• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

దసరా మహోత్సవాలు అక్టోబర్ 7 నుంచి.. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకరణల వైభవం ఇలా

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
ఏపీ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అక్టోబర్ 7 నుంచి 15 వరకు దసరా శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ ధర్మకర్తల మండలి ఆదివారం వెల్లడించింది. ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో అక్టోబర్ 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు శ్రీ ప్లవనామ సంవత్సర దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందని

అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు..

7-10-2021: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ దుర్గాదేవిగా.. అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

8-10-2021: విదియ శుక్రవారం రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.

9-10-2021: తదియ శనివారం రోజున శ్రీ గాయత్రీ దేవి.

10-10-2021: చవితి ఆదివారం రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.

11-10-2021: పంచమి, షష్ఠి సోమవారం రోజున శ్రీ అన్నపూర్ణ దేవి, శ్రీ మహాలక్ష్మీ దేవి.

12-10-2021: శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం).

13-10-2021: శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి).

14-10-2021: శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని (మహార్ణవమి).


15-10-2021: శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)


అయితే.. 11-10-2021 తేదీ సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు.15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు
 
దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు పార్వేట ఉంటుంది.

దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణాలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం ఆనవాయితీ. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. దేవీ పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశములో హెచ్చుగా ఉంటుంది.
 

శరన్నవరాత్రి ఉత్సవాలు.. బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ​


త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. ‘స్వర్గ, భూ, పాతాళం’ అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు.​


విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు జగన్మాత బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది. ‘స్వర్గ, భూ, పాతాళం’ అనే త్రిపురాల్లో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. శ్రీ చక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత త్రిపుర సుందరీదేవి. షోడశ విద్యకు అధిష్టాన దేవత. అందుకే ఉపాసకులు త్రిపురసుందరీదేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు.

నవరాత్రి ఉత్సవాల రెండో రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజచేస్తారు. త్రిశతీ పారాయణం గావిస్తారు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి. ఆమెను ధ్యానించడంతో సమస్త మనోవికారాలు తొలిగి నిత్యసంతోషం కలుగుతుందని భక్తుల నమ్మకం.సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది. అభయహస్త ముద్రతో, అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలిగిపోతాయి. అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ రోజు నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.

త్రిపురసుందర్యష్టకం
కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
 
Last edited:

దేవీ నవరాత్రి ఉత్సవాలు.. గాయత్రీ దేవిగా దర్శమనిస్తున్న విజయవాడ దుర్గమ్మ..09th Oct 2021​


Navaratri 2021: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజున విజయవాడ దుర్గమ్మ గాయత్రిదేవి అవతారంలో దర్శనమిచ్చారు. సలక మంత్రాలకు మూలమైన గాయత్రి దేవికి వేదమూర్తులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల మంత్రాలకు మూలమైన గాయత్రి శక్తిగా దర్శనమిస్తున్నారు అమ్మవారు. వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటున్నారు భక్తులు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు.

గాయత్రీ మాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. అమ్మవారిని దర్శించుకోవడాని భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వస్తున్నారు. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా టికెట్ పొందిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లో భక్తుల మధ్య దూరం ఉండేలా చర్యలు చేపడుతున్నారు.
 
Today 04th Day - Oct 09th 2021

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తున్నారు. సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్ధం.. సాక్షాత్‌ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి.
 
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. దసరా మహోత్సవాల్లో నాల్గవరోజున కనకదుర్గమ్మ శ్రీలలితా త్రిపురసుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధి దేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు.

సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మీ, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా.. చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. లలితాదేవి విద్యా స్వరూపిణి. మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. దేవి అనుగ్రహం కోసం సువాసినీ పూజ చేస్తారు. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి.

జగన్మాతయే లలితాదేవిగా ఆశ్వయుజ మాసంలో పూజలందుకుంటోంది. ప్రతిప్రాణిలో ఉండే శక్తే చైతన్య స్వరూపిణి ఆదిపరాశక్తి. దీనినే నారాయణీ స్తుతి ‘త్వయైకయా పూరిత మంబయైతత్’ అంటూ ధృవపరిచింది. శివవిష్ణు సహస్ర నామాలకంటే ఒక్కసారి అమ్మను మనసార ధ్యానిస్తే చాలు అపారమైన కరుణ లభిస్తుంది. అమ్మను పూజించినవారికి పునర్జన్మ ఉండదు.

ఆదివారం కావడంతో లలితాత్రిపుర సుందరిదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. అయితే, కరోనా నేపథ్యంలో రోజుకు 10 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.
 
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తున్నారు. సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్ధం.. సాక్షాత్‌ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి
 
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. దేవి శరన్నవరాత్రులలో భాగంగా నాలుగవ రోజైన చవితి నాడు బెజవాడ కనకదుర్గమ్మ అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తున్నారు. సృష్టిలోని ప్రతీజీవికి కావలసిన చైతన్యం కలిగించే మహాశక్తి అన్నపూర్ణ. ఒక చేతిలో అక్షయ పాత్రతో, మరియొక చేతిలో గరిటెతో దర్శనమిస్తుంది. సాక్షాత్తూ పరమేశ్వరునికే భిక్షనొసంగిన అన్నపూర్ణ అక్షయ శుభాలను కలిగిస్తుంది. ఈ రోజు అన్నపూర్ణాష్టక పారాయణ శుభదాయకం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అదే సర్వజీవులకు జీవనాధారం. అటువంటి అన్నాన్ని ప్రసాదించేది సాక్షాత్తూ అన్నపూర్ణమ్మ తల్లే. అమ్మవారి దివ్య రూపాల్లో అన్నపూర్ణాదేవి అలంకారం ఒకటి. అన్నపూర్ణాదేవి అలంకారంలో పరమార్ధం.. సాక్షాత్‌ తన భర్త పరమేశ్వరుడే ఆది భిక్షువుగా యాచనికి వస్తే ఆ తల్లి అన్నపూర్ణాదేవిగా మారి ఆయనకు భిక్షని ప్రసాదిస్తుంది. అలాగే దుర్గమ్మ అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారి వారి ఆకలిని తీరుస్తుంది. అటువంటి అన్నపూర్ణమ్మ రూపంలో ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ విధంగా సాగే అన్నపూర్ణాష్టకం చదివితే సకల మనోభీష్టాలు నెరవేరుతాయి
Nice place to visit in Dasara time Vijayawada
 
Top