Inspiration ( ప్రేరణ)
మనం ఒక పని మొదలు పెట్టటానికి ..చేయాలి అనుకోవటానికి కానీ..చేయడానికి కానీ ..మన అందరికీ ముఖ్యం గా కావల్సినది ప్రేరణ..ఈ ప్రేరణ ఎక్కడినుంచి అయినా వస్తుందoడీ !!
న్యూస్ ఆర్టికల్స్ నుంచి
ఒక మంచి పాట నుంచి
ఒక ఫ్రెండ్ చెప్పిన మాట నుంచి
లేదా ఎప్పుడో చదివిన ఒక quotation నుంచి
ఎక్కడినుంచి అయినా ఈ ప్రేరణ రావచ్చు
మీకొక విషయం తెలుసా ఈ thread కి నా ప్రేరణ ఏమిటో? అది pain అండి ...మన అందరిలో ఎక్కడో మూల దాక్కుని ..మన అందరి ఆనoదాన్ని హరింప చేసే pain అండి!!
మీకొక చిన్న కథ చెప్తాను
ఒక తాతగారు ఒక మనవడి తో కూర్చుని . సరదాగా కబుర్లు చప్పుకుంటున్నారు, ఇంతలో తాతగారు
మనవడితో నాన్న , నాలో ఒక పెద్ద యుద్ధం జరుగుతోంది రా ..రెండు పెద్ద పెద్ద తోడేళ్ళు పెద్ద గా యుద్ధం చేసుకుంటున్నాయి రా అని..మనవడు ఆశ్చర్యం తో అమ్మో తాతా ఇప్పుడు ఎలా బయటపడాలి అని అడిగాడు
తాతగారు : అవును నాన్నా ఒక తోడేలు ఏమో చెడుని ఆకర్షించే తోడేలు అంటే
కోపాన్ని , కుళ్ళు ని, గర్వాన్ని , అహంకారాన్ని, అత్యాశ నీ.. వీటన్నింటినీ ఆకర్షించే తోడేలు
రెండవది మంచి ని ఆకర్షించే తోడేలు జాలి నీ, కరుణ ని, దయ నీ ,ప్రేమ నీ ఇష్టపడే తోడేలు
ఇవి రెండు ఎప్పుడు ఫైట్ చేసుకుంటూనే ఉంటాయి..నా ప్రతి ఒక్క అలోచనకి , ప్రతి నిర్ణయం కి అవి యుద్ధం చేసుకుంటూనే ఉంటాయి..నాలోనే కాదు మన అందరి లో ఇదే యుద్ధం జరుగుతుంది..నీలో నాలో
మనవడు: తాతా మరి ఏ తోడేలు గెలుస్తుంది
తాతా: నువ్వు ఏ తోడేలు నీ పెంచుతావో అది గెలుస్తుంది
మనం వేటి ని ఆశ్రయిస్తే .. వేటిని పోషిస్తే అవి మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి!
అందుకే మనం మన ఏ భావాలని పెంచుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి!!
# Love yourself #