మన రోజువారీ జీవనంలో అనేక వస్తువులని వినియోగిస్తూంటాం, అనేక సేవలు పొందుతుంటాం. టూత్ పేస్టు నుండి గదిలో ఫ్యాను వరకూ, పచారీ సరుకులు ఇంటికే తెప్పించుకోవడం నుండి బీమా, బ్యాంకు సేవల వరకు. అయితే, వీటిలో ఎన్ని తెలుగులో ఉంటున్నాయి?
ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి. రోజంతా మీరు వాడే వస్తు సేవల్లో తెలుగులో ఉన్నవి ఎన్ని లేనివి ఎన్ని చిట్టా రాయండి. అది కష్టం అనుకుంటే, వారాంతపు లేదా నెలవారీ కిరాణా సామాను కొన్నప్పుడు వచ్చే సామానులో ఎన్ని తెలుగులో ఉన్నాయో లెక్కించి చూడండి. తెలుగులో ఉండటం అంటే ఏమిటి? ఈ ఉండటం కొన్ని స్థాయిల్లో ఉండొచ్చు:
వస్తువు లేదా ఉత్పత్తి పేరు (బ్రాండు, లేదా కంపెనీ పేరు) తెలుగు అక్షరాలలో ఉండటం.
వస్తువును వాడుకోడానికి సూచనలు, జాగ్రత్తలు, హెచ్చరికలు తదితర సమాచారం తెలుగులో ఉండటం.
వస్తువు తయారీలో వాడిన పదార్థాల వివరాలు, పోషక విలువలు తదితర సమారారం తెలుగులో ఉండటం.
వస్తువు ధర, ఎప్పుడు ఎక్కడ తయారైంది తదితర వివరాలు తెలుగులో ఉండటం.
మీ ఓపికను బట్టి వీటంన్నింటనీ లెక్కగట్టండి