ఒకప్పుడు, ఒకానొక అందమైన ద్వీపం లో"సంతోషం, విచారం, జ్ఞానం, ధనం, అహంకారం- వీళ్ళతో పాటు "ప్రేమ" నివసిస్తూ ఉండేవి. ఒకరోజు అకస్మాతుగా ద్వీపం చుట్టూ సముద్రపు అలలుతుపానులా ఎగసి పడడం మొదలయింది. అప్పుడు వీళ్ళందరికీఅర్ధమైయింది ఏదో మహా ప్రళయం ముంచుకు రాబోతోంది, ఈ ద్వీపంమునిగి పోడానికి ఇంకెంతో సేపు పట్టదు అని, ఏదైనా సురక్షిత ప్రదేశానికివెళ్ళిపోవడం మంచిదని ఎవరి పడవలు వాళ్ళు తయారు చేస్కోడంమొదలెట్టారు. "ప్రేమ" తప్ప.
"ప్రేమ" ఒక్కతే ఏదైతే అది అవుతుందిలే చివరి వరకు చూద్దాంఏమవుతుందో అని అలానే చూస్తూ ఉండిపోయింది
ఇక ఈ ద్వీపం మునిగిపోక తప్పదు అని అనిపించినా క్షణం లో "ప్రేమ" ఇంకెవరి సహాయమైనా తీసుకుందామని నిర్ణయించుకుని ....
అందమైన పడవ లో తనని దాటి పోతున్న "ధనం" ని " ధనం, నన్ను నీతోపాటు తీస్కెళ్ళవా" అని అడిగింది.
దానికి "ధనం" ....."కుదరదు, నా పడవ లో చాలా బంగారం, వెండిఉన్నాయ్, నువ్వు కూర్చోడానికి చోటు లేదు" అని చెప్పింది
"ప్రేమ" పరుగెత్తుకుంటూ వెళ్లి "అహంకారం" ని అడిగింది..."అహంకారం, దయచేసి నాకు సహాయం చెయ్యి" అని.
దానికి "అహంకారం", "ప్రేమ" వైపు అసహ్యం గా చూసి " ఛీ నువ్వంతాతడిగా ఉన్నావ్, నా అందమైన పడవ పాడైపోతుంది, నిన్ను తీస్కెళ్ళ డం నావల్ల కాదు" అని చెప్పి వెళ్ళిపోయింది.
అప్పుడే అటుగా వస్తున్న "విచారం" ని..."దయచేసి, నీతో రానివ్వు" అనిచేతులెత్తి అసహాయం గా నమస్కరించింది.
దానికి "విచారం"......... "ఓ .....ప్రేమా, నేనెంత విచారం గా ఉన్నాను అంటే....నాతో నేను మాత్రమే ఉందామనుకుంటున్నా" అని వెళ్లిపోయింది.
"సంతోషం" ఈల వేసుకుంటూ ....."ప్రేమ" పిలుస్తున్నా పట్టించుకోకుండాముందుకి సాగిపోయింది.
ఇక ఏమీ చెయ్యలేని అశక్తత తో "ప్రేమ" కూలబడి దిక్కులు చూస్తూఉండిపోయింది.
ఇంతలో అకస్మాతుగా, ఎవరిదో పిలుపు వినబడింది....." ప్రేమా ....నాతో రా" అని. ఎవరో పెద్దావిడ! తన అదృష్టానికి తానే ఆనందపడిపోతూ ఎక్కడికిఅని కూడా అడక్కుండా పడవ ఎక్కేసింది. ఒక అందమైన ప్రదేశం లో "ప్రేమ" ని దింపేసి, ఆ పెద్దావిడ తన దారిన తానూ వెళ్లిపోయింది. అప్పుడుగుర్తొచ్చింది "ప్రేమ" కి ...తనకింత సహాయం చేసిన ఆ పెద్దావిడ పేరుఅడగడం మర్చిపోయా అని.
"ప్రేమ"...వెంటనే ...ఇంకో పెద్దావిడ "జ్ఞానం" దగ్గరికి వెళ్లి "తనకి సాయంచేసింది, ఎవరు?" అని అడిగింది
"ఓ .......అదా ......"సమయం" " అని చెప్పింది ..జ్ఞానం
"సమయం?"......"సమయం, నాకెందుకు సాయం చేసింది" అని అడిగింది"ప్రేమ"
"జ్ఞానం" చిరునవ్వు నవ్వి జ్ఞానముద్ర లో కూర్చుని ఇలా చెప్పింది
...."ఎందుకంటే...........ప్రేమ ఎంత విలువైందో ....ఒక్క "సమయం" మాత్రమేఅర్ధం చేసుకోగలదు!!!"
(ఇది నేను ఎప్పుడో ఇంటర్నెట్ లో చదివిన ఒక చిన్న కధకు స్వేచ్చానువాదం)