నీ కోసమే ఈ నిరీక్షణ.
నీ కోసమే నా ఆలోచన.
నీ కోసమే నా ఆరాటం.
నీ కోసమే నా జీవితం.
నీవు లేనిదే నేను లేను,
నీ రాకకై ఎదురు చూసి చూసి ,
అలసి సొలసి చెమ్మగిల్లిన చక్షువులకు ,
చెలికాడి జాడ కానరాక ,
చెప్పడానికి వీలుకాక,
కనురెప్పల చాటున కానరాని స్వప్నాలెన్నో కన్నా.
కాలం మంచులా కరిగిపోతుంది.
మనసు అలసిపోతుంది.
అయినా ఆశ చావక నీకై నిరీక్షిస్తూ ఉన్నా.
ఆ గాలికి చెప్పండి ఆ సుకుమార కుసుమాలను ఊపొద్దని ,
గుబాళించే పరిమళాలను నా వద్దకు మోసుకు రావద్దని,
నా ముంగురులను మోముపైకి లాగొద్దని,
నా పైటచెంగుని పదే పదే రెప రెప లాడనీయొద్దని ,
ఏ అలికిడి అయినా నీవొచ్చావేమో అని .
నా మనసు తడబడి వడివడిగా పరుగులు తీస్తుంది.
సడిసేయకని చెప్పండి ఆ సన్నజాజులకు.
నా చెంతకు చేర రావద్దని చెప్పండి ఆ భ్రమరాలకు.
కనురెప్పల సవ్వడి సైతం నన్ను కలవర పెడుతుంది.
నా గుండె చప్పుడు కూడా .
నీవొచ్చావేమో అని నన్ను మభ్య పెడుతుంది.
నీ కోసమే నా ఈ నిరీక్షణ.