అందరమూ చిన్నప్పుడు ఇలాంటివి ఎపుడో ఒక సందర్భంలో అనుకుంటూ వుండే వుంటారు కదా
నేను చిన్నతనం లో ......
చేతులు షర్ట్ లోపల ఉంచి, నా 'చేతులు పోయాయి'అనేవాడిని.
4 రంగుల్లో ఒక పెన్ ఉంటె, అన్ని బటన్స్ ఒకేసారి నొక్కేసేవాడిని ఏంజరుగుతుందో చూసేందుకు.
భయపెట్టడానికి తలుపు చాటున నిల్చునే వాడిని, వచ్చేవారు ఎంతకీ రాకపోతే నేను విసుగెత్తి నెమ్మదిగా బయటికొచ్చేవాడిని !!
నిద్రపోయినట్టు నటించేవాడిని,అమ్మ నాన్న ఎవరోఒకరు బెడ్ వరకు ఎత్హుకు తీసుకు వెళ్తారు కదా అని .
బస్ /రైలులో వెళ్తుంటే , పైనున్న చందమామ మనల్ని follow అవుతున్నదని గుడ్డి నమ్మకం.
ఎలక్ట్రికల్ Switch ని ఆన్/ ఆఫ్ కాకుండా మధ్యలో నిలబెట్టే ప్రయత్నం చెయ్యడం.
రెండు వర్షపు చినుకులు ఒకదానివెంట ఒకటి కిటికీ కొననుండి జారితే ,అది ఒక పరుగు పందెం అనుకోవడం .
నేను చాల జాగర్త గా మోసుకొచ్చిన బాధ్యత...నా 'school bag '
పండులో గింజ మింగి, లోపల చెట్టు మొలుస్తుందేమనని భయపడడం.
ఫ్రిడ్జ్ తలుపు నెమ్మది గా మూస్తూ లోపల లైట్ వెలుగు ఎంతవరకు ఆరకుండా ఉంటుందో చూసే ప్రయత్నం.
రూమ్ బయటకు పరుగెతికొచ్చి, మరిచింది గుర్తొచ్చి మరల లోనికి పరుగెత్తడం
మీకు గుర్తుందా ! చిన్నప్పుడు ఎంత త్వరగా ఎదిగి పెద్దవుతామా అని కుతూహలం,