ఆగస్టు 29 న - 'శిష్ట వ్యవహారిక' రూప శిల్పి గిడుగు రామమూర్తి జయంతి(1863 ఆగస్టు 29) ని తెలుగు-మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని ... రాష్ట్ర ప్రజలు మాతృభాషా దినోత్సవంగా పాటిస్తున్నారు. శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 1863 ఆగస్టు 29న వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు జన్మించారు. 1875లో తండ్రి మరణించేవరకూ పర్వతాల పేటలో చదువుకున్న రామమూర్తి ఆ తరువాత విశాఖలోని తన మేనమామ ఇంటికి చేరుకున్నారు.
అక్కడ హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే ముఖలింగ దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు. 1879లో మెట్రిక్యులేషన్ పాసయిన తరువాత టీచరుగా పని చేస్తూ, చదువు కొనసాగించారు. 1886లో ఎఫ్.ఎను, 1896లో బి.ఎను
డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు స్కూలు కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. తెలుగు భాషా బోధనను వ్యావహారికంలో చేయాలన్న ఆయన ఆలోచనకు 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే ఆంగ్లేయుడి నుంచి మద్దతు లభించింది.
అప్పటి ఏ వీఎన్ కాలేజీ ప్రధానాధ్యాపకుడు శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, యేట్స్, గిడుగు రామమూర్తి పంతులు కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుటా ్టరు. అప్పటికే రామమూర్తి వ్యావహారిక భాషలో బోధన కోసం ప్రచారం చేస్తున్నారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను గిడుగు ప్రా రంభించారు. వీరి కృషి కారణంగా 19 12-13లో స్కూల్ ఫైనల్ బోర్డు తె లుగు వ్యాస పరీక్షను గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయొచ్చని ఆదేశాలు జారీ చేసింది.
అప్ప టి నుంచి స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో వెలువడడం మొదలుపెట్టాయి. ఆ తరువాత ప్రభుత్వం వేసిన ఒ క కమిటీలో గ్రాంథిక వాదులు ఆధిపత్యంతో వ్యావహారిక భా ష లో బోధనను రద్దు చేసినా అనంతర కాలంలో పున రు ద్ధరించారు. తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఆ యన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉత్తరాంధ్ర అడవుల్లో సవరులు అనే తెగ భా షను నేర్చుకుని అందులో వారికి బోధించారు. దీంతో మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదునివ్వగా ఆ తరువాత కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనకు లభించింది. వ్యావహారిక భాషకు ఇంత సేవ చేసిన గిడుగు రామమూర్తి 1940, జనవరి 22న మరణించారు.