స్ట్రాబెర్రీస్, ఆరెంజెస్, పైనాపిల్ వంటి ఫ్రూట్స్ లో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో మార్కెట్ లో ఈ పండ్లు దొరుకుతాయి.
* ఆల్కహాల్, కెఫీన్ తీసుకోవడం బాగా తగ్గించండి. ఈ సమయంలో వేడి వేడి టీ, కాఫీ తాగకుండా ఉండడం కష్టం కానీ తప్పదు మరి. వీటిని ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించండి. వీటిని తీసుకునేటప్పుడు ఇవి బాడీని డీహైడ్రేట్ చేస్తాయి అన్న విషయం గుర్తు పెట్టుకుంటే తర్వాత వీటి మీదకి అంత తొందరగా మనసు పోదు.
క్యాప్సికం:- పసుపు, ఆకుపచ్చ క్యాప్సికంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందు వల్ల శరీరంలో నీటి శాతం ఎక్కువ నిలుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యాప్సికం లో 93.9% నీరే ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ సీ, విటమిన్ బీ6, బీటా కెరొటిన్, థయామిన్, ఫోలిక్ ఆసిడ్ ఉన్నాయి.
టొమేటో :- టొమేటోతో పప్పు, కూరలు రకరకాలు చేస్తాం. చాలా కామన్ గా వాడే కూరగాయల్లో టొమేటో కూడా ఉంటుంది. ఇందులో తొంభై శాతం నీరే ఉంటుంది. ఇందువలన శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. పైగా టొమేటోలు బరువు తగ్గడంలో కూడా సహాయ పడతాయి. అంతే కాక టొమేటోలని పచ్చిగా కూడా తినవచ్చును.
పాల కూర:- పాలకూరని పోషకాల గని అని చెప్పవచ్చు. పాల కూర వల్ల స్కిన్, హెయిర్ కి ఎన్నో ప్రయోజనాలు సమకూరడంతో పాటూ ఈ చలి కాలంలో శరీరంలో నీరు ఉండేలా చూస్తుంది. ఆకుకూరలలో తొంభై శాతం నీరే ఉంటుంది. అంతే కాక పాల కూరలో ల్యుటీన్, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఈ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ చలి కాలంలో పాలకూర తీసుకోవడం తప్పనిసరి అవుతుంది.
కాలీఫ్లవర్ :- కాలీఫ్లవర్ మామూలుగా కూడా చాలా మందికి ఇది ఫేవరెట్ వెజిటబుల్ కూడా. కాలీ ఫ్లవర్ ని సూప్స్, సలాడ్స్, కర్రీస్, రైస్ లో వాడుకోవచ్చును. ఈ వెజిటబుల్ లో కూడా నిండుగా నీరే ఉంటుంది. ఒక కప్పు తరిగిన కాలీ ఫ్లవర్ వల్ల 50 ఎం ఎల్ నీరు లభిస్తుంది.
జామపండ్లు :- ఈ కాలంలో జమపండ్లను అధికంగా తింటే శరీరం పోడిబారకుండా రక్షణనిస్తుంది. ఈ జామపండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తిన్న ఆహరం అరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. మలవిసర్జనకు మంచి చిట్కా ఈ పండు.
ఆలివ్ ఆయిల్ :- కూరగాయలు వండడానికి ఆలివ్ ఆయిల్ ఆరోగ్యదాయిని అని చెబుతారు. ఇందులో ఉండే మంచి ఫ్యాట్స్, విటమిన్ ఈ శరీరం లోపలి నుండి పోషణని అందిస్తాయి. ఆలివ్ ఆయిల్ ని చర్మం మీద అప్లై చేసినా కూడా స్కిన్ కి మంచి పోషణ లభిస్తుంది. అందు వల్లనే వింటర్ సీజన్ లో దీన్ని చక్కని మాయిశ్చరైజర్ లా వాడుకోవచ్చును.
గుర్తు పెట్టుకోవాల్సిన విషయం :- చలికాలం వచ్చిందంటే మనం నీళ్ళు తాగడం మర్చిపోతామని అందరికీ తెలిసిన విషయమే. శరీరానికి నీరు ఎంత అవసరమో తెలిసి కూడా ఎండాకాలములో తాగినంత ఎక్కువగా మనం చలి కాలంలో నీళ్ళు తాగలేక పోతున్నాం. అసలు అలా తాగాలి అనే విషయం కూడా గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే చలికాలంలో మనకి చెమట పట్టదు. కానీ చలి గాలులకి బాడీలో నుండి మాత్రం మనకి తెలియకుండానే నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. పైగా ఈ కాలంలో మనకి అంత దాహంగా కూడా అనిపించదు, కాబట్టి నీళ్ళు తాగాలన్న సంగతే మర్చిపోతాం. కానీ తగినంత నీరు తాగకపోతే మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ బాగా బలహీనపడుతుంది. చలికాలంలో నీళ్ళను తాగుతూ ఉండడం వలన ఉండే ఆరోగ్య సూత్రాలు ఏమిటో గమనించండి