జాతి ద్వారా భాషకు, భాష ద్వారా జాతికి ఒక విశిష్టమైన గౌరవం ఏర్పడుతుంది. ఒక జాతి పురోగమన మార్గమును తల్లిభాష ముందుండి నడిపిస్తుంది. తెలుగును రక్షించి, అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. తెలుగు వెలుగులను ప్రాచుర్యంలోకి తెస్తామన్న వాగ్ధానాలు తీర్చకపోగా.. ఇంకా నిరాదరణకు గురి కావడం చాలా బాధాకరం.
ఇంగ్లాండ్ నుంచి వచ్చి.. ఉద్యోగ శిక్షణలో భాగంగా తెలుగు నేర్చుకుని, భాషపై మమకారం పెంచుకొని, తాళపత్రాలు సేకరించి, మిణుకు మిణుకు మంటున్న తెలుగు దీపాన్ని వెలిగించాడు బ్రౌన్ దొర. ఒక విదేశీయుడు తెలుగు భాష కోసం అంత చేయగలిగినపుడు, మన ప్రభుత్వాలు మన భాషా సంరక్షణ కోసం ఇంకెంత చేయవచ్చు..? ఒక సారి ఆలోచించండి.