా దేశం, శాంతి సందేశం అని నమ్మిన నేను.. 'ఇండియా ఈస్‌ అప్రెసర్‌' అని అర్థం చేసుకున్నాను. రెండు వాక్యాల్లోరాసిన ఈ మాటలు.. నాకు జీర్ణం కావడానికి సంవత్సరాలు పట్టింది. నేను ఆ ప్రాంతాల నుండి వెనక్కి వచ్చిన తర్వాత, కొన్ని రోజుల వరకు నిద్ర పట్టేది కాదు.

ఈ సంవత్సరం అరుణాచల్‌ ప్రదేశ్‌ వెళ్ళాలి అని ప్లాన్‌ చేసుకొని, పైసలు కూడపెట్టాక.. నాకు ధైర్యం చాలక ఆగాను. ఇప్పుడు నాకు ఒక బిడ్డ ఉన్నాడు. వాడు స్వేచ్ఛగా నవ్వటం, ఆడటం చూసిన కళ్ళతో.. వాడిని పక్కనే ఉంచుకుని, అక్కడపిల్లల్ని చూస్తుంటే.. అపరాధ భావన వస్తోంది.

నాలో ఉన్న దేశభక్తి కేవలం 'ఇండియా'గా భావించబడుతున్న నేల మీదా? లేదా మనుషుల మీదా? అనేది తేల్చుకోవటంతేలిక. 'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అనే ముక్క అర్థమయ్యి చస్తే! కానీ దేశభక్తి కరవటం వల్ల... ఖర్చు, ఏడుపు, భయం, 'ఇలాంటి చోట్లకి ఎందుకు తీసుకొస్తావు?' అని మా బాలుతో తిట్లు, జీవితంలో పదేళ్లు.. పట్టింది. అందుకే ఎవరన్నా దేశభక్తి తో రంకెలు వేస్తుంటే.. ఏమన్నా వాక్సినేషన్‌ ఉంటే బావుండు అనిపిస్తుంది.

- పింగళి చైతన్య
Would have been nice if they did not choose to include their political statement in the letter (talks about xyz party bhavajalam).

Agreed that their forefathers have served the country well. But focussing on the negatives, in which extensive checks and internet disruptions are not even a negative (certain factions which nurture terror are responsible for this) and not appreciating the achievements of the army with the limited resources cries agenda to me.

Also, a country is not just it's army. Let's be proud on this day- a country which many believed would disintegrate given its diversity is still intact and running decently, and take the onus upon us to drive it to a better future.

Cheers,
 
Top