జీవితంలో దేనికోసం ఎదురు చూడకు. ఎదురు చూడడం అంటే జీవితాన్ని, విలువైన సమయాన్ని వృధా చేయడమే. సంతోషం రెండు కష్టాల మధ్య వచ్చే ఉపశమనం కాదు. అది కష్టపడి సంపాదించుకునే హృదయ సంస్కారం. మితిమించిన కోపం, సంతోషం, గర్వం, అసంతృప్తి, తానే గొప్పవాడినన్న అహం.. ఇలాంటివన్నీ లేనివాడే ఉత్తమ పురుషుడు. వివేకవంతుడు తాను ఏమి ఆలోచిస్తున్నాననే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వడు. తాను చేస్తున్న పని మాత్రమే ఇతరులకు తెలిసేటట్లుగా చేస్తాడు. అలాదే తాను ఓ పనికి ఉపక్రమించినప్పుడు ఎండావాన, ఇష్టాయిష్టాలను ఏమాత్రం లెక్కచేయడు.