ఆచార్య చాణక్య తన చాణక్య నీతి పుస్తకంలో చాలా విలువైన విషయాలు తెలిపారు. ఇవి నేటికీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుండి గట్టెక్కించే అమూల్యమైన ఉపాయాల గురించి ఆచార్య చాణక్య తెలిపారు. సింహం ఎప్పటికీ హింసాయుత గుణాన్ని వదులుకోనట్లే.. దుర్మార్గుడు కూడా తన దుర్మార్గపు లక్షణాన్ని ఎప్పటికీ వదులుకోలేడు. అబద్ధాలు చెప్పే వ్యక్తి ఏదో ఒక రోజు తప్పకుండా ఇబ్బందుల్లో పడతాడు.
అటువంటి వ్యక్తి ఒక అబద్ధాన్ని దాచడానికి, చాలా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఏదోఒకరోజు చిక్కుల్లో పడాల్సివస్తుంది. ఫలితంగా విశ్వసనీయతను కూడా కోల్పోతాడు. అందుకే అబద్ధాలను ఆశ్రయించకూడదు. అబద్ధాలను ఆశ్రయించేవారి మాటలకు, చేతలకు పొంతన ఉండదు. అలాంటి వ్యక్తులు నమ్మదగినవారు కారు. నమ్మదగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే.. తన ఆలోచనలకు కార్యరూపం ఇస్తాడని, ఇతరులకు మార్గదర్శకునిగా ఉంటాడని ఆచార్య చాణక్య తెలిపారు. బుద్ధిమంతుడు ఉపాధి మార్గం లేని ప్రదేశానికి వెళ్లడని చాణక్య తెలిపారు. మనస్సులో తప్పు చేయాలనే ఉద్దేశంలేని వ్యక్తి దేనికీ భయపడడని చాణక్య పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అణకువతో మెలగాలని.. ఇలా చేయని వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని ఆచార్య చాణక్య తెలిపారు. ఇలాంటివారు తమకు తామే కోరి కష్టాలు తెచ్చుకుంటారని ఆచార్య హెచ్చరించారు.