Yessపుట్టింది మొదలు.. అమ్మ, నాన్న మాటలు వినాలి. బయటికి వెళ్లాలంటే ఎవరైనా తోడు ఉండాలి. గట్టిగా నవ్వకూడదు.. ఎందుకంటే నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని అంటారు కాబట్టి.. ఈడొచ్చిందంటే పెళ్లి కోసం పక్కవారింటి మొదలు ప్రతీ ఒక్కరూ ఆరాటమే.. ఈ జీవిత పరీక్షలు ఉండగానే.. ఆమె విద్య పరీక్షలు కూడా ఉంటాయి. అయినా వీటన్నింటిని పట్టించుకోకుండానే వాటిని అధిగమిస్తుంది. అయినా.. అవేం పట్టవుగా అందరికీ.. చదువు ఎందుకు పనికొస్తుంది. ఎవరో ఓ అయ్య చేతిలో పెడితే సరిపోతుందనే మాటలు… వీటిని పట్టించుకోని పెద్దవారి కొంతమందైతే.. మరికొంతమంది అవే వేదమంత్రాల్లా గోచరించి వివాహ కార్యక్రమాలు మొదలుపెడతారు.